సారథిన్యూస్, గద్వాల: త్వరలో జరుగబోతున్న తుంగభద్ర పుష్కరాలకు ప్రత్యేక బస్సులు నడపాలని.. పుష్కరఘాట్ల వద్ద మరమ్మతులు ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన అలంపూర్‌లో మీడియాతో మాట్లాడారు.. తెలంగాణ రాష్ట్రంలో కేవలం అలంపూర్ ఒక్కచోటే తుంగభద్ర పుష్కరాలు జరుగుతాయని.. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని ఆయన కోరారు. ప్రస్తుతం పులికలు, వేణిసోంపురం, రాజోలి, తుమ్మిళ్ల, పుల్లూరు, అలంపూర్ వద్ద ఉన్న పుష్కరఘాట్లు చాలా అధ్వాన్నంగా ఉన్నాయని ప్రభుత్వం బాగుచేయాలని కోరారు. […]
సారథి న్యూస్, కర్నూలు: నగరంలోని బైరెడ్డి ఫంక్షన్ హాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 70వ జన్మదిన వేడుకలను డాక్టర్బైరెడ్డి శబరి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కపిలేశ్వరయ్య, జిల్లా అధ్యక్షుడు రామస్వామి, కగ్గొలు హరీష్ బాబు, బీవీ సుబ్బారెడ్డి, జీఎస్ నాగరాజు, అంబిలి కాశీ విశ్వనాథ్, బైరెడ్డి దినేష్ రెడ్డి, హేమలతరెడ్డి, చింతలపల్లి రామకృష్ణ, శ్రీ జ్యోతి, సిలివెరి వెంకటేశ్, శివప్రసాద్ రెడ్డి, చల్లా దామోదర్ రెడ్డి, శ్రీనివాస ఆచారి పాల్గొన్నారు.
సారథి న్యూస్, రామాయంపేట: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని గొప్పలు చెప్పిన సీఎం కేసీఆర్ మాట తప్పారని, ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు రోజులు దగ్గరపడ్డాయని మెదక్ జిల్లా నిజాంపేట బీజేపీ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గురువారం నిజాంపేట మండలకేంద్రంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ కోసం బలిదానం చేసుకున్న తెలంగాణ అమరవీరులను స్మరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే విమోచన […]
ఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ నారాయణ సింగ్ ఎన్నికయ్యారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేసిన ఆర్జేడీ నేత మనోజ్ ఝూ పై హరివంశ్ గెలుపొందారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ముజువాణి పద్ధతిలో ఓటింగ్ నిర్వహించి.. హరిశంశ్ సింగ్ గెలుపొందినట్టు ప్రకటించారు. 2018లో హరివంశ్ సింగ్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో పదవికాలం ముగియడంతో ఆయన మరోసారి పోటీలో నిలిచారు. మొత్తం 245 మంది సభ్యులున్న రాజ్యసభలో ఎన్డీఏకు 113 మంది సభ్యుల […]
ప్రధాని నెమలితో ఆడుకోవడంలో బిజీగా ఉన్నారు ప్రధానమంత్రి మోడీపై రాహుల్ ఫైర్ న్యూఢిల్లీ : ప్రధాని మోడీ, బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకుడు, ఆ పార్టీ మాజీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ఫైర్ అయ్యారు. మోడీ నెమళ్లతో ఆడుకోవడంలో బిజీగా ఉన్నారనీ, ప్రజలంతా ఎవరి జీవితాలను వారే కాపాడుకోవాలని సూచించారు. సోమవారం ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘భారత్‌లో కరోనా కేసులు ఈ వారంలో 50 లక్షలు చేరుకోనున్నాయి. ఒక వ్యక్తి ఆహాన్ని సంతృప్తి పరుచుకునేందుకు […]
ఢిల్లీ: ఇటీవలే కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయిన కేంద్రహోం మంత్రి అమిత్ షా మరోసారి అస్వస్థతకు గురయ్యారు. శనివారం అర్ధరాత్రి ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో కుటుంబసభ్యులు వెంటనే ఎయిమ్స్‌కు తరలించారు. ఆగస్టు 2న అమిత్ షాకు కరోనా పాటిజివ్ గా నిర్ధారణ అయ్యింది. గురుగ్రామ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందిన ఆయన 14న డిశ్చార్జి అయ్యారు. అయితే ఆగస్టు 18న అయన మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఎయిమ్స్‌లో […]
సారథి న్యూస్, కర్నూలు: రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విధ్వంసక్రీడను ప్రోత్సహిస్తోందని, హిందూదేవాయాలపై దాడులు జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పార్థసారథి ప్రశ్నించారు. అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి రథాన్ని దగ్ధం చేసిన దోషులను అరెస్టు చేయకుండా.. దాడులపై ప్రశ్నించిన హిందూ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇచ్చిన పిలుపు మేరకు.. అంతర్వేది ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ […]
సారథి న్యూస్, రామాయంపేట: దుబ్బాక అసెంబ్లీకి ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు టీఆర్ఎస్ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బుధవారం ఆయన మెదక్ జిల్లా నిజాంపేటలో టీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సిద్దరాములు, జెడ్పీటీసీ విజయ్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.