హైదరాబాద్: ఈనెల 4న కౌంటింగ్ నిలిచిపోయిన నేరేడ్మెట్ లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది. 668 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి గెలుపొందారు. తాజా విజయంతో జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ కార్పొరేటర్ల సంఖ్య 56కు చేరింది. అయితే ఇతర గుర్తులు ఉన్న 544 ఓట్లలో టీఆర్ఎస్కు 278 ఓట్లు వచ్చాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల కౌటింగ్ సందర్భంగా నిలిచిపోయిన నేరేడ్మెట్ డివిజన్ ఓట్ల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు మొదలైంది. ఇతర ముద్రలు ఉన్న 544 ఓట్లను కూడా […]
ముగిసిన జీహెచ్ఎంసీ పోలింగ్ కొన్నిచోట్ల రీపోలింగ్.. 4న ఓట్ల కౌంటింగ్ సారథి న్యూస్, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల వార్ ప్రశాంతంగా ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీలు నువ్వా..నేనా? అనే రీతిలో తలపడిన పోరులో విజయం ఎవరిని వరించనుందో ఈనెల 4వ తేదీన కౌంటింగ్‌లో తేలనుంది. వ్యక్తిగత దూషణలు, రెచ్చగొట్టే ప్రసంగాలు, పలుచోట్ల ఘర్షణలతో అసెంబ్లీ ఎన్నికలను తలపించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 వార్డుల్లో 1,122 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. టీఆర్ఎస్ నుంచి 150 మంది, బీజేపీ […]
సారథి న్యూస్, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంగళవారం పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారకరామారావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, హోంమంత్రి, డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ, డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి కుందన్‌బాగ్ పోలింగ్ బూత్‌లో, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కుటుంబసమేతంగా తమ ఓటువేశారు. అలాగే సికింద్రాబాద్ లోని ఇస్లామియా స్కూలులో డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఖైరతాబాద్ సర్కిల్ సోమాజిగూడ వార్డు నం.97, సెంటర్ ఫర్ […]
తలమాసినోడితో ఏదీ కాదు ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రైలును విస్తరిస్తాం వరద సాయం ఇచ్చేకాడ కిరికిరి ఏంది? యుద్ధ ప్రాతిపదికన మూసీ ప్రక్షాళన జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారసభలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు సారథి న్యూస్, హైదరాబాద్: ప్రతి బడ్జెట్లో హైదరాబాద్‌కు రూ.10వేల కోట్లు కేటాయిస్తామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. వరదల నుంచి హైదరాబాద్‌ను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. చేతులు ఊపినంత మాత్రాన సమస్య పోదన్నారు. ప్రధానమంత్రిని వరదసాయం కింద రూ.1300 కోట్లు అడిగితే 13 పైసలు కూడా ఇవ్వలేదన్నారు. బెంగళూరు, […]
సారథి న్యూస్, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉప్పల్ నియోజకవర్గంలోని చిలుకానగర్ డివిజన్లో శుక్రవారం మధ్యాహ్నం ముస్లిం మతపెద్దలను తెలంగాణ రాష్ట్ర గిరిజన, మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆప్యాయంగా పలకరించారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాలిని గీతాప్రవీణ్ ముదిరాజ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. హిందూ.. ముస్లిం భాయ్ భాయ్ గా కలిసిపోయి గంగా.. జమున తాహజిబ్ సంస్కృతిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాపాడుతున్నారని కొనియాడారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటు […]
డిసెంబర్ 1న మహానగర ఎన్నికలు మేయర్స్థానం జనరల్ మహిళకు కేటాయింపు 150 వార్డులు.. 9,238 పోలింగ్ సెంటర్ల ఏర్పాటు వివరాలు వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సారథి న్యూస్, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు నగారా మోగింది. డిసెంబర్ 1న ఓటింగ్ నిర్వహించి, డిసెంబర్ 4న ఫలితాలు వెల్లడిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి మంగళవారం మీడియా సమావేశంలో తెలిపారు. అవసరమైన చోట్ల డిసెంబర్ 3న రీ పోలింగ్ నిర్వహిస్తామని వివరించారు. […]
సారథి న్యూస్, హైదరాబాద్: బీజేపీకి ఒకప్పుడు సిద్ధాంతం ఉండేదని, ఇప్పుడది అబద్ధాలతో రాద్ధాంతం చేసే పార్టీగా మారిందని మంత్రి టి.హరీశ్‌రావు ఎద్దేవాచేశారు. గోబెల్స్ ప్రచారంతో అబద్ధాల పునాదుల మీద బీజేపీ రాజకీయంగా ఎదగాలని అనుకుంటోందని, ఆ వ్యవహారశైలిని టీఆర్ఎస్ కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సోమవారం పటాన్ చెరులో నిర్వహించిన జీహెచ్ఎంసీ ఎన్నికల సన్నాహక సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలు ఏం చేశాయని ఓట్లు వేయాలని సూటిగా ప్రశ్నించారు. 70ఏళ్ల […]
సారథి న్యూస్, హైదరాబాద్: జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లుకు మంగళవారం తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. ఐదు సవరణలు చేసిన బిల్లును మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సభలో ప్రవేశపెట్టి సభ్యులు అడిగిన ప్రశ్నలకు వివరంగా సమాధానమిచ్చారు. అనంతరం బిల్లును ఆమోదిస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.ఐదు సవరణలు ఇవే1.మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీహెచ్ఎంసీ చట్టసవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. 2015లో ఒక ప్రత్యేక జీవో ద్వారా కార్పొరేషన్ […]