Breaking News

జీహెచ్ఎంసీ

జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో అగ్నిప్రమాదం

జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో అగ్నిప్రమాదం

సామాజిక సారథి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ జోనల్‌ కార్యాలయంలో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలోని మూడవ అంతస్తులో టాక్స్‌ సెక్షన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కార్యాలయమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. భారీగా మంటలు చెలరేగడంతో ఆందోళనకు గురైన ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. మంటల్లో కార్యాలయంలోని పలు ఫైల్స్​దగ్ధమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. దీంతో లిప్ట్‌ నిలిచి పోవడంతో అందులో ఉన్నవారు ఆర్తనాదాలు చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది […]

Read More
గోవా టూర్తోనే ముప్పు

గోవా టూర్​ తోనే ముప్పు

న్యూఇయర్‌ వేడుకలకు వెళ్లొచ్చిన వారికి కరోనా మ్యూజిక్‌ ఫెస్టివల్‌ కు వెళ్లిన 32 మందికి పాజిటివ్‌ తలలు పట్టుకుంటున్న అధికారులు జీహెచ్​ఎంసీ పరిధిలో కొవిడ్​పాజిటివిటీ సామాజిక సారథి, హైదరాబాద్‌: న్యూ ఇయర్‌ వేడుకల ఎఫెక్ట్‌.. కారణంగా మరోసారి కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. డిసెంబర్​31న న్యూ ఇయర్‌ ఈవెంట్లకు వివిధ ప్రాంతాలకు వెళ్లిన హైదరాబాద్​నగర వాసులు.. తిరిగి రావడంతో కొవిడ్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన పలువురు కొత్త ఏడాదికి సంబరాల కోసం గోవాకు వెళ్లారు. […]

Read More
విశ్వనగరానికి పేరు తీసుకొద్దాం

విశ్వనగరానికి పేరు తీసుకొద్దాం

అన్ని కులాలు, మతాలను ప్రేమించండి ప్రజాజీవితంలో మంచిపేరు తెచ్చుకోవాలి సంయమనం, సహనం, సాదాసీదాగా ఉండాలి మేయర్​, డిప్యూటీ మేయర్​, కార్పొరేటర్లతో సీఎం కేసీఆర్​ సారథి న్యూస్, హైదరాబాద్: విభిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులకు చెందిన ప్రజలు నివాసముంటున్న హైదరాబాద్ నగరం అసలు సిసలైన విశ్వనగరంగా, మినీ ఇండియాగా భాసిల్లుతున్నదని, ఈ నగర వైభవాన్ని మరింత పెంచేలా కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు పాటుపడాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. కొత్తగా ఎన్నికైన జీహెచ్ఎంసీ మేయర్ […]

Read More
జీహెచ్​ఎంసీలో టీఆర్​ఎస్​కు మరో సీటు

నేరేడ్‌మెట్‌ లో టీఆర్‌ఎస్‌ ఘనవిజయం

హైదరాబాద్‌: ఈనెల 4న కౌంటింగ్​ నిలిచిపోయిన నేరేడ్‌మెట్‌ లో టీఆర్‌ఎస్‌ ఘనవిజయం సాధించింది. 668 ఓట్లతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి గెలుపొందారు. తాజా విజయంతో జీహెచ్‌ఎంసీలో టీఆర్ఎస్ కార్పొరేటర్ల సంఖ్య 56కు చేరింది. అయితే ఇతర గుర్తులు ఉన్న 544 ఓట్లలో టీఆర్ఎస్‌కు 278 ఓట్లు వచ్చాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌటింగ్ సందర్భంగా నిలిచిపోయిన నేరేడ్​మెట్ డివిజన్ ఓట్ల కౌంటింగ్​ ఉదయం 8 గంటలకు మొదలైంది. ఇతర ముద్రలు ఉన్న 544 ఓట్లను కూడా […]

Read More
వరద సాయం కోసం ‘మీసేవ’ వద్దకు వెళ్లొద్దు

వరద సాయం కోసం ‘మీసేవ’ వద్దకు వెళ్లొద్దు

సారథి న్యూస్, హైదరాబాద్: జీహెచ్ఎంసీలో వరద సహాయం కోసం మీ సేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇంకా వరద సహాయం అందని వారి వివరాలను సేకరిస్తున్నాయని తెలిపారు. బాధితుల వివరాలు, ఆధార్ నంబర్​ ధ్రువీకరణ జరుగుతుందని, ఆ తర్వాత వారి అకౌంట్ లోనే వరద సహాయం డబ్బులు జమవుతాయని చెప్పారు. ఈనెల 7వ తేదీ నుంచి సాయం అందని వారికి మళ్లీ […]

Read More
బీజేపీలో చేరిన మాజీమేయర్​కార్తీకరెడ్డి

బీజేపీలో చేరిన మాజీ మేయర్ ​కార్తీకరెడ్డి

హైదరాబాద్: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) మాజీ మేయర్, కాంగ్రెస్ నాయకురాలు బండ కార్తీకరెడ్డి తన భర్త చంద్రారెడ్డితో కలిసి బుధవారం బీజేపీలో చేరారు. వారికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం భూపేంద్ర యాదవ్‌ మాట్లాడుతూ తెలంగాణలో అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టడమే తమ లక్ష్యమన్నారు. గ్రేటర్ మేయర్ పీఠం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. కార్తీకరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు సీటు ఇవ్వకుండా మోసం […]

Read More
జీహెచ్ఎంసీ రిజర్వేషన్లు ఖరారు

జీహెచ్ఎంసీ రిజర్వేషన్లు ఖరారు

డివిజన్ల వారీగా రిజర్వేషన్ల జాబితా సిద్ధం ఎస్టీలకు-2, ఎస్సీలకు -10, బీసీలకు- 50 మహిళలకు 75 స్థానాల కేటాయింపు అన్‌ రిజర్వ్​డ్​ డివిజన్లు 44 అంతా రెడీచేసిన బల్దియా అధికారులు హైదరాబాద్: హైదరాబాద్ ​మహానగర పాలకమండలి రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రెండు దఫాలు యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వం గత అసెంబ్లీ సమావేశాల్లో చట్టం చేయడంతో గతంలో చేసిన రిజర్వేషన్లు ఈ దఫా కూడా కొనసాగనున్నాయి. ఈ మేరకు మొత్తం 150 స్థానాలకు గానూ జీహెచ్​ఎంసీ అధికారులు డివిజన్ల వారీగా […]

Read More
అధికారులు అందుబాటులో ఉండాలి

అధికారులూ.. అందుబాటులో ఉండండి

సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ భాగ్యనగరంలో మరోసారి భారీవర్షం కురిసే అవకాశం ఉందని, అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి అప్రమత్తంగా అందుబాటులో ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని అత్యవసరమైతేనే బయటకు రావాలని కోరారు. మరోసారి అవకాశాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు వారిని జీహెచ్ఎంసీ వారు ఏర్పాటుచేసిన షెల్టర్లను తరలించాలని ఆదేశించారు.

Read More