Breaking News

వైభవంగా కార్తీక బ్రహ్మోత్సవాలు

వైభవంగా కార్తీక బ్రహ్మోత్సవాలు
  • మోహినీ అవతారంలో అమ్మవారు దర్శనం

తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం ఉదయం పల్లకీపై మోహినీ అలంకారంలో శ్రీ అలమేలుమంగ అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. కరోనా నేపథ్యంలో ఆలయం వద్దగల వాహన మండపంలో ఉదయం 8 నుంచి 9 గంటల వరకు పల్లకీ ఉత్సవం ఏకాంతంగా నిర్వహించారు. అమ్మవారి మోహినీ అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్నీ, ఆధ్యాత్మికంగా మాయాతీతశుద్ధ సత్త్వస్వరూప సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తోంది.