Breaking News

2047 నాటికి భారత్‌ నంబర్‌ వన్‌

– ప్రపంచం నలుమూలలా భారత్‌ టెక్కీలు
– జీఎఫ్‌ఎస్‌టీ సదస్సులో చంద్రబాబు

సామాజికసారథి, హైదరాబాద్‌: ప్రపంచ దేశాల్లో 2047 నాటికి ఇండియన్స్‌ నెంబర్‌వన్‌గా ఉంటారని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లో డీప్‌ టెక్నాలజీస్‌ అంశంపై జీఎఫ్‌ఎస్‌టీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీఎఫ్‌ఎస్‌టీ చైర్మన్‌ హోదాలో చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్నాలజీని అందిపుచ్చుకుంటే అన్నీ సాధ్యమేనని చెప్పారు. ఐటీతో ప్రపంచమంతా భారతీయులు విస్తరించారని తెలిపారు. 2047 నాటికి భారత్‌ నెంబర్‌వన్‌గా అవతరించనున్నదని పేర్కొన్నారు. తెలుగు ప్రజలు టార్చ్‌ బేరర్‌గా నిలుస్తారని చంద్రబాబు చెప్పారు. జీఎఫ్‌ఎస్‌టీ ముఖ్య ఉద్దేశం ప్రపంచంలోనే భారత్‌ నెంబర్‌వన్‌ ఆర్థిక వ్యవస్థగా మారడానికి తీసుకురావాల్సిన విధానాలు, టెక్నాలజీపై ఈ సదస్సులో చర్చించారు. పాలసీల రూపకల్పన, రీసెర్చ్‌, నాలెడ్జ్‌ షేరింగ్‌ అంశాలపై జీఎఫ్‌ఎస్‌టీ పనిచేస్తోంది. జీఎఫ్‌ఎస్‌టీ ఎలాంటి లాభాపేక్ష లేని సంస్థగా పనిచేస్తోంది. ఇది మూడేళ్ల కిందట ఏర్పాటైంది. ఆ సంస్థలో ఆర్థిక నిపుణులు, పర్యావరణ వేత్తలు, రిటైర్డ్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పనిచేసిన అధికారులు, మీడియా రంగానికి చెందిన ప్రముఖులు ఉన్నారు.