దేవుడిని అతిసామాన్యుడి వద్దకు తీసుకొచ్చి దేవుడికి కులమత భేదాలు లేవని నిరూపించిన మహా దార్శనికుడు మహర్షి నారాయణగురు. ఆయన దేవాలయాలు భక్తి, ముక్తి కేంద్రాలుగా కాకుండా మలచిన మహాశిల్పి, సాహసికుడు. మానవులను అనాదిగా పట్టి పీడిస్తున్న అంధకారాన్ని ఙ్ఞానంతో తొలగించ వచ్చని, ఙ్ఞానం విద్యతోనే సాధ్యమని భావించి, అతి సామాన్యుడికి చదివించేందుకు అలుపెరుగని కృషి చేసిన మహాయోగి. చదువుతోనే స్వేచ్ఛ, సంఘటిమవడం ద్వారా శక్తి, చదువు అనేది స్వేచ్ఛ, సమానత్వాలను సాధించుకునేందుకు నిచ్చెనలా ఉపయోగపడుతుందని ప్రభోదించారు. మహాఙ్ఞాని, […]