తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి కంగనా తిరుపతి/ కర్నూలు: ప్రముఖ పుణ్యక్షేత్ర శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. నూతన సంవత్సరం సందర్భంగా స్వామి అమ్మవారి దర్శనం కోసం భక్తులు తరలివచ్చారు. దీంతో మల్లికార్జునస్వామి వారి దర్శనానికి నాలుగు గంటలు సమయం పట్టింది. ఈరోజు వేకువజామున నాలుగు గంటల నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో స్వామివారి గర్భాలయ అభిషేకాలు, స్వామివారి స్పర్శ దర్శనాలను దేవస్థానం తాత్కాలికంగా నిలుపుదల చేసింది. […]
దెబ్బతిన్న శ్రీవారి మెట్ల మార్గం పునరుద్ధరణ పనులు పద్మావతి చిన్నపిల్లల ఆస్పత్రిలో సూపర్‌స్పెషాలిటీ సేవలు చైర్మన్వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ధర్మకర్తల మండలి సమావేశం చైర్మన్వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన శనివారం జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ధార్మిక కార్యక్రమాలకు సంబంధించి కొన్ని, అభివృద్ధి పనులకు సంబంధించి మరికొన్ని ఉన్నాయి. ఇటీవల భారీవర్షాలకు దెబ్బతిన్న శ్రీవారి మెట్టు మార్గంలో రూ.3.6 కోట్ల వ్యయంతో, రెండో ఘాట్ […]
మోహినీ అవతారంలో అమ్మవారు దర్శనం తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం ఉదయం పల్లకీపై మోహినీ అలంకారంలో శ్రీ అలమేలుమంగ అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. కరోనా నేపథ్యంలో ఆలయం వద్దగల వాహన మండపంలో ఉదయం 8 నుంచి 9 గంటల వరకు పల్లకీ ఉత్సవం ఏకాంతంగా నిర్వహించారు. అమ్మవారి మోహినీ అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్నీ, ఆధ్యాత్మికంగా మాయాతీతశుద్ధ సత్త్వస్వరూప సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తోంది.
కార్తీక దీపోత్సవానికి వచ్చి గుండెపోటుతో హఠాన్మరణం సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం స్వామి సేవలో జీవితం అంకితం చేశారు: సుప్రీం సీజేసీ జస్టిస్ఎన్వీ రమణ తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూశారు. కార్తిక దీపోత్సవంలో పాల్గొనడానికి విశాఖపట్నం వెళ్లిన ఆయన గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. సోమవారం తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు రాగా, దవాఖానకు తరలించే లోపే ఆయన తుదిశ్వాస విడిచారు. డాలర్ శేషాద్రి 1978 నుంచి శ్రీవారి సేవలో పాల్గొంటున్నారు. […]
ఫ్యాన్‌గాలికి కొట్టుకుపోయిన విపక్షాలు మిన్నంటిన వైఎస్సార్సీపీ సంబరాలు తిరుపతి: తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుమూర్తి 2,31,943 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచీ ఆయన ఆధిక్యం కనబరిచారు. వైఎస్సార్ సీపీకి 5,37,152 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీకి 3,05,209 ఓట్లు వచ్చాయి. ఇక జనసేనతో కలిసి ఎన్నికల బరిలో దిగిన బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు 50,739, కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ […]
తిరుపతి: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజు ఉదయం రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా ఆలయం లోపలే వేడుకలు జరుగుతున్నందున రథోత్సవం స్థానంలో సర్వభూపాల వాహనాన్ని ఏర్పాటు చేశారు. అధికారం దుర్వినియోగం కాకుండా ఉండాలంటే వారు భగవత్ సేవా పరులు కావాలి. ఈ దివ్యమైన సందేశాన్ని సర్వభూపాల వాహన సేవ ఇస్తోంది.
సారథి న్యూస్, అమరావతి: అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయిన దుర్గాప్రసాద్‌కు పేదల నేతగా ప్రజల్లో పేరుంది. నిత్యం ప్రజలతో కలిసిమెలిసి ఉంటే దుర్గాప్రసాద్ నిరాడంబరంగా మెలిగేవారు. తన అనుచరులను నిత్యం పేరుపెట్టి పిలుస్తూ పలకరించేవారు. ఏ కష్టమొచ్చినా వెంబడే స్పందించారు. అలాంటి నేత తమ మధ్య లేకపోవడంతో కార్యకర్తలు నిర్ఘాంతపోయారు. ఇదీ రాజకీయ చరిత్ర..టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పిలుపుతో 26 ఏళ్ల వయస్సులోనే దుర్గాప్రసాద్ రాజకీయాల్లోకి వచ్చారు. అంతకు ముందు ఆయనకు నెల్లూరు మంచి లాయర్‌గా పేరు ఉండేది. […]
సారథి న్యూస్, తిరుమల: శ్రీవారు.. ప్రపంచంలో అతిపెద్ద కుబేరుడు. ఇది కరోనా కాలం కంటే ముందు. కానీ ఇప్పుడు కరోనా కాలంలో శ్రీవారి హుండీకి గండి పడింది. తిరుమల తిరుపతి దేవస్థాన శ్రీవారు కలియుగ ప్రత్యక్ష దైవం. భక్తుల కష్టాలు గట్టెక్కించడానికి తిరుమలలో వెలిశారు. స్వామివారిని ఏడాదికి రెండున్నర కోట్ల మందిపైగా భక్తులు దర్శించుకుంటారు. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజు రోజుకు ఎప్పటికప్పుడు రికార్డు బద్దలుకొట్టేసేది. కానీ ఇప్పుడు రికార్డులే లేవు. మొదట్లో వేల రూపాయలతో […]