Breaking News

Day: October 12, 2020

టీఆర్​ఎస్​లో చేరిన ముద్దుల నాగేశ్వర్ రెడ్డి

టీఆర్​ఎస్​లో చేరిన ముద్దుల నాగేశ్వర్ రెడ్డి

సారథి న్యూస్, హైదరాబాద్: గత అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి కాంగ్రెస్​ అభ్యర్థిగా పోటీచేసిన ముద్దుల నాగేశ్వర్ రెడ్డి సోమవారం మంత్రి టి.హరీశ్​రావు సమక్షంలో తెలంగాణ భవన్​లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో పోటీచేసి రెండవ స్థానంలో నిలిచారు. ఆయన వెంట పెద్దసంఖ్యలో టీఆర్​ఎస్​ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్​రావు మాట్లాడుతూ.. ‘ఫార్మాసిటీని అడ్డుకుంటామని భట్టి మాట్లాడుతున్నారు.. ఫార్మాసిటీ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత ఎదురుచూస్తోంది. మొన్నటి దాకా కాళేశ్వరం అడ్డుకుంటామని […]

Read More

ఖుష్బూతో బీజేపీకి లాభమెంత?

ఢిల్లీ: ప్రముఖ సినీనటి, కాంగ్రెస్​ జాతీయ అధికార ప్రతినిధి ఖుష్బూ సోమవారం మధ్యాహ్నం బీజేపీలో చేరారు. ఉదయం కాంగ్రెస్​ పార్టీకి రాజీనామా చేసిన ఆమె మధ్యాహ్నానికే బీజేపీలో చేరారు. ఉదయం ఆమెను పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగిస్తున్నట్టు అధిష్ఠానం ప్రకటించింది. కొద్ది సేపటికే ఆమె అధినేత్రి సోనియాకు రాజీనామా లేఖను పంపారు. పార్టీలోని కొందరు నేతలు తనను రాజకీయంగా అణగదొక్కుతున్నారని ఆమె లేఖలో పేర్కొన్నారు. కొంతకాలంగా ఆమె కాంగ్రెస్​పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. […]

Read More

రేప్​చేసి వీడియో తీశారు..

ఉత్తర్​ప్రదేశ్​లో లైంగికదాడుల పర్వం కొనసాగుతున్నది. హత్రాస్​ ఘటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు సాగుతున్న వేళ మరో దారుణం చోటుచేసుకున్నది. తాజాగా ఓ పదిహేడేండ్ల విద్యార్థినిపై ఓ నీచుడు లైంగికదాడి చేయగా అతడి ఫ్రెండ్స్​ వీడియో తీశారు. ఉత్తర్​ప్రదేశ్​ ఝాన్సీకి చెందిన ఓ యువతి అదే పట్టణంలో పాల్​టెక్నిక్​ చదువుతున్నది. కొంతకాలంగా ఆమెను ఓ యువకుడు లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం కాలేజీకి వెళ్లిన విద్యార్థినిని సదరు యువకుడు కిడ్నాప్​ చేసి తీసుకెళ్లాడు. ఆనంతరం ఓ ఇంట్లోకి […]

Read More

కవిత ఘనవిజయం.. కాంగ్రెస్​, బీజేపీ డిపాజిట్లు గల్లంతు

సారథిన్యూస్​, నిజామాబాద్​: ఇందూరు స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్​ కూతురు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో పోటీచేసిన కాంగ్రెస్​, బీజేపీలు డిపాజిట్​ కూడా దక్కించుకోలేకపోయాయి. మొత్తం పోలైన ఓట్లలో కవితకు 728 ఓట్లు వచ్చాయి.బీజేపీకి 56, కాంగ్రెస్​కు 29 ఓట్లు రాగా.. 10 ఓట్లు చెల్లకుండా పోయాయి. కవిత ఘన విజయం సాధించడంతో టీఆర్​ఎస్​ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి. హైదరాబాద్​లోని కవిత ఇంట్లో, ప్రగతిభవన్​లో, తెలంగాణ భవన్​లో సందడి వాతావరణం […]

Read More

దూసుకొస్తున్న వాయుగుండం.. రెండ్రోజులు వర్షాలు

సారథిన్యూస్​, అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కోస్తాఆంధ్ర వైపు దూసుకొస్తున్నది. అయితే మరో 12 గంటల్లో అతి తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో రానున్న రెండ్రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నది. ఆంధ్రప్రదేశ్​లోని నర్సాపురం, విశాఖ, కాకినాడ సమీపంలో వాయుగుండం తీరం దాటే అవకాశం ఉంది. కాకినాడకు తూర్పు ఆగ్నేయ దిశగా వాయుగుండం కేంద్రీకృతమైంది. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి.. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ […]

Read More

నేపాల్​ ముఠా అరెస్ట్​.. ఎలా దొరికారంటే

కొంతకాలంగా హైదరాబాద్​తోపాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వరుస దొంగతనాలు చేస్తున్న ముఠా సైబారాబాద్​ పోలీసులకు చిక్కింది. ఉత్తరప్రదేశ్ సరిహద్దులో వీరిని అరెస్ట్​ చేసినట్టు సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ తెలిపారు. నిందితుల నుంచి రూ.5లక్షల నగదు, బంగారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్ 6న ఈ ముఠా హైదరాబాద్ రాయదుర్గంలో ఈ ముఠా దొంగతనానికి పాల్పడింది. మధుసూదన్​రెడ్డి అనే కాంట్రాక్టర్​ ఇంట్లో పనిమనుషులుగా చేరిన ముఠా సభ్యులు వారి కుటుంబానికి భోజనంలో మత్తు మందు ఇచ్చి దొంగతనానికి పాల్పడ్డారు. […]

Read More
తెలంగాణలో 1,021 కరోనా కేసులు

తెలంగాణలో 1,021 కరోనా కేసులు

సారథి న్యూస్​, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. సోమవారం 30,210 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,021 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,13,084కు చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో ఆరుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,228కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 228 కొత్త కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా బారినుంచి తాజాగా 2,214 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల […]

Read More
గురుకుల డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్టు ఉద్యోగాలు

గురుకుల డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్టు ఉద్యోగాలు

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ సోష‌ల్ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్ ఎడ్యుకేష‌నల్ ఇన్‌స్టిట్యూష‌న్స్ సొసైటీ (టీఎస్‌డ‌బ్ల్యూఆర్ఈఐఎస్) డిగ్రీ గురుకులాలో తాత్కాలిక ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి అర్హులైన మ‌హిళా అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.పోస్టులు ఇవేతెలుగు, ఇంగ్లీష్, కెమిస్ట్రీ, పిజిక్స్, బోటనీ , జువాలజీ, జియాలజి, కామర్స్‌ మాథ్స్, ఎకానామిక్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, మైక్రో బయాలజీ, సోషయాలజి, సైకాలజీ, జర్నలిజం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బయో టెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, జెనిటిక్స్, జియోగ్రఫీ, ఫుడ్ […]

Read More