ములుగులో సీతక్క నిరసన సామాజిక సారథి, ములుగు: స్థానికత కోసమే పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. తక్షణమే 317 జీవోను రద్దు చేయాలని డిమాండ్చేస్తూ గురువారం ఆమె ములుగు జిల్లా కేంద్రంలో రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలతో చర్చించి అందరికీ ఆమోద యోగ్యమైన బదిలీలను చేపట్టాలని, స్థానికత ఆధారంగా ఉద్యోగుల బదిలీలలో ప్రాధాన్యత కల్పించాలని ఆమె ప్రభుత్వాన్ని […]
మేడారం జాతరపై కలెక్టర్ సమీక్ష సామజిక సారథి, ములుగు: మేడారం మహా జాతర విజయవంతం చేయడానికి ఆదివాసి పెద్దలు, అదివాసి సంఘాలు సహకరించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య కోరారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఆదివాసి పెద్దలు, ఆదివాసి సంఘాలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఐటీడీఏ ఇన్చార్జి పీవో ఎస్ కృష్ణ ఆదిత్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లడారు. మేడారం జాతరలో ఆదివాసి సంఘాలకు 22 లిక్కర్ షాపులు […]
ఆదివాసీలను ఆగం చేస్తే చూస్తూ ఉరుకోము అభివృద్ధి పేరుతో దోచుకుంటే చర్యలు తప్పవు సామాజిక సారథి,ములుగు ప్రతినిధి: మావోయిస్టు పార్టీ డివిజన్ కార్యదర్శి వెంకటేష్ పేరుతో ఇసుక ఏజెన్సీలో జరుగుతున్న మాఫియాపై ఆదివారం లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో గోదావరి పొడవునా ఆదివాసి సొసైటీల పేరుతో కొనసాగుతున్న ఇసుక ర్యాంపులలో ఇసుక మాఫియా చొరబడి తమ లాభాల కోసం ఆదివాసి ప్రజల మధ్య వైరుధ్యాలు సృష్టించింది రెండు మూడు గ్రూపులుగా చీల్చి ప్రజల ఐక్యతను దెబ్బతీయడం […]
సామజిక సారథి, ములుగు ప్రతినిధి: జిల్లాలో ఈవీఎం గోడౌనల నిర్మాణం చేపట్టాలని ఎలక్షన్ సీఈవో శశాంక్ గోయల్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం విచ్చేసిన ఎలక్షన్ సీఈవో శశాంక్ గోయల్ కి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, డీఆర్వో రమాదేవి పుష్పగుచ్ఛం తో స్వాగతం పలికారు. అనంతరం నూతనంగా నిర్మించిన ఎలక్షన్ ఈవీఎం గోడౌన్ ను ఎలక్షన్ సీఈవో, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యతో కలిసి ప్రారంభించారు.ఈవీఎం గోడౌన్ పరిశీలించి అత్యంత నాణ్యత ప్రమాణాలతో […]
సామజిక సారథి, ములుగు ప్రతినిధి: ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఇటీవలే తల్లిదండ్రులను కోల్పోయి నిరశ్రాయులుగా మారిన ఆడపిల్లలకు శనివారం ఆమె ఆసరాగా నిలిచారు. ములుగు జిల్లా జగ్గన్నగూడెం గ్రామానికి చెందిన పైడయ్య మరణించడంతో నలుగురు అమ్మాయిలు నిరశ్రాయులుగా మారారు. అతడి దహన సంస్కారాలు కోసం తస్లీమా సహాయం చేసిన విషయం అందరికి విదితమే. సోమవారం అతడి దశదినకర్మ కావడంతో కార్యక్రమం చేయడానికి కూడా స్థోమత లేక […]
పోలీసు ఇన్ఫార్మర్లకు హెచ్చరికలు సామాజిక సారథి, వెంకటాపురం: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని కొండాపురం గ్రామ సమీపంలోని భద్రాచలం, వెంకటాపురం ప్రధాన రహదారిపై వెలసిన మావోయిస్టు కరపత్రాలు వెలువడ్డాయి. మావోయిస్టుల వారోత్సవాలు ముగిసిన అనంతరం లేఖ వెలువడటంతో ఈలేఖ స్థానికంగా కలకలం రేపుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయం గుప్పిట్లో ఏజెన్సీ గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులుకు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్న బొల్లారం, పెంకవాగు, కలిపాక, సీతారాంపురం గ్రామాలకు చెందిన వ్యక్తులు మావోయిస్టుల గురించి పోలీసులకు సమాచారం ఇస్తున్నారని పోలీసులు చూపే ప్రలోభాలకు, […]
సామజిక సారథి, ములుగు ప్రతినిధి: వ్యవసాయంపై మక్కువతో ఎప్పటిలాగే సెలవు రోజున సెల్క పనికి వెళ్ళారు. ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా ఆదివారం సెలవు రోజున ములుగు జిల్లా మాన్ సింగ్ తాండ పరిధి, భాగ్యతండాలో అలవాత్ బధ్యా, భుల్లి దంపతుల పత్తి చేనులో కూలీలతో కలిసి పత్తి (ఏరారు ) తీశారు. ఒక సాధారణ వ్యక్తిలా కూలీలతో కలిసి అన్నం తిన్నారు. ఎండనక, వానానక కాయకష్టం చేసుకొనే కర్షకులకు బాసటగా నిలుద్ధామని ములుగు,భూపాలపల్లి […]
ములుగు ఎమ్మెల్యే సీతక్క సామజిక సారథి, మంగపేట: సభ్యత్వ నమోదుపై కాంగ్రెస్ నాయకులు దృష్టిసారించాలని, కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆ పార్టీ రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మంగపేట మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో నిర్వహించిన కాంగ్రెస్ మండల నాయకుల సమావేశంలో ఎమ్మెల్యే సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సభ్యత్వం తీసుకున్న వారికి ప్రమాదంలో మరణిస్తే రూ.2లక్షల ఇన్స్ రెన్స్ వర్తిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ […]