Breaking News

Day: June 27, 2020

ఒకే రోజు 1087

ఒకేరోజు 1087

సారథి న్యూస్, హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి చాలా వేగంగా విజృంభిస్తోంది. తెలంగాణలో శనివారం 1087 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొదటిసారి వెయ్యి కేసులు దాటాయి. వ్యాధి బారినపడి ఆరుగురు మృత్యువాతపడ్డారు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 888, రంగారెడ్డి 74, మేడ్చల్ 37, నల్లగొండ 35.. ఇలా రాష్ట్రంలో మొత్తం 13,436 పాజిటివ్​కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటి వరకు 243 చనిపోయారు.

Read More
పీవీ.. గొప్ప దార్శనికుడు

పీవీ.. గొప్ప దార్శనికుడు

సారథి న్యూస్, హుస్నాబాద్: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గొప్ప దార్శనికుడని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ అన్నారు. ఆదివారం జరగబోయే పీవీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయనతో వొడితెల కుటంబానికున్న సంబంధాన్ని శుక్రవారం గుర్తుచేసుకున్నారు. పీవీ సాహితీవేత్తగా ఓ వైపు మరో వైపు పరిపాలనా దక్షుడిగా ఉంటూ మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేళ్లపాటు నడిపించి అపర చాణక్యుడిగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు, సాంకేతిక రంగాల అభివృద్ధి చెందితే యువతకు […]

Read More

‘వలసజీవి’తం.. విషాదాంతం

సారథి న్యూస్ చొప్పదండి: బతుకుదెరువులేక దుబాయ్​ వెళ్లిన ఓ కార్మికుడి జీవితం అత్యంత విషాదంగా ముగిసింది. కరోనా లక్షణాలతో అతడు ప్రాణాలు కోల్పోగా అయినవాళ్లేవరూ లేకుండానే అంతిమ సంస్కారాలు జరుపవలసిన పరిస్థితి నెలకొన్నది. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రానికి చెందిన క్యాదాసు కొండయ్య కొన్నేండ్ల క్రితం బతుకుదెరువు కోసం దుబాయ్​ వెళ్లాడు. కరోనాతో బాధపడుతూ 10 రోజుల క్రితం అబుదాబి క్యాంప్​లో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం కుటుంబ సభ్యులు చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ దృష్టికి […]

Read More

సీఎం కేసీఆర్​ రైతు పక్షపాతి

సారథి న్యూస్, చొప్పదండి: కరోనా సంక్షోభంతో ప్రపంచమంతా కొట్టుమిట్టాడుతున్నా.. రైతులకు రైతుబంధు డబ్బులను ఇచ్చిన ధీశాలి కేసీఆర్​ అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ కొనియాడారు. ప్రతిరైతును రాజును చేయడమే సీఎం కేసీఆర్​ లక్ష్యమని చెప్పారు. కరీంనగర్​ జిల్లా చొప్పదండిలోని వరలక్ష్మి పంక్షన్​హాల్​లో శనివారం రాష్ట్ర ప్రభుత్వం రైతులకోసం నిర్మించనున్న కల్లాల నిర్మాణంపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. కల్లాల నిర్మాణాల కోసం రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయా చైర్మన్ ఏనుగు రవీందర్ […]

Read More

భావితరాల కోసమే హరితహారం

సారథిన్యూస్​, గంగాధర/రామడుగు/రామగుండం: భావితరాలు బాగుండాన్న ఉద్దేశ్యంతోనే సీఎం కేసీఆర్​ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ పేర్కొన్నారు. శనివారం కరీంనగర్​ జిల్లా మంగపేట గ్రామంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. రామడుగు మండలం గోపాల్​రావుపేటలో లయన్స్​ క్లబ్​ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయము ఆవరణలో పోలీస్ కమిషనర్ వీ సత్యనారాయణ అధికారులు, సిబ్బందితో కల్సి పండ్ల మొక్కలను నాటారు. ఆయా కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కర్ర […]

Read More

నల్లగొండ జిల్లాలో 25 కొత్తకేసులు

సారథిన్యూస్​, నల్లగొండ: కరోనా మహమ్మారి జీహెచ్​ఎంసీతోపాటు జిల్లాలను వణికిస్తున్నది.తాజాగా నల్లగొండ జిల్లాలో 25 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇటీవల కరోనా సోకిన వారి ప్రైమరీ కాంటాక్ట్​ల శాంపిల్లు సేకరించగా 25 కొత్తకేసులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్​ మండలాల్లో అత్యధిక కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. పాజిటివ్​ వచ్చనవారిలో పోలీస్​, వైద్యసిబ్బంది ఉన్నట్టు సమాచారం.

Read More

రైతుల వెన్నంటే ప్రభుత్వం

సారథిన్యూస్​, మధిర: కరోనా సంక్షోభంలోనూ తెలంగాణ ప్రభుత్వం రైతుల వెన్నంటే ఉందని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్​ వ్యవసాయరంగానికే మొదటి ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. ఖమ్మం జిల్లా మధిర మండలం సిరిపురం గ్రామంలో రూ. 22 లక్షలతో నిర్మించనున్న రైతు బంధు వేదిక నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.30 లక్షలతో నిర్మించిన వైకుంఠ ధామాంను ప్రారంభించి మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ..కేసీఆర్ గారు ఆలోచించిన విధంగా […]

Read More

నాటుసారాపై ఉక్కుపాదం

సారథిన్యూస్​, రామగుండం: నాటుసారాను తయారుచేసినా, విక్రయించినా కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లాలోని పలు గుడాంబా స్థావరాలపై పోలీసులు దాడులు జరిపారు. పొత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓదెల మండలం కొలనూరు చెరువు సమీపంలో గుడుంబా స్థావరాలపై దాడులు జరిపి గుడుంబా తయారీ కోసం నిల్వ ఉంచిన ఆరువందల లీటర్ల బెల్లం పానకం, 50 కిలోల బెల్లం, నాటుసారా తయారీ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. కుమార్​ అనే వ్యక్తిని అరెస్ట్​ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ […]

Read More