సామాజికసారథి, సిద్దిపేట: గతనెల 17న సెలవుపై వచ్చి కనిపించకుండా పోయిన ఆర్మీ జవాన్ బూకూరి సాయికిరణ్ రెడ్డి ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు అడిషనల్ డీసీపీ(అడ్మిన్) శ్రీనివాసులు తెలిపారు. సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతరెడ్డిపల్లికి చెందిన సాయికిరణ్ రెడ్డి 15 నెలల క్రితం ఆర్మీ జవాన్ గా ఎంపికై పంజాబ్ లోని ఫరిద్ కోట్ రెజిమెంట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. గతనెల 17న అక్కడి నుంచి సెలవుపై ఇంటికొచ్చాడు. తిరిగి […]
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ పుల్వామా జిల్లాలోని బుందోజ్ ఏరియాలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను సెక్యూరిటీ సిబ్బంది మట్టుబెట్టారు. ఉగ్రవాదులు జరిపిన ఎదురుకాల్పుల్లో సీఆర్‌పీఎఫ్ జవాన్ఒకరు ప్రాణాలు విడిచినట్లు అధికారులు చెప్పారు. బుందూజ్ ఏరియాలో టెర్రరిస్టులు దాక్కురనే పక్కా సమాచారంతో మన సైనికులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఆ సమయంలో ఒక ఇంట్లో నక్కి ఉన్న టెర్రరిస్టులు కాల్పులకు దిగడంతో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో ఒక జవాన్‌కు తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్‌కు తరలించగా అతడు […]
సారథి న్యూస్, రామడుగు: చైనా సరిహద్దులో శత్రు మూకల దాడిలో అమరుడైన తెలంగాణ కు చెందిన వీర జవాన్ సంతోష్ బాబు కు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం శానగర్లో సోమవారం నివాళి అర్పించారు. సంతోష్‌బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి.. అతడి సేవలను కొనియాడారు. ప్రతి ఇంట్లోనూ ఓ సంతోష్‌బాబు తయారు కావాలని ఆకాంక్షించారు
సారథి న్యూస్, రామడుగు/ఖమ్మం: చైనా శత్రు మూకల దాడిలో అసువులు బాసిన వీర జవాన్లకు రామడుగులోని అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యావంతులవేదిక ఆధ్వర్యంలో గురువారం కొవ్వత్తులు వెలిగించి సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో అమర జవాన్లకు నివాళి అర్పించారు.