Breaking News

NEW

రైతు సంఘం నూతన కమిటీ ఎన్నిక

 రైతు సంఘం నూతన కమిటీ ఎన్నిక

 సామాజిక సారథి, తలకొండపల్లి: రైతు సంఘం మండల నూతన కమిటీ ఎన్నికైనట్లు రంగారెడ్డి జిల్లా రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను అరిగోసపెట్టుతున్నాయని ఆరోపించారు. అధ్యక్షులుగా పిప్పల్ల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా శివగల రమేష్, ఉపాధ్యక్షులుగా వెంకట్ రెడ్డి, కృష్ణయ్య సహాయ కార్యదర్శులుగా ,  మల్లేష్, జంగయ్య, పర్వతాలను ఎన్నుకోవడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలలో రైతుసంఘం జిల్లా కమిటీ సభ్యులు […]

Read More
పీఎం సార్.. విమానాలు ఆపండి

పీఎం సార్.. విమానాలు ఆపండి

ఒమిక్రాన్‌ను తట్టుకోవడానికి సిద్ధం కావాలి ప్రధాని మోడీకి సీఎం కేజ్రీవాల్‌ ట్వీట్‌ సామాజిక సారథి, న్యూఢిల్లీ: ‘ప్రపంచవ్యాప్తంగా కొత్త కరోనా వేరియెంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దయచేసి అంతర్జాతీయ విమానాల రాకపోకలను ఆపండి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. మనం ఎందుకు ఆలస్యం చేస్తున్నామని హిందీలో చేసిన ట్వీట్‌లో కేజీవ్రాల్‌ అత్యవసరంగా విజ్ఞప్తి చేశారు. ‘అనేక దేశాలు ఒమిక్రాన్‌ ప్రభావిత దేశాల నుంచి విమానాల రాకపోకలను నిలిపి వేశాయని, కరోనా […]

Read More
రేషన్ పద్ధతిలో మద్యం

రేషన్ పద్ధతిలో మద్యం

సామాజిక సారథి, తిమ్మాజీపేట: నూతన ఎక్సైజ్ సంవత్సరం సోమవారం నుంచి ప్రారంభం కావడంతో ఇటీవల లక్కీ డిప్ ద్వారా ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాలను దక్కించుకున్న యజమానులు మద్యం కోసం మండల కేంద్రంలోనీ టీఎస్పీసీఎల్ స్టాక్ పాయింట్ కు తరలి వచ్చారు. మొదటి రోజు 30 దుకాణాల యజమానులు లిక్కర్ బీరు తీసుకువెళ్లడానికి ఉమ్మడి జిల్లాల నుంచి దుకాణాల యజమానులు తరలివచ్చారు. తొలిరోజు రేషన్ పద్ధతిలో మద్యం అందించారు. అన్ని దుకాణాలకు మద్యం అందించాలన్న అధికారుల ఆదేశాల […]

Read More

నేను సన్యాసిలా ఆలోచించగలనా?

ఎప్పటికప్పుడు కొత్త స్టైల్ తో ఫ్యాన్స్ ఆకట్టుకోవడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటే. అయితే ఈ లేటెస్ట్ స్టైల్ మాత్రం అదరగొట్టేసింది. నున్నని గుండు.. ఆపై బ్లాక్ గాగుల్స్.. స్టైలిష్ టీ షర్ట్ చిరు లుక్ నే మార్చేసింది. అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. గుండుతో ఉన్న ఫోటోని చిరు తన ఇన్స్టా గ్రామ్ పోస్ట్ చేస్తూ ‘కెన్ ఐ థింక్ లైక్ ఏ మాంక్..?’ (నేను సన్యాసిలా ఆలోచించగలనా..?) అనే క్యాప్షన్ తో పాటు‘ ఏ అర్బన్ మాంక్’ […]

Read More

రష్యా వ్యాక్సిన్​ సేఫ్​

మాస్కో: రష్యా ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన కరోనా వ్యాక్సిన్​ ‘స్పుత్నిక్​ – వీ’ ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నదని.. ప్రముఖ మెడికల్​ జర్నల్​ లాన్పెట్​ వెల్లడించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా రష్యా వ్యాక్సిన్​పై వెల్లువెత్తున్న ఆరోపణలకు చెక్​పడింది. శుక్రవారం విడుదలైన లన్సెట్​ జర్నల్​లో రష్యా వ్యాక్సిన్​పై విశ్లేషణాత్మక కథనాన్ని ప్రచురించారు. ఈ ఏడాది జూన్​​-జూలైలో రెండు దశల్లో మొత్తం 76 మందికి ఈ వ్యాక్సిన్​ ఇచ్చారని జర్నల్​లో పేర్కొన్నారు. వారిలో ఎవరికీ ఏవిధమైన ఆరోగ్య సమస్య రాలేదని పేర్కొన్నారు. పైగా వ్యాక్సిన్​ […]

Read More

అభిమానుల కోసమేనట..

బాలనటిగా ఇండస్ట్రీకొచ్చినా వయసుకు తగ్గ పాత్రలనే ఎంచుకుంటూ కెరీర్ లో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది నటి మీనా. అయితే దానికి బ్రేక్ చెప్పాలనుకుంటున్నా.. నెగెటివ్, చాలెంజింగ్ పాత్రలను కూడా చేయాలనుకుంటున్నానని గతంలో ‘అన్నాత్త’ సినిమా ఓపెనింగ్ సమయంలో తన మనసులోని అభిప్రాయాలను చెప్పింది మీనా. తనకి తగ్గా పాత్రలు చెయ్యాలి అనుకున్నా.. ఇప్పుడు మాత్రం ఏ పాత్రైనా చెయ్యడానికి సిద్ధపడుతోందట. ఎందుకంటే తెలుగు తమిళ ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయని.. ట్రెండ్ కి తగ్గట్టుగా […]

Read More

కరోనా నియంత్రణలో విఫలం

సారథి న్యూస్, హుస్నాబాద్: కరోనా కట్టడిలో సీఎం కేసీఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. కరీంనగర్​ జిల్లా హుస్నాబాద్​ నియోజకవర్గంలో తెగిన చెరువులు, చెక్ డ్యాంలను సీపీఐ బృందం గురువారం సందర్శించింది. రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్నా పట్టించుకొనే నాథుడే లేడని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పశ్యపద్మ, జిల్లా కార్యదర్శి మంద పవన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడిపె మల్లేశ్, వనేష్, హన్మిరెడ్డి, సుదర్శన్, […]

Read More
యూస్​ ఉపాధ్యక్ష రేసులో ఇండియన్​ వుమెన్​

యూఎస్​ ఉపాధ్యక్ష రేసులో కమలాహారిస్​

వాషింగ్టన్​: భారతసంతతికి చెందిన ఓ మహిళ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. ఏకంగా అమెరికా ఉపాధ్యక్ష పదవికే ఆమె పోటీపడనున్నారు. ప్రస్తుతం కాలిఫోర్నియా సెనెటర్​గా ఉన్న కమలా హారీస్​ను డెమొక్రాట్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీచేసేందుకు ఎంపిక చేశారు. ఈ మేరకు మంగళవారం డెమొక్రాటిక్​ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్​ ఓ ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యక్ష పదవి కోసం నెలరోజుల పాటు కసరత్తు చేసి.. చివరకు సరైన అభ్యర్థిని ఎంపిక చేశామని ఆయన చెప్పారు. కమలా […]

Read More