భువనగిరి కలెక్టరేట్ లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం వారించిన సిబ్బంది సామాజికసారథి, యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. బాధితుడి కథనం.. బుడిగే మహేశ్ తండ్రి ఉప్పలయ్య ఆలేరు మండలం కొలనుపాకలో 20ఏళ్ల క్రితం నాలుగు ఎకరాల భూమిని రూ.ఆరువేలకు కొన్నాడు. ఇప్పటి వరకు పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వకపోవడంతో లోన్లు, ఇతర సౌకర్యాలు రావడం లేదు. దీంతో మహేశ్ మనస్తాపం చెందాడు. […]
సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: వివిధ సమస్యల నిమిత్తం కలెక్టరేట్ కు వచ్చే సందర్శకులు, అర్జీదారుల కోసం జిల్లా అధికార యంత్రాంగం మీసేవ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. మీసేవ కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ హనుమంతరావు సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరణి కి సంబంధించి మీ సేవలో దరఖాస్తు చేసుకోవడానికి సులువుగా ఉంటుందని అన్నారు. ఆయనవెంట అదనపు కలెక్టర్ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లా కలెక్టరేట్ సుందరీకరణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కార్యాలయం చుట్టూ గడ్డి పరిచి అందమైన పూలమొక్కలను నాటారు. ఆడిటోరియం చుట్టూ మొక్కలు నాటారు. వాహనాల పార్కింగ్ కోసం షెడ్డు నిర్మాణం కూడా పూర్తయింది. టాయిలెట్ బ్లాక్ నిర్మాణం చేపట్టారు. నీటి ట్యాంకు, పెద్ద సంప్నిర్మాణం పూర్తయింది. వివిధ అవసరాలకు వచ్చే ప్రజానీకానికి కార్యాలయ ఆవరణలో వెయిటింగ్హాలును ఏర్పాటు చేశారు. కార్యాలయం ప్రహరీ ఎత్తు పెంచి, భద్రతను మరింత పటిష్టం చేస్తున్నారు. భద్రత, […]
సారథిన్యూస్, శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జలకళ పథకం పేదరైతులకు వరం లాంటిదని సీఎం వైస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలో 2 లక్షల వ్యవసాయ బోర్లు వేస్తున్నట్టు చెప్పారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వచ్చే నాలుగు సంవత్సరాలలో రూ.2,340 కోట్లతో 2 లక్షల బోర్లు ఉచితంగా వేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. ఈ పథకం కోసం […]
సారథి న్యూస్, కృష్ణా : ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా కలెక్టరేట్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. రెండు రోజుల క్రితం కలెక్టరేట్ వంద ఉద్యోగులకు కరోనా పరీక్షలు చేయించారు. ఈ క్రమంలో ఒక్కొక్కటిగా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. నేరుగా ఉద్యోగుల ఫోన్లకు వస్తున్న ఫలితాల రిపోర్టులు చూసి సహచరులు భయపడుతున్నారు. ఇప్పటికే 15 మందికి పైగా పాజిటివ్ గా రిపోర్టులు వచ్చాయి.