Breaking News

చరితార్థులు

విప్లవాగ్ని చాకలి అయిలమ్మ

విప్లవాగ్ని చాకలి అయిలమ్మ

‘ఈ భూమి నాది.. పండించిన పంటనాది.. తీసుకెళ్లడానికి దొరెవ్వడు.. నా పాణం పోయాకే ఈ పంట, భూమిని మీరు దక్కించుకోగలరు’ అంటూ మాటలను తూటాలుగా మల్చుకుని దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి అయిలమ్మ. ఆమె వీరత్వం ఎంతో మంది గుండెల్లో ధైర్యం నింపింది. ఎందరికో ప్రశ్నించేతత్వం నేర్పించింది. దేశ్​ముఖ్​లు, భూస్వాములను తరిమికొట్టేలా చేసింది. 1919లో వరంగల్ జిల్లా రాయపర్తి మండలం క్రిష్టాపురం గ్రామంలో ఓరుగంటి మల్లమ్మ, సాయిలు దంపతులకు నాలుగవ సంతానంగా […]

Read More
సమతను నేర్పిన మహర్షి

సమతను నేర్పిన మహర్షి

దేవుడిని అతిసామాన్యుడి వద్దకు తీసుకొచ్చి దేవుడికి కులమత భేదాలు లేవని నిరూపించిన మహా దార్శనికుడు మహర్షి నారాయణగురు. ఆయన దేవాలయాలు భక్తి, ముక్తి కేంద్రాలుగా కాకుండా మలచిన మహాశిల్పి, సాహసికుడు. మానవులను అనాదిగా పట్టి పీడిస్తున్న అంధకారాన్ని ఙ్ఞానంతో తొలగించ వచ్చని, ఙ్ఞానం విద్యతోనే సాధ్యమని భావించి, అతి సామాన్యుడికి చదివించేందుకు అలుపెరుగని కృషి చేసిన మహాయోగి. చదువుతోనే స్వేచ్ఛ, సంఘటిమవడం ద్వారా శక్తి, చదువు అనేది స్వేచ్ఛ, సమానత్వాలను సాధించుకునేందుకు నిచ్చెనలా ఉపయోగపడుతుందని ప్రభోదించారు. మహాఙ్ఞాని, […]

Read More
నిజాం కుమార్తె కన్నుమూత

నిజాం కుమార్తె కన్నుమూత

సారథి న్యూస్​ : చార్మినార్‌ ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌అలీఖాన్‌ కుమార్తె సాహెబ్‌జాదీ బషీరున్నీసాబేగం(93) పురానీహవేలీ నిజాం మ్యూజియం ఆవరణంలోని ఉస్మాన్‌కాటేజ్‌ భవనంలో కన్నుమూశారు. ఏడో నిజాంకు 21 సంవత్సరాల వయసులో 1906 ఏప్రిల్‌ 14న ఆజం ఉన్నీసాబేగంతో వివాహమైంది. ఆయనకు మొత్తం 34 మంది సంతానం. ఆయన సంతానంలో ఇప్పటి వరకు జీవించి ఉన్నది ఈమె ఒక్కరే. బషీరున్నీసాబేగం 1927లో జన్మించారు. దక్కన్‌ హైదరాబాదీ సంస్కృతిని ప్రతిబింబించేలా నగలు ధరించేవారు. ఈమె భర్త నవాబ్‌ ఖాజీంయార్‌జంగ్‌ […]

Read More
దేశమంతా విజయ్​దివస్

దేశమంతా విజయ్ ​దివస్

ఉగ్రవాదుల ముసుగులో కాశ్మీర్‌ను కబళించేందుకు పాకిప్తాస్​ చేసిన కుటిల ప్రయత్నాలను భారత్ తిప్పికొట్టి నేటికీ 21 ఏళ్లు. ఈ సందర్భంగా దేశమంతా విజయ్​దివస్​ను జరుపుకుంటోంది. ఏం జరిగిందంటే..ఉగ్రమూకలతో చేతుల కలిపిన పాకిస్తాన్.. ‘భారత్‌తో పోరాడుతోంది మేం కాదు.. కశ్మీర్ స్వాతంత్ర్యాన్ని ఆకాంక్షించే వాళ్లే’ అని పాకిస్తాన్ ప్రపంచాన్ని నమ్మించాలని చూసింది. కానీ కార్గిల్ యుద్ధంలో ఇండియన్ ఆర్మీ విసిరన పంజాకు విలవిల్లాడింది. ఉగ్రవాదులతో కలిసి కాశ్మీర్​లోని కార్గిల్ సెక్టార్‌ను ఆక్రమించిన పాకిస్థాన్ సైన్యాన్ని ఇండియన్ ఆర్మీ తరిమి […]

