కేసీఆర్ దే ప్రాజెక్టు పనులు ఆపివేసిన బాధ్యత తాగునీటి పేరుతో ఎన్జీటీని మోసం చేసే యత్నం దక్షిణ తెలంగాణకు తీరని ద్రోహం చేశాడు ఎండిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డి వ్యాఖ్యలు సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: ఇక పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పనైపోయిందని మాజీమంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి ఎద్దేవాచేశారు. ప్రాజెక్టు పనుల నిలిపివేతకు పూర్తి బాధ్యత సీఎం కేసీఆర్ దేనని అన్నారు. జిల్లాలోని ప్రాజెక్టులను తాగునీటి ప్రాజెక్టులని […]
సారథి న్యూస్, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో రూ.1.8 కోట్ల వ్యయంతో నిర్మించిన సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సోమవారం ప్రారంభించారు. రెండు అంతస్తుల్లో నిర్మించిన భవనంలో వసతులు బాగున్నాయని కితాబిచ్చారు. సత్వర సేవలు అందించి జిల్లాలోనే నంబర్వన్ట్రెజరీగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో 76 సబ్ ట్రెజరీ భవనాలకు ఒకేసారి నిర్మాణ అనుమతులు వస్తే నరసన్నపేటలో భవనం మొదటిసారిగా ప్రారంభానికి నోచుకోవడం గొప్ప విషయమని అన్నారు. అంతకుముందు ఆయన పూజలు చేశారు. […]
సారథి న్యూస్, శ్రీకాకుళం: ఏపీ సీఎం డాక్టర్వైఎస్జగన్మోహన్రెడ్డి 56మంది కార్పొరేషన్ల చైర్మన్లు, 672 మంది డైరెక్టర్లను ప్రకటించిన శుభ సందర్భంగా ఇందులో మహిళలకు 50శాతం పైగా రిజర్వేషన్లు కల్పించడం మరో విశేషమని మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు, రాష్ట్రమంత్రి సీదిరి అప్పలరాజు, కేంద్రమాజీ మంత్రి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు డాక్టర్కిల్లి కృపారాణి కొనియాడారు. డాక్టర్వైఎస్రాజశేఖరరెడ్డి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఏడు రోడ్ల కూడలిలో వైఎస్సార్విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేవలం 16నెలల్లోనే వివిధ పథకాల ద్వారా […]
సారథి న్యూస్, పాలకొండ(శ్రీకాకుళం): రాష్ట్రంలో రైతును రాజుగా చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృఢసంకల్పంతో ఉన్నారని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పాలకొండలో చెరుకు రైతుల అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఇది రైతన్నల ప్రభుత్వమని, విద్య, వైద్యం, వ్యయసాయం, సంక్షేమాలపై ప్రత్యేకశ్రద్ధ వహిస్తుందన్నారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన ఎరువులు, నాణ్యమైన విత్తనాలను సరఫరా చేస్తున్నామని వివరించారు. జిల్లాలో చెరుకు పంట విస్తీర్ణం పెంచాలన్నారు. తద్వారా చెరుకు ఫ్యాక్టరీ […]
సారథిన్యూస్, శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జలకళ పథకం పేదరైతులకు వరం లాంటిదని సీఎం వైస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలో 2 లక్షల వ్యవసాయ బోర్లు వేస్తున్నట్టు చెప్పారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వచ్చే నాలుగు సంవత్సరాలలో రూ.2,340 కోట్లతో 2 లక్షల బోర్లు ఉచితంగా వేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. ఈ పథకం కోసం […]
సారథి న్యూస్, కర్నూలు: తాడేపల్లి క్యాంపు ఆఫీసును నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’ పథకాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ (ప్లస్) పథకం ద్వారా జిల్లాలో మైదాన ప్రాంతం, చెంచు గిరిజన కాలనీల్లో ఉన్న 3,549 అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన 3,93,472 మంది చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా సంపూర్ణ పోషకాహారాన్ని అందిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి […]
సారథి న్యూస్, కర్నూలు: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీవర్షాలకు వరద నీరు పోటెత్తడంతో శ్రీశైలం 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శుక్రవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బృందం శ్రీశైలం జలాశయం ప్రాజెక్టు ను సందర్శించి గేట్లను పరిశీలించి.. డ్యాంకు వస్తున్న వరద పరిస్థితి, ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో వివరాలను నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. డ్యాం ఎడమ గట్టున ఉన్న తెలంగాణ జెన్ కో పవర్ హౌస్ […]
సారథి న్యూస్, ఎమ్మిగనూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమైందని ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి మండిపడ్డారు. దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3వ స్థానంలో ఉందని గుర్తుచేశారు. బుధవారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. జాతీయస్థాయిలో కరోనా కేసుల రికవరీ రేటు శాతం దాదాపు 69.29% ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10% తక్కువగా 60.8% నమోదవుతుందన్నారు. కరోనా క్వారంటైన్ […]