షార్జా: ఐపీఎల్13వ సీజన్లో భాగంగా షార్జా వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన 41వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చిత్తుగా ఓడింది. దీంతో ప్లే ఆఫ్ రేసు నుంచి సీఎస్‌కే నిష్క్రమించింది. మొదట సీఎస్‌కే నిర్దేశించిన 115 పరుగుల టార్గెట్‌ను ఇషాన్ కిషన్(68 నాటౌట్; 37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), డీకాక్(46 నాటౌట్; 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) వికెట్ పడకుండా 12 ఓవర్లలోనే ఛేదించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై […]
తిరుపతి: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజు ఉదయం రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా ఆలయం లోపలే వేడుకలు జరుగుతున్నందున రథోత్సవం స్థానంలో సర్వభూపాల వాహనాన్ని ఏర్పాటు చేశారు. అధికారం దుర్వినియోగం కాకుండా ఉండాలంటే వారు భగవత్ సేవా పరులు కావాలి. ఈ దివ్యమైన సందేశాన్ని సర్వభూపాల వాహన సేవ ఇస్తోంది.
‘వరల్డ్ ఫేమస్ లవర్’ డిజాస్టర్ తర్వాత రాశీఖన్నా చేతిలో ఒక తెలుగు సినిమా కూడా లేదు. దీనికి తోడు కరోనా ప్రభావంతో ఎక్కడి షూటింగ్‌లు అక్కడే నిలిచిపోయాయి. దీంతో బీజీగా ఉండే సెలబ్రెటిస్ సైతం ఇంటికే పరిమితమైపోయారు. ఇప్పుడు మళ్లీ నెమ్మది నెమ్మదిగా ఒక్కో చిత్రం ట్రాక్ ఎక్కుతోంది. ఆల్రెడీ కమిటై ఉన్నవాళ్లు షూటింగ్స్ కు అటెండ్ అవుతున్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న రాశీకి కోలీవుడ్‌లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘తుగ్లక్ […]
సారథి న్యూస్, బిజినేపల్లి: దేవీశరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా పాలెం వెంకటేశ్వర ఆలయం సన్నిధిలో ఫ్రెండ్స్ యూత్ క్లబ్, పద్మావతి మాతృ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన అమ్మవారికి భక్తులు విశేషపూజలు చేశారు. రోజుకొక పూజతో దుర్గామాతను కొలుస్తున్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ టీచర్ సురేందర్, సూర్యకళ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఫ్రెండ్స్ యూత్ క్లబ్ సభ్యులు అధ్యక్షుడు ప్రమోద్ కుమార్, జగదీశ్, వెంకటేష్, ఆనంద్ సింగ్ , మోహన్, పూజారి జయంత్ శర్మ, కమిటీ […]
సారథి న్యూస్, నిజాంపేట: మెదక్ జిల్లా నందిగామలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం దుర్గామాత బోనాలను భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ సభ్యుడు లద్ధ సురేష్ మాట్లాడుతూ .. ప్రతి ఇంటి నుంచి బోనాలను సర్వంగా సుందరంగా అలంకరించి ఊరేగింపు నిర్వహించామని తెలిపారు. అనంతరం ఊర రేణుక పోచయ్య ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ లద్ధప్రీతి రాజగోపాల్, ఉపసర్పంచ్ గెల్లు రాజాం, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు బిజ్జ సంపత్, విగ్రహ దాత […]
సారథి న్యూస్, అలంపూర్: జోగుళాంబ అమ్మవారి ఆశీస్సులు, బాల బ్రహ్మేశ్వర దీవెనలు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికిపై ఉండాలని కోరుతూ జడ్పీ చైర్పర్సన్సరిత అమ్మవారికి పట్టువస్త్రాలు అలంకరించారు. దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారిని దర్శించుకున్నారు. ఆమె వెంట మార్కెట్ వైస్ చైర్మన్ లక్ష్మన్న, వడేపల్లి జడ్పీటీసీ కాశపోగు రాజు, రాజోలి జడ్పీటీసీ సుగుణమ్మ, శ్రీనాథ్ రెడ్డి, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు ఆత్మలింగారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ శ్రీధర్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ మునగాల నరసింహులు, […]
సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో సహాయ పునరావాస కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నగరంలో జరుగుతున్న సహాయ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ‘భారీ వర్షాలు, వరదల వల్ల ఇండ్లలోకి నీరొచ్చి ఆహార పదార్ధాలు, దుస్తులు, చెద్దర్లు అన్నీ తడిసిపోయాయి. కనీసం వండుకుని తినే పరిస్థితుల్లో కూడా చాలా కుటుంబాలు లేవు. అందుకే వారికి తక్షణ సాయంగా ప్రతి బాధిత కుటుంబానికి రూ.10వేల చొప్పున […]
రెండు విభాగాలుగా చేసి ఐఏఎస్ లకు బాధ్యతలు అప్పగించాలి మరిన్ని సంస్థాగత మార్పులు జరగాలి వ్యవసాయశాఖపై సమీక్షలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా మారుతోందని, అందుకు తగ్గట్టుగా వ్యవసాయశాఖ బలోపేతం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. వ్యవసాయశాఖలో మరో రెండు విభాగాలు ఏర్పాటు చేసి ఐఏఎస్ అధికారులను బాధ్యులుగా నియమించాలని ఆదేశించారు. వర్షాకాలం పంటలను కొనుగోలు చేయడానికి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సూచించారు. ప్రగతిభవన్ లో శుక్రవారం […]