Breaking News

శ్రీశైలంలో భక్తుల రద్దీ

శ్రీశైలంలో భక్తుల రద్దీ
  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి కంగనా

తిరుపతి/ కర్నూలు: ప్రముఖ పుణ్యక్షేత్ర శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. నూతన సంవత్సరం సందర్భంగా స్వామి అమ్మవారి దర్శనం కోసం భక్తులు తరలివచ్చారు. దీంతో మల్లికార్జునస్వామి వారి దర్శనానికి నాలుగు గంటలు సమయం పట్టింది. ఈరోజు వేకువజామున నాలుగు గంటల నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో స్వామివారి గర్భాలయ అభిషేకాలు, స్వామివారి స్పర్శ దర్శనాలను దేవస్థానం తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఆలయ నిర్వాహకులు, పోలీసుల చర్యలతో సామాన్య భక్తులు ఇబ్బందులు పడ్డారు. వీఐపీల సేవలో అధికారులు, పోలీసులు తరిస్తుండటంతో సామాన్య భక్తులు ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సి పరిస్థితి ఉంది. దీంతో పలువురు భక్తులు స్పృహ తప్పి పడిపోయారు. ఇదిలాఉండగా, నూతన సంవత్సరం సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ ఫైర్​బ్రాండ్‌ కంగనా రనౌత్‌ శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం 2 గంటలకు వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో కంగనాకు వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. అలాగే ఆలయ అర్చకులు పట్టువస్త్రాలతో ఆమెను సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.