సామాజికసారథి, శివ్వంపేట: మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రానికి చెందిన ముద్దగల్ల అంజయ్య కుమారుడు శ్రీకాంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా బుధవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. తనవంతు సహాయంగా తన సొంత డబ్బులు రూ.ఐదువేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. రోడ్డు ప్రమాదంలో శ్రీకాంత్ గాయపడటం బాధాకరమని, ఆయన కుటుంబానికి తామంతా అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ పద్మ వెంకటేశ్, గ్రామ కమిటీ […]
మహిబాత్ పూర్లో దుండగుల దుశ్చర్య సామాజికసారథి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని మహిబాత్ పూర్ గ్రామ శివారులో గుర్తుతెలియని దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. సమాధిని తవ్వి మహిళ పుర్రెను ఎత్తుకెళ్లారు. ఈఘటన గ్రామంలో కలకలం రేపింది. రాయికోడ్ మండలం మహాబథ్ పూర్ గ్రామానికి చెందిన కొనింటి ఏలిశా బెతూ అనే మహిళ అనారోగ్యంతో మూడేళ్ల క్రితం మృతిచెందింది. వారి గ్రామ శివారులో ఉన్న పొలం వద్ద అంత్యక్రియలు నిర్వహించి సమాధి చేశారు. కానీ, జనవరి 6న […]
సామాజిక సారథి, కౌడిపల్లి: అప్పుల బాధతో ఓ రైతు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కంచన్ పల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కంచన్ పల్లి గ్రామానికి చెందిన దుంపల మల్లేశం(40) తనకున్న 30 గుంటల వ్యవసాయ పొలంలో వరి సాగుచేస్తున్నాడు. కాగా, వ్యావసాయానికి, తన కుమార్తె వివాహంకోసం రూ.4లక్షల వరకూ అప్పు చేశాడు. అప్పలు ఎలా తీర్చాలో తెలియక మల్లేశం తీవ్ర […]
ఆ పొలంలోకి రామంటున్న కూలీలు కూలీలు రాకపోవడంతో రైతుల్లో ఆందోళన విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవట్లేదని స్థానిక రైతుల ఆరోపన సామాజిక సారథి, కౌడిపల్లి: పంట పొలంలో విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారాయని వాటిని సరిచేయాలని పలుమార్లు సంబంధిత విద్యుత్ సిబ్బందికి చెప్పినా పట్టించుకున్న పాపానపోలేదని స్థానిక రైతులు వాపోతున్నారు. కౌడిపల్లి సమీపంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ వెనకాల ధర్మసాగర్ కట్ట వద్దనున్న 33/11 కెవి విద్యుత్ స్తంభాలు పంట పొలంలో వంగి ఉన్నాయని రైతులు […]
పెట్రోల్ ట్యాంక్ పగిలి ఇద్దరు సజీవదహనం సామాజిక సారథి, మెదక్: బైక్ గుంటలో పడి మంటలు చెలరేగడంతో ఇద్దరు సజీవదహనమయ్యారు. ఈ సంఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బొడ్మట్ పల్లిలో శివారులో చోటుచేసుకుంది. నారాయణ్ ఖేడ్ మండలం మంగల్ పేట్ గ్రామానికి చెందిన దత్తు(23), వాసుదేవ్‌లు బైక్ పై సంగారెడ్డికి వెళ్తున్నారు. బొడ్మట్ పల్లి సమీపంలో రాంగ్ రూట్లో వెళుతుండగా, బైక్ అదుపుతప్పి డివైడర్ కోసం తవ్విన గుంటలో పడ్డారు. ఈ ప్రమాదంలో పెట్రోల్ ట్యాంక్ […]
అంతర్జాతీయ స్థాయికి ఆటోవాలా గ్రామీణ యువకుడిలో విశేష ప్రతిభ యువతకు శిక్షణ ఇచ్చి పలువురిలో స్ఫూర్తి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చనే విషయాన్ని ఓ మారుమూల గ్రామీణ యువకుడు నిరూపించాడు. ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించాడు. ఓ వైపు ఆటోడ్రైవర్‌గా తన జీవిత ప్రస్థానం కొనసాగిస్తూనే మరోవైపు తనకు ఇష్టమైన కరాటే రంగంలో పేరు తెచ్చుకున్నాడు. మనసుంటే మార్గం ఉంటుందని, నచ్చిన రంగంపై ఆసక్తి పెంచుకుని, అందులో కృషిచేస్తే ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని పరుశురాం నిరూపించాడు. సామాజిక […]
సామాజిక సారథి, పెద్ద శంకరంపేట: పోలీసులు ప్రజలతో మమేకమై సేవా దృక్పథంతో విధులు నిర్వహించాలని మెదక్ డీఎస్పీ సైదులు అన్నారు. మంగళవారం పెద్దశంకరంపేట పోలీస్ స్టేషన్ ను ఆయన తనిఖీ చేసిన స్థానిక విలేకరులతో మాట్లాడారు. అంతకు ముందు స్టేషన్ లో పలు రికార్డులు, పోలీస్ సిబ్బంది పనితీరు, పరేడ్, మెయింటినెన్స్, క్రైమ్ తదితర వివరాలను పరిశీలించారు. గ్రామాలలో ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పేట ఎస్ఐ నరేందర్ కు డీఎస్పీ సూచించారు.. పెద్దశంకరంపేట […]
సామాజికసారథి, సిద్దిపేట: గతనెల 17న సెలవుపై వచ్చి కనిపించకుండా పోయిన ఆర్మీ జవాన్ బూకూరి సాయికిరణ్ రెడ్డి ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు అడిషనల్ డీసీపీ(అడ్మిన్) శ్రీనివాసులు తెలిపారు. సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతరెడ్డిపల్లికి చెందిన సాయికిరణ్ రెడ్డి 15 నెలల క్రితం ఆర్మీ జవాన్ గా ఎంపికై పంజాబ్ లోని ఫరిద్ కోట్ రెజిమెంట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. గతనెల 17న అక్కడి నుంచి సెలవుపై ఇంటికొచ్చాడు. తిరిగి […]