సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో వరుసగా నాలుగో రోజు వరద ప్రభావిత ప్రాంతాలను తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పరిశీలించారు. రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో వరదల్లో చనిపోయిన పలువురికి రూ.ఐదులక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెక్కులను అందజేశారు. పారిశుద్ధ్యంపై ప్రధానంగా దృష్టిసారించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. అంటురోగాలు ప్రబలకుండా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు […]
హైదరాబాద్: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో హైదరాబాద్ శివారు ప్రాంతాలు వణికిపోతున్నాయి. నగరంలోని అనేక కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సుమారు 1500 కాలనీల్లో నడుముల లోతు మేర వరద నీరు చేరింది. కాలనీల్లో వరద నీరు ఉధృతంగా ప్రహహిస్తుండడంతో అధికారులు బోట్లు, నాటుపడవల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కనీసం మూడు రోజుల వరకు నగరవాసులు బయటకు రావొద్దని హెచ్చరించారు.అత్యవసర సేవల కోసం 040 – 211111111, జీహెచ్ఎంసీ […]
సారథి న్యూస్, హైదరాబాద్: మొక్కజొన్న పంట, దాని ఉత్పత్తి, మద్దతు ధరల విషయంలో అధికార టీఆర్ఎస్ నేతలకు స్పష్టత కొరవడిందా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ అంశంపై సీఎం కేసీఆర్ సమక్షంలో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, అందుకు భిన్నంగా అధికార పార్టీకి చెందిన చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి పార్లమెంట్లో మరో రకమైన వాదన వినిపించారు. ‘దేశంలో ప్రస్తుతం 2.42 కోట్ల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు మాత్రమే అవసరం. కానీ […]
సారథి న్యూస్, హైదరాబాద్: అక్టోబర్ 13, 14వ తేదీల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సోమవారం సమావేశాల ఏర్పాట్లను అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరిశీలించారు. సభ్యుల మధ్య భౌతిక దూరం ఉండేలా సీట్లను ఏర్పాటు చేయాలని కార్యదర్శి ఆదేశాలు జారీచేశారు. సభ లోపల శానిటేషన్ చేయాలని సూచించారు. అలాగే సమావేశాల బందోబస్తుపై డీజీపీ, పోలీస్ కమిషనర్‌తో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. అలాగే కరోనా మహమ్మారి […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో సోమవారం(24 గంటల్లో) 1,873 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 1,24,963 కు చేరింది. మహమ్మారి బారినపడి తాజాగా 9 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 827కు చేరింది. వ్యాధి బారినపడి నిన్న ఒకరోజే 1,849 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు 92,837 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 31,299 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 76.55 […]
సారథి న్యూస్, నాగర్‌కర్నూల్: జీహెచ్ఎంసీకి పరిమితమైందనుకున్న కరోనా మహమ్మారి మారుమూల పల్లెలకు పాకుతున్నది. శుక్రవారం ఒక్కరోజే నాగర్‌కర్నూల్ జిల్లాలో 33 కొత్తకేసులు నమోదయ్యాయని డీఎంహెచ్‌వో సుధాకర్లాల్ తెలిపారు. నాగర్‌కర్నూల్ పట్టణంలో ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎస్బీఐలో పనిచేస్తున్న ఐదుగురు సిబ్బందికి, సంతబజార్‌కు చెందిన ఓ మహిళకు కరోనా సోకింది. వీరితో పాటు అచ్చంపేట పట్టణానికి చెందిన 15 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. లింగాల మండలం అంబటి పల్లిలో ముగ్గురికి కరోనా సోకింది. […]
సారథి న్యూస్, హైదరాబాద్: తాము చేయాల్సిన పని చేయకుండా ఇతరులపై నిందలు మోపడం బీజేపీకి కొత్తేమీకాదు.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సి.కిషన్ రెడ్డి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంపై గుప్పిస్తున్న విమర్శలు దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా భావించవచ్చు. హైదరాబాద్ మహానగరం డేంజర్ జోన్లో ఉందని ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తున్న ఆయన కేంద్రం రాష్ట్రానికి ఎలాంటి సాయాలూ చేయలేదన్న విషయాలను మాత్రం ప్రస్తావించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి వెంటీలేటర్లు అడిగితే కేవలం 50 ఇచ్చి చేతులు […]
సారథి న్యూస్, హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి చాలా వేగంగా విజృంభిస్తోంది. తెలంగాణలో శనివారం 1087 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొదటిసారి వెయ్యి కేసులు దాటాయి. వ్యాధి బారినపడి ఆరుగురు మృత్యువాతపడ్డారు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 888, రంగారెడ్డి 74, మేడ్చల్ 37, నల్లగొండ 35.. ఇలా రాష్ట్రంలో మొత్తం 13,436 పాజిటివ్‌కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటి వరకు 243 చనిపోయారు.