Read More
పీవీ.. వందేళ్ల జ్ఞాపకాలు

పీవీ.. వందేళ్ల జ్ఞాపకాలు

సారథి న్యూస్, హైదరాబాద్: ‘ఢిల్లీకి రాజునైనా తల్లికి బిడ్డనే’ అన్న పదం మూడు దశాబ్దాల క్రితం రాజకీయాల్లో మార్మోగింది. ఈ మాటలు ఎవరో కాదు మన తొలి తెలుగు ప్రధాని, ఆదర్శనీయుడు అనిపించుకుంటున్న పాములపర్తి వెంకట నరసింహారావు(పీవీ నరసింహారావు) నోటి నుంచి వచ్చాయి. దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అటు కాంగ్రెస్ పార్టీలోనూ ఇటు దేశంలోనూ సంక్షోభం నెలకొన్న పరిస్థితుల్లో ఢిల్లీ పీఠాన్ని ఆధిరోహించిన బహుభాషా కొవిదుడు, అపర చాణుక్యుడు […]

Read More
పీవీ.. రాజఠీవి

పీవీ.. రాజఠీవి

సారథి న్యూస్, హుస్నాబాద్: బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధానిపాములపర్తి వెంకట నరసింహారావు (పీవీ నరసింహారావు) జన్మించి జూన్ 28వ తేదీ నాటికి వందేళ్లు పూర్తి కావడంతో కుటుంబసభ్యులు శతజయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు. నాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి వంగర గ్రామంలో 1921 జూన్​28న ఆయన జన్మించారు. ఆయన తప్పటడుగుల వేసిన నుంచి యవ్వనం వరకు ఉన్న తన ఇంటినే మ్యూజియంగా చేయాలని పీవీ తనయుడు ప్రభాకర్ రావు సంకల్పించారు. తాను 1952లో నిర్మించిన ఇంట్లో […]

Read More

సారస్వతమూర్తి సినారె

జూన్‌ 12న సినారె వర్ధంతి ‘చేతగాని తనముంటే జాతకాన్ని నిందించకునమ్మలేని సరుకుంటే అమ్మకాన్ని నిందించకుకలం రాయలేకుంటే కాగితాన్ని నిందించకు..’మనిషిలోని చేతగానితనాన్ని ఎత్తిచూపారు సినారె.. విశ్వంభరుడు, మానవతా మహానీయుడు, ఆధునిక కవి, వక్త, సాహితీ పరిశోధకుడు, బహుభాషావేత్త, ప్రయోగశీలి, సుప్రసిద్ధ సినీగేయ రచయిత.. ఇలా ఎన్నో పేర్లతో పిలిచినా ఆయనకు తక్కువేనని చెప్పవచ్చు. ఆయనే మన సాహితీకోవిదుడు డాక్టర్​ సింగిరెడ్డి నారాయణరెడ్డి. అందరికి సినారెగా సుపరిచితులు. నాటి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా, నేటి రాజన్న సిరిసిల్ల జిల్లా హనుమాజిపేట […]

Read More

దళిత చైతన్య ప్రతీక.. భాగ్యరెడ్డి వర్మ

మే 22న భాగ్యరెడ్డి వర్మ జయంతి శతాబ్దాల పర్యంతపు చావు డప్పుల వెనుక.. శవాల మోతల ముందు నడుస్తూ వచ్చిన దళితుల గమనం, గమ్యాన్ని మార్చిన ఘనత ఆయనది. అంటరాని కులాల ఆడబిడ్డలను దేవత పేరుతో గ్రామ పెద్దలకు బలిచ్చే దురాచారాన్ని ధిక్కరించిన ధీరత్వం ఆయన సొంతం. ప్లేగు, కలరా వంటి భయంకర అంటువ్యాధులతో భాగ్యనగర ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే స్వస్తి సేవాదళ్ సంస్థను ఏర్పాటుచేసి ప్రాణాలకు తెగించి అంటువ్యాధిగ్రస్తుల కాపాడేందుకు వైద్యసేవలందించిన సాహస ప్రవృత్తి ఆయనది. […]

Read More