సామాజిక సారథి, తిమ్మాజీపేట: మండల కేంద్రంలో ఉన్న మద్యం గోదాంలో ఉన్న కాలం చెల్లిన మద్యాన్ని సోమవారం అధికారులు పార బోయించారు. దాదాపుగా 243లిక్కర్ కేసులు కాలం చెల్లింది. వీటిని మద్యం ప్రియులు సేవించకుండా పోయింది. దీనితో మద్యం డిపో మేనేజర్ లచ్చయ్య నాగర్ కర్నూల్ ఎక్సైజ్ సీఐ ఏడుకొండలు ఎస్ఐ అనుదీప్ సమక్షంలో కాలం చెల్లిన మధ్యాన్ని హమాలీలతో పరబోయించారు. వీటి విలువ దాదాపుగా రూ.12లక్షల దాకా ఉంటుందని డిపో అధికారులు తెలిపారు.
సామాజిక సారథి, తిమ్మాజీపేట: నూతన ఎక్సైజ్ సంవత్సరం సోమవారం నుంచి ప్రారంభం కావడంతో ఇటీవల లక్కీ డిప్ ద్వారా ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాలను దక్కించుకున్న యజమానులు మద్యం కోసం మండల కేంద్రంలోనీ టీఎస్పీసీఎల్ స్టాక్ పాయింట్ కు తరలి వచ్చారు. మొదటి రోజు 30 దుకాణాల యజమానులు లిక్కర్ బీరు తీసుకువెళ్లడానికి ఉమ్మడి జిల్లాల నుంచి దుకాణాల యజమానులు తరలివచ్చారు. తొలిరోజు రేషన్ పద్ధతిలో మద్యం అందించారు. అన్ని దుకాణాలకు మద్యం అందించాలన్న అధికారుల ఆదేశాల […]
మద్యం రవాణా కేసులో కానిస్టేబుల్ అరెస్టు టొయోటా కారు సీజ్.. 72 బాటిళ్లు స్వాధీనం గతంలో హోంగార్డు దొరికిన వైనం సారథి న్యూస్, కర్నూలు: పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం సరఫరా చేసే జాబితాలో సివిల్ పోలీసులు, హోంగార్డులు కూడా చేరుతున్నారు. జీతంతో సరి పెట్టుకోక.. అత్యాశ.. నన్నేవరూ ఏం చేయలేరన్న అహంభావంతో కొందరు పోలీసులు పక్క రాష్ట్రానుంచి మద్యం సరఫరా చేసే స్థాయికి దిగజారారు. సమాజంలో అవినీతి అక్రమాలు చోటుచేసుకోకుండా ఉండేందుకు అహర్నిశలు కష్టపడుతూ.. ప్రజకు […]
సారథిన్యూస్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తమకు కావల్సిన బ్రాండ్ దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మందుబాబులకు ఏపీ హైకోర్టు గుడ్‌న్యూస్ చెప్పింది. ఇక నుంచి ఎవరైనా ఇతర రాష్ట్రాలకు వెళ్లి తమకు నచ్చిన మూడు ఫుల్ బాటిళ్లు తెచ్చుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో తమకు కావాల్సిన బ్రాండ్లు దొరకక మందుబాబులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి తెచ్చుకుందామంటే పోలీసులు, ఎక్సైజ్ అధికారులు సీజ్చేస్తున్నారు. ఏపీలోకి ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకురానివ్వక పోవడంపై దాఖలైన ఓ వ్యక్తి రిట్ […]
సారథి న్యూస్, కర్నూలు: గతంలో ఎక్కడా కనిపించని బ్రాండ్లను తీసుకొచ్చి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని, దీనివల్ల తాగుడుకు అలవాటుపడిన పేదలు గంజాయి, నాటుసారా తాగుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పార్థసారధి ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విడత వారీగా మద్య నిషేధానికి తాము మద్దతిస్తామని, కానీ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సరైన, నాణ్యమైన మద్యం విక్రయించకపోతే ఎలా? అని ప్రశ్నించారు. ఇప్పుడు శానిటైజర్లు […]
చండీగఢ్: పంజాబ్‌లో కల్తీ మద్యం తాగి మరణించిన వారిసంఖ్య 86కు చేరింది. ఇప్పటికే తరన్ తరన్ జిల్లాలో 19, అమృత్‌సర్‌లో 11, బాటాల జిల్లాలో 9 మంది చనిపోయారు. తాజాగా శనివారం తరన్ తరన్‌లో మరో 44 మంది, అమృత్‌సర్‌లో ఒకరు, బాటాల జిల్లాలో ఇద్దరు చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 86కు చేరుకుంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు 10 మందిని అరెస్ట్‌చేశారు. ఏడుగురు ఎక్సైజ్ అధికారులు, ఆరుగురు పోలీసులను పంజాబ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. […]
చండీఘర్: పంజాబ్ రాష్ట్రంలో నకిలీ మద్యం సేవించి దాదాపు 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్ న్యాయవిచారణకు ఆదేశించారు. అమృత్సర్, బాటాలా, టరన్టరన్ ప్రాంతాలకు చెందిన వారు నకిలీ మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు పేర్కొన్నారు. ‘ఈ ఘటనపై న్యాయవిచారణకు ఆదేశించాను. దోషులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోం. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దు’ అంటూ సీఎం అమరీందర్‌సింగ్ ట్వీట్ చేశారు.
సారథి న్యూస్, రామగుండం: గ్రామాల్లో ఎవరైనా బెల్ట్‌షాపులు ఏర్పాటుచేసి అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుంటామని రామగుండం సీపీ సత్యనారాయణ హెచ్చరించారు. గురువారం పాలకుర్తి మండలం తక్కళ్లపల్లి గ్రామంలో పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది తనిఖీలు చేపట్టి ఓ ఇంట్లో నిలువ ఉంచిన రూ.31,405 విలువైన మద్యాన్ని సీజ్‌చేశారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో రెండు రోజులుగా బెల్టుషాపులపై దాడులు కొనసాగుతున్నాయి. తనిఖీల్లో టాస్క్ ఫోర్స్ సీఐ రాజ్ కుమార్, ఎస్సై షేక్ మస్తాన్, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది శేఖర్, మహేందర్, […]