Breaking News

వేంకటేశ్వరస్వామి

వైభవంగా వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టాపన

వైభవంగా వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టాపన

సామాజిక సారథి, నాగర్ కర్నూల్: నాగర్​కర్నూల్ ​జిల్లా బిజినేపల్లిలో ఆనందగిరిపై ఇటీవల కొత్తగా నిర్మించిన వేంకటేశ్వర స్వామి ఆలయం ప్రతిష్టాపన మహోత్సవంలో గురువారం ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయనను ఆలయకమిటీ సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో నాయకులు, అభిమానులు వెంకట్రామిరెడ్డి, తిరుపతయ్య, రాజేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Read More
వేంకటేశ్వరస్వామికి ప్రత్యేకపూజలు

వేంకటేశ్వరస్వామికి ప్రత్యేకపూజలు

సామాజిక సారథి, నాగర్ కర్నూల్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు, యువనేత డాక్టర్ రాజేష్ రెడ్డి నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని పలు శుభకార్యాల్లో ఆదివారం విస్తృతంగా పాల్గొన్నారు. నాగర్ కర్నూల్ లోని ముఖ్యకార్యకర్తలతో కలిసి తాడూరు మండల కేంద్రంలోని బొడ్రాయి పండుగలో పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి నాగర్ కర్నూల్, తెలకపల్లి గ్రామాల్లో కార్యకర్తల పిలుపుమేరకు పలు వివాహ శుభకార్యాల్లో పాల్గొన్నారు. అనంతరం బిజినేపల్లి మండలంలోని పాలెం వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్కడ […]

Read More
వైభవంగా వేంకటేశ్వరుడి కల్యాణం

వైభవంగా వేంకటేశ్వరుడి కల్యాణం

సారథి న్యూస్, రామడుగు: రామడుగు మండలంలోని వెదిర గ్రామంలో వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం గురువారం వేదపండితుల మంత్రోచ్ఛరణ మధ్య అంగరంగ వైభవంగా సాగింది. దుర్ముట్ల లక్ష్మీ, నర్సింహారెడ్డి, దుర్ముట్ల హారిక కిషన్ రెడ్డి, సందూరి జ్యోతి, రవీందర్ రెడ్డి దగ్గరుండి జరిపించారు. స్వామి వారిని ఎదుర్కోలుగా తీసుకొచ్చి ముత్యాల పందిరిలో కూర్చోబెట్టగా వేదపండితులు కల్యాణం జరిపించారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించి కట్నకానుకలు సమర్పించారు. స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో […]

Read More
తిరుమల శ్రీవారి హుండీకి గండి

తిరుమల శ్రీవారి హుండీకి గండి

సారథి న్యూస్​, తిరుమల: శ్రీవారు.. ప్రపంచంలో అతిపెద్ద కుబేరుడు. ఇది కరోనా కాలం కంటే ముందు. కానీ ఇప్పుడు కరోనా కాలంలో శ్రీవారి హుండీకి గండి పడింది. తిరుమల తిరుపతి దేవస్థాన శ్రీవారు కలియుగ ప్రత్యక్ష దైవం. భక్తుల కష్టాలు గట్టెక్కించడానికి తిరుమలలో వెలిశారు. స్వామివారిని ఏడాదికి రెండున్నర కోట్ల మందిపైగా భక్తులు దర్శించుకుంటారు. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజు రోజుకు ఎప్పటికప్పుడు రికార్డు బద్దలుకొట్టేసేది. కానీ ఇప్పుడు రికార్డులే లేవు. మొదట్లో వేల రూపాయలతో […]

Read More