Breaking News

Day: August 24, 2020

రైతులకు పట్టాబుక్కులు పంపిణీ

రైతులకు పట్టాబుక్కులు పంపిణీ

సారథి న్యూస్, అచ్చంపేట: నాగర్​కర్నూల్ ​జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు సోమవారం తన క్యాంపు ఆఫీసులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా పేద దళిత రైతులకు పట్టాపాసు బుక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ​ఎల్.శర్మన్, నాగర్ కర్నూల్ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పోకల మనోహర్, అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ తులసీరాం, వివిధ గ్రామాల రైతులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్​లు, ఆర్డీవో, […]

Read More
ఆర్డీవోలకు స్థానచలనం

ఆర్డీవోలకు స్థానచలనం

హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఆర్డీవోలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సోమవారం సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. హైదరాబాద్ ఆర్డీవోగా ఎస్.మోహన్‌రావు నియమితులయ్యారు. అలాగే ఎల్లారెడ్డి ఆర్డీవోగా ఎస్.శ్రీను, ఆందోల్-జోగిపేట ఆర్డీవోగా వి.విక్టర్, వనపర్తి ఆర్డీవోగా పి.అమరేందర్, నిర్మల్ ఆర్డీవోగా రాథోడ్ రమేష్, బాన్స్ వాడ ఆర్డీవోగా బి.రాజాగౌడ్, మేడ్చల్-మల్కాజ్‌గిరి ఎస్డీసీగా జి.లింగ్యానాయక్ నియమితులయ్యారు.

Read More
మట్టి వినాయకుడికి అభిషేకం

వినాయకుడికి అభిషేకం

సారథి న్యూస్, కర్నూలు: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో భారీ విగ్రహాల ప్రతిష్టాపనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో ప్రజలు ఇళ్ల వద్దనే చిన్న చిన్న మట్టి విగ్రహాలను ఏర్పాటుచేసుకుని పూజిస్తున్నారు. నగరంలోని బుధవారపేట 15వ వార్డులో వైఎస్సార్​సీపీ సమన్వయకర్త కేదార్​నాథ్​ఇంటివద్దే మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించారు. రెండొందల బిందెల నీళ్లు తమ భక్తిని నాటుకున్నారు. మట్టి గణపయ్య విశిష్టతను తెలియజేసేలా ఈ వినాయకుడిని నిలబెట్టినట్లు తెలిపారు. భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారని తెలిపారు.

Read More
జెన్​కో ఉద్యోగుల మృతికి నివాళి

జెన్​కో ఉద్యోగుల మృతికి నివాళి

సారథి న్యూస్, అచ్చంపేట: శ్రీశైలం పవర్ హౌస్​లో సంభవించిన అగ్నిప్రమాద ఘటనలో మృత్యువాతపడిన తెలంగాణ జెన్​కో ఉద్యోగులకు సంఘీభావం తెలుపుతూ తోటి ఉద్యోగులు దోమలపెంట జెన్ కో కాలనీలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు పాల్గొని నివాళులర్పించారు. కార్యక్రమంలో హైడల్ డైరెక్టర్ వెంకట్ రాజాం, సీఈ ప్రభాకర్ రావు, టీఆర్ వీకేఎస్​నాయకులు రాఘవేంద్రరెడ్డి, సీఐటీయూ నాయకుడు సునిందర్, 327 యూనియన్​నుంచి యాదయ్య, ఇంజినీరింగ్ అసోసియేషన్ నుంచి అనిల్, చరణ్, ఏఐటీయూసీ […]

Read More

ప్రణాళికాబద్దంగా రైతువేదికలు

సారథి న్యూస్​, పెద్దపల్లి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతువేదిక నిర్మాణాలను ప్రణాళికాబద్దంగా, సకాలంలో పూర్తిచేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అధికారులను ఆదేశించారు. జిల్లాలో కొనసాగుతున్న రైతు వేదికల నిర్మాణంపై సోమవారం పంచాయతీరాజ్​శాఖ ఈఎన్సీతో కలిసి ఎన్టీపీసీలోని మిలీనియంహాల్​లో సంబంధిత అధికారులతో కలెక్టర్​ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. రైతులను సంఘటితం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పారు. నియంత్రిత వ్యవసాయసాగు ద్వారా రాష్ట్రంలోని రైతులంతా పెట్టుబడికి తగిన దిగుబడి సాధిస్తారని […]

Read More

దొంగలముఠా దొరికిందిలా..

సారథి న్యూస్​, గద్వాల: నిత్యం దొంగతనాలు చేస్తూ.. పోలీసులను పరుగులు పెట్టిస్తున్న ఓ ముఠా ఎట్టకేలకు చిక్కింది. జోగుళాంబ గద్వాల జిల్లా శాంతినగర్​ పీఎస్​ పరిధిలో గత మూడేండ్లుగా ఓ ముఠా తరుచూ దొంగతనాలకు పాల్పడుతున్నది. ఇప్పటికీ ఈ ముఠా సభ్యులు 11 దొంగతనాలు చేశారు. ఈ నెల 18న రాజోలి వైన్​షాప్​లో ఈ దొంగలు చోరీ చేసి రూ. 45 వేలు, మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లారు. సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు.. సోమవారం […]

Read More

ఆపదలో ఉన్నాం.. ఆదుకోండి

సారథిన్యూస్, రామడుగు: రోడ్డు ప్రమాదం అతడి జీవితాన్ని అతలాకుతలం చేసింది. తనను నమ్ముకున్న భార్యా, బిడ్డలను రోడ్డున పడేసింది. పనిచేసుకుంటే గానీ పూటగడవని ఆ కుటుంబానికి ఇప్పడు పెద్దకష్టమే వచ్చి పడింది. దాతలు ముందుకొచ్చి తమను ఆదుకోవాలని ప్రస్తుతం ఆ కుటుంబం దీనంగా వేడకుంటున్నది. కరీంనగర్​ జిల్లా రామడుగుకు చెందిన రాజశేఖర్​ మూడు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటినుంచి అతడు మంచానికే పరిమితమయ్యాడు. అతడికి మెదడులో రక్తం గడ్డకట్టిందని.. ఆపరేషన్​ చేసేందుకు రూ. […]

Read More

సోనియమ్మకే మళ్లీ పగ్గాలు

ఢిల్లీ: కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరుగకుండానే కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ భేటీ ముగిసింది. తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీనే కొనసాగించాలని కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ నిర్ణయం తీసుకున్నది. సోమవారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశంలోనే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారని ఊహాగానాలు వెల్లువెత్తడంతో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. అయితే పలు నాటకీయ పరిణామాల మధ్య సోనియా గాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. సోనియాగాంధీ పేరును పార్టీ సీనియర్​ నాయకులు మన్మోహన్​ […]

Read More