Breaking News

ఎమ్మెల్యే

అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే నిర్లక్ష్యం

అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే నిర్లక్ష్యం

బీఎస్పీ నకిరేకల్ ఇన్ చార్జి ప్రియదర్శిణి మేడి సమస్యలు పరిష్కరించాలంటూ స్థానికులతో కలసి ధర్నా  సామాజిక సారథి, చిట్యాల: నకిరేకల్ నియోజక వర్గం అభివృద్ధిలో వెనుకబడి ఉందని, స్థానిక ఎమ్మెల్యే ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్నారని బీఎస్పీ నియోజకవర్గ ఇన్ చార్జి మేడి ప్రియదర్శిణి ఆరోపించారు. చిట్యాలలోని సుందరయ్య నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలను ఆమె సోమవారం పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యంతోనే కాలనీలో సమస్యలు పరిష్కారం కావడంలేదని స్థానిక ప్రజలతో కలిసి ఆమె ధర్నా చేశారు. […]

Read More
ఇండిగో విమానం చుక్కలు చూపింది

ఇండిగో విమానం చుక్కలు చూపింది

తిరుపతి బదులు బెంగుళూరులో ల్యాండింగ్‌ సాంకేతికలోపం.. ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి ఇబ్బందులుపడ్డ రోజా, యనమల, జోగీశ్వరరావు తిరుపతి: ఇండిగో విమానం ప్రయాణికులకు చుక్కలు చూపించింది. తిరుపతిలో ల్యాండ్‌ కావలసిన ఫ్లైట్​గంటపాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. దీంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. మంగళవారం ఉదయం 9.20గంటలకు రాజమండ్రి నుంచి బయలుదేరిన ఫ్లైట్​ఉదయం 10.20కు తిరుపతికి చేరుకోవాల్సి ఉంది. సాంకేతికలోపం కారణంగా గంటపాటు గాలిలో చక్కర్లు కొట్టింది. అనంతరం […]

Read More
డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రారంభం

డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రారంభం

సామాజిక సారథి, కల్వకుర్తి:  నాగర్ కర్నూల్ జిల్లా  కల్వకుర్తి నియోజకవర్గం లో స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ విద్యాశాఖ మంత్రి వర్యులు  సబితా ఇంద్రారెడ్డి తో కలిసి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ డాక్టర్ జీబీ తీగల అనితా హరినాథ్ రెడ్డి  కడ్తాల్ బాలుర పాఠశాల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రారంభించారు. అదే విధంగా కడ్తాల్ లో  పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. అలాగే తహసీల్దార్ కార్యాలయానికి శంకుస్థాపన,  వైకుంఠ ధామం, డంపింగ్ యార్డు, […]

Read More
అందరివాడు..

అందరివాడు..

అధిష్టానం మెచ్చినోడు.. బరి గీసి నిలిచినోడు.. ప్రజల మనసును గెలిచినోడు.. పేదల మన్ననలు పొందినోడు ఆయనే ఆరూరి రమేష్​ ఎమ్మెల్యేగా అష్ట వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కథనం.. సామాజిక సారథి,వరంగల్ ప్రతినిధి: అధిష్టానం మెచ్చినోడు..బరి గీసి నిలిచినోడు.. ప్రజల మనసును గెలిచినోడు..పేదల మన్ననలు పొందినోడు..వెనకబడిన తరగతిలో పుట్టినోడు.. ఆయనే అరూరి రమేష్.. ప్రస్తుతం వర్ధన్నపేట ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్యేగా అష్ట వసంతాలు పూర్తి  చేసుకున్న సందర్భంగా సామాజిక సారథి ప్రత్యేక కథనం..  నియోజకవర్గ ప్రజలకు […]

Read More
చట్టవిరుద్దంగా వ్యహరించొద్దు

చట్టవిరుద్దంగా వ్యహరించొద్దు

దళితుడిని అక్రమ నిర్భందిస్తారా..? పోలీసుల తీరుపై ఎమ్మెల్యే భగత్ ధ్వజం సామాజిక సారథి, హాలియా:  పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరించాలే కానీ, అందుకు విరుద్ధంగా వ్యవహరించి దళితులకు అన్యాయం చేస్తే సహించేది లేదని దళితుల వెంటే తెలంగాణ ప్రభుత్వం ఉందని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి సాగర్ నియోజకవర్గంలో పలు శుభకార్యాలలో పాల్గొనేందుకు  వస్తుండడంతో హాలియా పోలీస్ స్టేషన్ ఎదుట దళితులు ధర్నా చేస్తుండగా, ఎమ్మెల్యే కారు ఆపి నిడమానూరు మండల పరిధిలోని […]

Read More
పేదల కోసమే సహాయనిధి

పేదల కోసమే సహాయనిధి

ఎమ్మెల్యే ఆరూరి రమేష్​ సామాజిక సారథి, ఐనవోలు: ప్రైవేట్​ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునే పేదలను ఆదుకోవడమే సీఎం సహాయనిధి లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. ఐనవోలు మండలంలోని ఫున్నెలు, వనమాల కనిపర్తి గ్రామాల్లో 14 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.11.32లక్షల చెక్కులను శనివారం అందజేశారు. అత్యవసర సమయంలో ప్రైవేట్​ఆస్పత్రుల్లో వైద్యసేవలు పొంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబాలను ఆదుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అభాగ్యులు, నిరుపేదలకు అండగా నిలుస్తుందని, కరోనా కాలంలో ప్రభుత్వానికి ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నప్పటికీ […]

Read More
‘రైతన్న’ బాధ అర్థమైంది: ఎమ్మెల్యే మర్రి

‘రైతన్న’బాధ అర్థమైంది: ఎమ్మెల్యే మర్రి

సామాజిక సారథి, నాగర్​కర్నూల్​ప్రతినిధి: ప్రముఖ నటుడు ఆర్.నారాయణమూర్తి తెరకెక్కించిన రైతన్న సినిమాను బుధవారం నాగర్​కర్నూల్​లోని రామకృష్ణ టాకీస్ లో ఎమ్మెల్యే మర్రి జనార్ధన్​రెడ్డి తిలకించారు. ఈ సందర్భంగా రైతన్నలు ఎదుర్కొంటున్న కష్టాలు, బాధలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రైతుల నేపథ్యంలో వచ్చిన ఇలాంటి చిత్రాలను మనమంతా ఆదరించాలి, ఆశీర్వదించాలి, అఖండ విజయం అందించాలి. అది మన బాధ్యత’ అని గుర్తుచేశారు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసి కూడా దర్జాగా మద్యాన్ని తయారుచేసి ప్రజల […]

Read More
మేడారం జాతరపై మంత్రి సమీక్ష

మేడారం జాతరపై మంత్రి సమీక్ష

 సామాజిక సారథి, ములుగు: ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతరపై రాష్ట్ర గిరిజన, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ మంత్రి  సత్యవతి రాథోడ్ స్థానిక అధికారులతో బుధవారం సమీక్షాసమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకూ జరగనున్న జాతర కోసం వసతుల కల్పన, ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సలహాలు సూచనలు అందించారు. ముందుగా మేడారం అమ్మవార్లు సమ్మక్క–సారలమ్మలను దర్శించుకుని, అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. జంపన్న వాగు […]

Read More