Breaking News

Day: June 18, 2023

‘రాత్రి రానుందుకు’ యువతిపై దాడి

‘రాత్రి రానుందుకు’ యువతిపై దాడి

  • June 18, 2023
  • Comments Off on ‘రాత్రి రానుందుకు’ యువతిపై దాడి

సామాజికసారథి, నాగర్​ కర్నూల్​ బ్యూరో: ‘ఒక రాత్రి నా వద్ద రమ్మని’ యువకుడు.. ఓ యువతిని అడిగారు. ఆమె అంగీకరించకపోవడంతో ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. చావు దెబ్బలు కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన ఆదివారం నాగర్​ కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలం పాలెంలో వెలుగుచూసింది. బాధితురాలి కథనం.. గ్రామానికి చెందిన ఓ యువకుడు(23), యువతి(22) ఇండ్లు పక్కపక్కనే ఉన్నాయి. అమ్మాయి కూడా పక్క ఇళ్లే కదా అని చనువుగా మాట్లాడేది.. […]

Read More

గ్రీన్‌ అవార్డులు అందుకున్న అరవింద్‌ కుమార్‌

సామాజికసారథి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ మున్సిపల్​ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ లండన్‌లో గ్రీన్‌ యాపిల్‌ అవార్డులను అందుకున్నారు. మొజాంజాహీ మార్కెట్‌, సచివాలయం, దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి, పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, యాదగిరిగుట్ట దేవాలయానికి గ్రీన్‌ యాపిల్‌ అవార్డులు వచ్చాయి. ఇంటర్నేషనల్‌ బ్యూటిఫుల్‌ బిల్లింగ్స్‌ క్యాటగిరీలో ఈ అవార్డులు లభించాయి. దేశంలోని నిర్మాణాలు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకోనుండడం ఇదే తొలిసారి కాగా, ఒక్క తెలంగాణకే ఐదు విభాగాల్లో […]

Read More

2047 నాటికి భారత్‌ నంబర్‌ వన్‌

– ప్రపంచం నలుమూలలా భారత్‌ టెక్కీలు– జీఎఫ్‌ఎస్‌టీ సదస్సులో చంద్రబాబు సామాజికసారథి, హైదరాబాద్‌: ప్రపంచ దేశాల్లో 2047 నాటికి ఇండియన్స్‌ నెంబర్‌వన్‌గా ఉంటారని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లో డీప్‌ టెక్నాలజీస్‌ అంశంపై జీఎఫ్‌ఎస్‌టీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీఎఫ్‌ఎస్‌టీ చైర్మన్‌ హోదాలో చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్నాలజీని అందిపుచ్చుకుంటే అన్నీ సాధ్యమేనని చెప్పారు. ఐటీతో ప్రపంచమంతా భారతీయులు విస్తరించారని తెలిపారు. 2047 నాటికి భారత్‌ […]

Read More

ముహూర్తం ఖరారు!

– కాంగ్రెస్‌లోకి పొంగులేటి, జూపల్లి– పార్టీలో చేరడంపై స్పష్టత ఇచ్చిన నేతలు– 30న కాంగ్రెస్‌ ఖమ్మం సభలో చేరిక సామాజికసారథి, హైదరాబాద్‌: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైంది. ఆయన ఏ రోజు కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే దానిపై కూడా స్పష్టత వచ్చింది. ఈ నెలాఖరున అంటే జూన్‌ 30న పొంగులేటి కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నారు. పొంగులేటితో పాటు జూపల్లి కృష్ణారావు తదితరులు కాంగ్రెస్‌ గూటికి చేరనున్నారు. ఈనెల 22న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ […]

Read More

ఇదిగో లెక్క!

– తెలంగాణ అభివృద్ధికి రూ.5 లక్షల 27వేల కోట్లు– వివిధ కార్యక్రమాలకు కేంద్రం ప్రభుత్వం మంజూరు– గుజరాత్‌ కంటే తెలంగాణకే ఎక్కువ నిధులు– కేంద్రమంత్రి జి.కిషన్‌ రెడ్డి ప్రజెంటేషన్​ సామాజికసారథి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా తెలంగాణలో రూ.5 లక్షల 27వేల కోట్లు ఖర్చు చేసిందని కేంద్రమంత్రి జి.కిషన్‌ రెడ్డి వెల్లడించారు. 2017లో జీఎస్టీ ప్రవేశపెట్టినప్పటి నుంచి కేంద్రం తెలంగాణకు రూ. 8,379 కోట్లు ఇచ్చిందని తెలిపారు. తొమ్మిదేళ్లలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన […]

Read More

రూ.50వేలకు కక్కుర్తి

– లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తెలంగాణ వర్సిటీ వీసీ– వీసీ ఇంట్లో 8 గంటల పాటు సోదాలు– పలు కీలకపత్రాలు స్వాధీనం.. అనంతరం అరెస్ట్‌ సామాజికసారథి, హైదరాబాద్‌: నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ దాచేపల్లి రవీందర్‌ గుప్తాను ఏసీబీ అధికారులు శనివారం సాయంత్రం అరెస్ట్​ చేశారు. తార్నాకలోని ఆయన నివాసంలో దాదాపు 8గంటల పాటు సోదాలు నిర్వహించిన అనంతరం రవీందర్‌ గుప్తాను అరెస్టు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు ప్రకటించారు. నిజామాబాద్‌ జిల్లా పరిధిలోని భీమ్‌గల్‌లో […]

Read More