Breaking News

YS JAGAN

బద్వేలులో వైఎస్సార్ సీపీ ఘనవిజయం

బద్వేలులో వైఎస్సార్ సీపీ విన్​

బద్వేలు: కడప జిల్లా బద్వేలు ఉపఎన్నికలో వైఎస్సార్​ సీపీ ఘనవిజయం సాధించింది. మంగళవారం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలి రౌండ్‌ నుంచి స్పష్టమైన ఆధిక్యం కనబరిచిన వైఎస్సార్​సీపీ అభ్యర్థి దాసరి సుధ విజయాన్ని విజయబావుటా ఎగరవేశారు. 90,411 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మొత్తం 13 రౌండ్లు ముగిసే సరికి వైఎస్సార్​సీపీకి 1,12,072, బీజేపీకి 21,661, కాంగ్రెస్‌కు 6,217, నోటాకు 3,636 ఓట్లు పోలయ్యాయి. వైఎస్సార్​సీపీ హవా ముందు ఇతర పార్టీలు పోటీ ఇవ్వలేకపోయాయి.

Read More
తిరుపతిలో గురుమూర్తి ఘనవిజయం

తిరుపతిలో గురుమూర్తి ఘనవిజయం

ఫ్యాన్​గాలికి కొట్టుకుపోయిన విపక్షాలు మిన్నంటిన వైఎస్సార్​సీపీ సంబరాలు తిరుపతి: తిరుపతి పార్లమెంట్​ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో వైఎస్సార్​ కాంగ్రెస్ ​పార్టీ అభ్యర్థి గురుమూర్తి 2,31,943 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచీ ఆయన ఆధిక్యం కనబరిచారు. వైఎస్సార్​ సీపీకి 5,37,152 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీకి 3,05,209 ఓట్లు వచ్చాయి. ఇక జనసేనతో కలిసి ఎన్నికల బరిలో దిగిన బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు 50,739, కాంగ్రెస్​ అభ్యర్థి చింతా మోహన్​ […]

Read More
డిగ్రీ చదివితే ఉద్యోగాలు రావాలి

డిగ్రీ చదివితే ఉద్యోగాలు రావాలి

విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచాలి అటానమస్ కాలేజీల్లో పరీక్షల విధానంలో మార్పులు ఏపీ సీఎం వైఎస్ జగన్​మోహన్​రెడ్డి కీలక నిర్ణయాలు అమరావతి: ఈ సంవత్సరం భర్తీ చేయనున్న పోస్టులపై క్యాలెండర్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్​మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డిగ్రీపట్టా సాధిస్తే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉండాలని, నైపుణ్యం లేకుండా ఇంటర్వ్యూలు కూడా ఎదుర్కొలేమని పేర్కొన్నారు. ఉగాది రోజున పోస్టుల భర్తీకి క్యాలెండర్ విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఏడాది ఆరువేల మంది పోలీసుల […]

Read More
పార్టీ ప్రకటనపై షర్మిల కీలక వ్యాఖ్యలు

పార్టీ ప్రకటనపై షర్మిల కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్​: తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లి.. రాజన్న సంక్షేమ ఫలాలతో ఆయన పాలన తేవాలని భావిస్తున్న వైఎస్ షర్మిల కీలక ప్రకటన చేశారు. తన రాజకీయ అరంగేట్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీకి ఏజెంట్ ను కాదని, ఎవరితోనూ పొత్తు అక్కర్లేదని, టీఆర్ఎస్, బీజేపీ అడిగితే రాజకీయాల్లోకి రాలేదని స్పష్టంచేశారు. ఏ పార్టీతోనూ తనకు సంబంధం లేదని తేల్చిచెప్పారు. గురువారం హైదరాబాద్ లోటస్ పాండ్ లో తనను అభిమానులు కలిసిన సందర్భంగా […]

Read More
సంక్షేమ పథకాలతో అందరి జీవితాల్లో వెలుగులు

పథకాలతో అందరి జీవితాల్లో వెలుగులు

సారథి న్యూస్, నరసన్నపేట: ప్రజారంజక సంక్షేమ పథకాలతో అందరి జీవితాల్లో వెలుగులు నింపిన వైఎస్​జగన్​మోహన్​రెడ్డి చిరకాలం రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగుతారని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ప్రజాసంకల్పయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ‘ప్రజల్లో నాడు.. ప్రజల కోసం నేడు’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నరసన్నపేట పైడితల్లి అమ్మవారి ఆలయం నుంచి వైఎస్సార్ ​జంక్షన్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇడుపులపాయలో మొదలుపెట్టి 14 నెలల పాటు 3,648 కిమీ. పొడవునా 134 […]

Read More
కరోనా మృతుల తరలింపునకు టోల్​ఫ్రీ నం.

కరోనా మృతుల తరలింపునకు టోల్​ఫ్రీ నం

సారథి న్యూస్, కర్నూలు: కరోనా బారినపడి చనిపోయిన వారిని అంబులెన్స్​లో తరలించేందుకు వీలుగా సీఎం వైఎస్​జగన్​మోహన్​రెడ్డి స్ఫూర్తితో కర్నూలు నగర ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ టోల్​ఫ్రీ నంబర్​ను శుక్రవారం ప్రారంభించారు. ఎవరైన చనిపోతే తరలించేందుకు 9440879791 నంబర్​కు ఫోన్​ చేసి ఉచిత సహాయం పొందవచ్చని కోరారు. ఇన్​చార్జ్ ​మెహబూబ్​ అందుబాటులో ఉంటారని ప్రకటించారు.

Read More
‘చంద్రబాబు దళితులకు చేసిందేమీ లేదు’

‘చంద్రబాబు దళితులకు చేసిందేమీ లేదు’

సారథి న్యూస్​, కర్నూలు: వచ్చే ఎన్నికల్లో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అడ్రస్​ గల్లంతు కావడం ఖాయమని వైఎస్సార్ ​సీపీ నగర సమన్వయకర్త మాదారపు కేదార్ నాథ్ అన్నారు. సోమవారం బాపట్ల ఎంపీ నందిగామ సురేష్, వేమూరు ఎమ్మెల్యే మెరుగు నాగార్జున పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కర్నూలు పాత బస్టాండ్​ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. […]

Read More
7 నుంచి ‘వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ’ షురూ

7 నుంచి ‘వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ’ షురూ

సారథి న్యూస్​, కర్నూలు: బాలింతలు, గర్భిణులకు ఆరోగ్య భరోసా కల్పిస్తూ రాష్ట్రప్రభుత్వం సెప్టెంబర్​ 7 నుంచి ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం అమలుకు ఏర్పాట్లు చేశామని ఐసీడీఎస్‌ పీడీ శారద భాగ్యరేఖ తెలిపారు. పథకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా క్యాంపు ఆఫీసు నుంచి ప్రారంభిస్తారని తెలిపారు. జిల్లాలోని రైతు భరోసా కేంద్రాల్లో వెబ్‌ టెలికాస్ట్‌ను ప్రజాప్రతినిధులు, ఐసీడీఎస్‌ సిబ్బంది, లబ్ధిదారులతో కలిసి కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాటుచేస్తామన్నారు. ఐసీడీఎస్‌ […]

Read More