Breaking News

Day: July 28, 2020

1,10,297 దాటిన కరోనా కేసులు

1,10,297 దాటిన కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో మంగళవారం 7,948 మందికి కరోనా పాజిటివ్‌ నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,10,297కు చేరింది. ఒకే రోజు 3,064 మంది కరోనా బాధితుల డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 56,527 కరోనా యాక్టివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. కొత్తగా కరోనాతో 58 మంది మృతిచెందారు. ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 1,148కు చేరింది. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం 740, చిత్తూరు 452, ఈస్ట్​గోదావరి 1367, గుంటూరు 945, కడప 650, […]

Read More

బొగ్గును దొంగిలిస్తే పీడీయాక్ట్​

  • July 28, 2020
  • COAL
  • PD ACT
  • Comments Off on బొగ్గును దొంగిలిస్తే పీడీయాక్ట్​

సారథిన్యూస్​, రామగుండం: సింగరేణిలోని బొగ్గును దొంగిలించనవారిపై పీడీ యాక్ట్​ కేసులు నమోదు చేస్తామని రామగుండం పోలీస్​ కమిషనర్​ వీ సత్యనారాయణ పేర్కొన్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో సింగరేణిలో తరుచుగా బొగ్గును దొంగిలిస్తున్న దుస్స దేవేందర్​పై పీడీ యాక్ట్​ నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. అనంతరం సదరు నిందితుడిపై కేసునమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

Read More
పువ్వాడ అజయ్​కుమార్​

కార్పొరేట్​ దవాఖానకు అన్నం దంపతులు

సారథిన్యూస్​, ఖమ్మం: కరోనా బాధితులకు సాయం చేస్తూ, కరోనా అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్న ప్రముఖ సామాజిక సేవకుడు అన్నం శ్రీనివాసరావు దంపతులకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. కాగా వీరిద్దరూ మద్దులపల్లి కరోనా కేర్​సెంటర్​లో చికిత్సపొందుతున్నారు. అక్కడ వారిని ఎవరూ పట్టించుకోకపోవడం, వైద్యం సరిగ్గా అందకపోవడంతో తమకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి పువ్వాడ అజయ్​ను కోరారు. వెంటనే స్పందించిన మంత్రి వీరిద్దరినీ ప్రత్యేక అంబులెన్స్​లో హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్​లోని మమత […]

Read More

కరోనా కాటేస్తుంది జాగ్రత్త

సారథిన్యూస్​, నల్లగొండ: కరోనా పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యుత్​శాఖ మంత్రి జగదీశ్​రెడ్డి పేర్కొన్నారు. సన్నిహితులు, స్నేహితులే కదా అని పార్టీలకు వెళితే కరోనా అంటించుకోవడం ఖాయమని పేర్కొన్నారు. విందు, వినోదాలతోనే కరోనా అధికంగా వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నారు. మన చుట్టే ఎంతోమంది కరోనా రోగులు ఉండొచ్చన్నారు. అందువల్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. త్వరలో గ్రామీణప్రాంతాల్లోనూ టెస్టులు చేస్తామాని చెప్పారు. మంగళవారం ఆయన వర్తక, వాణిజ్య సంఘాలతో టెలీ కాన్ఫరెన్స్​ నిర్వహించారు. కరోనా కట్టడి కోసం […]

Read More
భార్యను చంపిన భర్త

వివాహిత హత్య.. చంపింది తొమ్మిదో భర్త

సారథిన్యూస్​, రంగారెడ్డి: ఓ వివాహిత హత్యకు గురైంది. కాగా ఆమెను చంపింది తొమ్మిదో భర్త కావడం విశేషం. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా పహాడిషరీఫ్​ పరిధిలోని శ్రీరామ కాలనీలో చోటుచేసుకున్నది. వరలక్ష్మి (35)ని కొంతకాలం క్రితం శ్రీరామ కాలనీకి చెందిన నాగరాజు (36) వివాహం చేసుకున్నాడు. కాగా వరలక్ష్మి అప్పటికే ఎనిమిది పెళ్లిళ్లు చేసుకొని.. వేర్వేరు కారణాలతో భర్తలకు విడాకులు ఇచ్చింది. నాగరాజు ఆమెకు తొమ్మిదోభర్త. కాగా ఇటీవల భార్య, భర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. మంగళవారం […]

Read More
యువకుడి ఆత్మహత్య

బట్టతల వస్తోందని యువకుడు ఆత్మహత్య

సారథిన్యూస్​, హైదరాబాద్​: బట్టతల వస్తోందని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన హైదరాబాద్​ ఉప్పల్​లోని సత్యానగర్​లో మంగళవారం చోటుచేసుకున్నది. వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన నితిన్ ఉప్పల్​ ఉంటున్నాడు. క్యాటరింగ్​ పనులు చేస్తే జీవనం సాగిస్తున్నాడు. క్యాటరింగ్​తో వచ్చిన డబ్బులను కొన్ని ఇంటికి పంపిస్తూ.. మరికొన్ని హెయిర్​ ట్రాన్స్​ప్లాంటేషన్​ కోసం దాచుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవల అతడి సోదరి పెళ్లి కోసం డబ్బు కావాలని ఇంటి నుంచి సమాచారం వచ్చింది. మరోవైపు కరోనాతో క్యాటరింగ్​ పనులు నిలిచిపోయాయి. […]

Read More
సారు మీకిది న్యాయమా..?

సారు మీకిది న్యాయమా..?

సారథి న్యూస్​ : కొందరు పోలీసులు ప్రజలపట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. చిన్న చిన్న తప్పులకే వారిపై దాడులకు దిగుతున్నారు. తాజాగా హెల్మెట్ ధరించలేదని ఓ యువకుడిపై తాళం చెవితో దాడి చేశారు పెట్రోలింగ్ పోలీసులు. యువకుడి నుదుటిపై తాళం చెవితో పోడిచారు. ఉత్తరాఖండ్‌లోని రుద్రాపుర్‌ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన స్థానికులు పోలీసు స్టేషన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిపై లాఠీ చార్జీ చేశారు. ఈ ఘటనపై మండిపడ్డ జిల్లా పోలీసు […]

Read More
సెప్టెంబర్‌ 5నుంచి పాఠశాలలు ప్రారంభం

సెప్టెంబర్‌ 5నుంచి పాఠశాలలు ప్రారంభం

ప్రకటించిన సీఎం జగన్‌ సారథి న్యూస్​, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ కారణంగా మూతపడిన పాఠశాలలు సెప్టెంబరు 5వ తేదీన ప్రారంభం అవుతున్నాయని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఆగష్టు 31 నాటికి పాఠశాలల్లో నాడు-నేడు పనులు పూర్తి కావాలని అధికారులను సీఎం ఆదేశించారు. నాడు-నేడు పనులపై రెండు రోజులకోసారి జిల్లా కలెక్టర్లు సమీక్ష చేయాలని సూచించారు.అదేవిధంగా ఆగస్టు 15న రాష్ట్రంలో పేదలకు […]

Read More