సామాజికసారథి, డిండి: వారం రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని మలక్‌పేట యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డిండి మండలం బొల్లనపల్లి గ్రామ టీఆర్ఎస్ సర్పంచ్ కామెపల్లి భాస్కర్‌ను.. టీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ గురువారం సాయంత్రం పరామర్శించారు. మెడికల్ రిపోర్టర్లను ఆయన పరిశీలించారు. ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బందిని అడిగి హెల్త్ కండీషన్ గురించి తెలుసుకున్నారు. సర్పంచ్ భాస్కర్ సతీమణి స్వరూప, బావమరిది ఎలిమినేటి రమేష్‌ను అడిగి […]
సామాజిక సారథి, నడికూడ : రాష్ర్ట ప్రభుత్వం పంట నష్టం జరిగితే రైతులను ఆదుకోవాలని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. శుక్రవారం హన్మకొండ జిల్లా నడికూడలో వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను పరకాల మండలాల్లోని పలు గ్రామాలలో రైతులతో కలిసి దెబ్బతిన్న మిర్చి పంటలు మొక్కజొన్న పంటలను పరిశీలించారు. అనంతరం పరకాల మండలం మలక్కపేటలో రైతులను పరామర్శించి మాట్లాడారు. ప్రకృతి సృష్టించిన ఈ బీభత్సానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి రైతులను ఆదుకోవాలని, వెంటనే పంట […]
సామాజిక సారథి, ఐనవోలు: హన్మకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా భోగి పండుగను పురస్కరించుకొని స్వామి వారిని మంత్రి సత్యవతి రాథోడ్ , ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, జెడ్పీ చైర్మన్ సుధీర్ బాబు మేయర్ గుండు సుధారాణి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో నాగేశ్వర్, అర్చుకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి స్వామి వారి ఆశీర్వచనలు అందించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులను మంత్రి సత్యవతి రాథోడ్, […]
ములుగులో సీతక్క నిరసన సామాజిక సారథి, ములుగు: స్థానికత కోసమే పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. తక్షణమే 317 జీవోను రద్దు చేయాలని డిమాండ్‌చేస్తూ గురువారం ఆమె ములుగు జిల్లా కేంద్రంలో రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలతో చర్చించి అందరికీ ఆమోద యోగ్యమైన బదిలీలను చేపట్టాలని, స్థానికత ఆధారంగా ఉద్యోగుల బదిలీలలో ప్రాధాన్యత కల్పించాలని ఆమె ప్రభుత్వాన్ని […]
పాట్నా: బీహార్ రాజకీయాల్లో ఉత్కంఠ సాగుతున్న క్రమంలో ఆ పార్టీకి ఓ ఎమ్మెల్యే రాజీనామా చేయడం చర్చనీయాంశమవుతోంది. బీహార్‌లోని నగర్‌కతీయగంజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న రష్మీవర్మ ఆదివారం రాజీనామా చేశారు. రాజీనామాకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె వెల్లడించారు. రాజీనామా కారణాన్ని ఆమె లేఖ రాసి తెలియజేశారు. బీహార్ అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా మాత్రం రాజీనామా లేఖ అందలేదని వెల్లడించారు. వ్యక్తిగత కారణాల వల్ల అసెంబ్లీ సభ్యత్వానికి […]
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సామాజికసారథి, హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోడీ పంజాబ్‌లో చేసిన డ్రామా పీఎం పదవిని దిగజార్చిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ సభకు జనాలు రాకే కారణం వెతుక్కున్నారని విమర్శించారు. పంజాబ్ సీఎంను నవ్వులపాలు చేయాలని చూశారని, గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై రాయితో దాడి చేసినా నిందలు వేయలేదని గుర్తుచేశారు. పంజాబ్ ప్రభుత్వం మీద కక్షసాధిస్తున్నారని, పంజాబ్ సీఎం ఫెయిల్ అయినట్లు చూపే […]
సామాజిక సారథి, తుర్కయంజాల్: సీఎం కేసీఆర్ కు అన్నదాతల సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం ఇబ్రహీంపట్నం మండలంలోని కర్ణంగూడ గ్రామానికి చెందిన రైతు నల్లబోలు శ్రీనివాస్ రెడ్డి తన ఇంటికి సరిపోయే విదంగా వేసుకున్న వరిపొలంలో రైతుబంధు రైతుల సంబరాల ఉత్సవాల్లో భాగంగా కేసీఆర్ రైతుబంధు చిత్రంలో రైతులు, కూలీలతో కలిసి ఎమ్మెల్యే నాట్లు వేశారు.కార్యక్రమంలో జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, ఎంపీపీ కృపేష్, మార్కెట్ కమిటీ […]
హంగులు, మౌలిక వసతులతో తీర్చిదిద్దాలి దశాబ్దాలుగా పట్టిన దరిద్రం పోవాలె లాండ్ పూలింగ్ చేపట్టి కాలనీలు నిర్మించాలి అద్భుతంగా టౌన్‌హాల్, మినీ ట్యాంక్‌బండ్ నిబద్ధతతో పనిచేసే కమిషనర్ ను నియమించండి ప్రాజెక్టు కాలనీవాసులకు ఇళ్లపట్టాలు నల్లగొండ అభివృద్ధిపై సీఎం కేసీఆర్సమీక్ష ఎమ్మెల్యే గాదరి కిశోర్కుటుంబానికి ముఖ్యమంత్రి, మంత్రుల పరామర్శ సామాజికసారథి, నల్లగొండ ప్రతినిధి: రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల మాదిరిగానే చారిత్రక నల్లగొండ మున్సిపాలిటీ కూడా మరింతగా పురోభివృద్ధి చెందాలని, నల్లగొండకు దశాబ్దాలుగా పట్టిన దరిద్రం పోవాలని, […]