Breaking News

Day: July 27, 2020

సోము వీర్రాజుకు ఏపీ బీజేపీ పగ్గాలు

సోము వీర్రాజుకు ఏపీ బీజేపీ పగ్గాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజును పార్టీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు సోమవారం నియామక ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను తప్పించింది. సోము వీర్రాజు స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా కత్తెరు గ్రామం. ఆయన ఎంతోకాలంగా బీజేపీలో కొనసాగుతున్నారు. పార్టీ పట్ల విధేయతగా పనిచేస్తున్న ఆయనకే బాధ్యతలను కట్టబెట్టినట్లు తెలుస్తోంది.

Read More
సరళాసాగర్ నీటి విడుదల

సరళాసాగర్ నీటి విడుదల

సారథి న్యూస్, వనపర్తి: వనపర్తి జిల్లా మదనాపురం మండలం సరళాసాగర్ ప్రాజెక్టు నుంచి రైతుల పంట పొలాలకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సోమవారం సాగునీటిని విడుదల చేశారు. గత డిసెంబర్ 31న ప్రాజెక్టు కట్ట తెగిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్​దృష్టికి తీసుకెళ్లడంతో ఫండ్స్​రిలీజ్​ చేయించి యుద్ధప్రాతిపదికన పనులు చేయించారు. రైతులు ఇబ్బందిపడకుండా సాగునీటిని విడుదల చేశామని చెప్పారు. ప్రాజెక్టుకు పూర్వవైభవం తీసుకొస్తామన్నారు.

Read More
అనుక్షణం అలర్ట్​గా ఉండాలి

ఎనీటైం అలర్ట్​గా ఉండాలి

సారథి న్యూస్​, కర్నూలు: కర్నూలు జిల్లాతో పాటు ఎగువన కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలు, వరదలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, గతేడాది ఫ్లాష్ ఫ్లడ్స్ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్​ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధికారులకు సూచించారు. సోమవారం ఆయన కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్ గెస్ట్ హౌస్ లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శ్రీశైలం, సుంకేసుల, గాజులదిన్నె డ్యాములు, వెలుగోడు, గోరకల్లు, పోతిరెడ్డిపాడు, అవుకు, కృష్ణగిరి, పందికోన హంద్రీ రిజర్వాయర్లు, తుంగభద్ర, […]

Read More
రాజ్​భవన్​లో కలాం వర్ధంతి

రాజ్​భవన్​లో కలాం వర్ధంతి

సారథిన్యూస్​, హైదరాబాద్​: మాజీ రాష్ట్రపతి అబ్ధుల్​ కలాం ఆశయాలు కొనసాగిద్దామని తెలంగాణ గవర్నర్​ తమిళ సై సౌందర్​రాజన్​ పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తిని యువత అలవర్చుకోవాలని సూచించారు. కలాం ఐదో వర్ధంతి సందర్భంగా సోమవారం రాజ్​భవన్​లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం తమిళనాడులోని కలాం బంధువులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడారు.

Read More
డబ్బుకొట్టు..ఇల్లు పట్టు

డబ్బుకొట్టు..ఇల్లు పట్టు

డబుల్​ బెడ్​రూం ఇళ్లంటూ ఘరానా మోసం జనాల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లు  మాదాపూర్, కూకట్​పల్లి ఎస్.ఓ.టీ పోలీసుల సంయుక్త ఆపరేషన్ లో బట్టబయలు సారథి న్యూస్​, హైదరాబాద్​ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రుమ్ పథకాన్ని అడ్డు పెట్టుకొని కొందరు వ్యక్తులు పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే… తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరానికి చెందిన గూతుల. ప్రశాంత్(విజన్-1టీవీ ఛానెల్ చైర్మన్ తండ్రి లక్ష్మీనారాయణ) అనే వ్యక్తి కూకట్​పల్లి హౌసింగ్ […]

Read More

గూగుల్​ కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: కరోనాను కట్టడి చేసేందుకు ప్రముఖ సాఫ్ట్​వేర్​ కంపెనీ గూగుల్​ కీలక నిర్ణయం తీసుకున్నది. తమ ఉద్యోగులకు ప్రస్తుతం కొనసాగిస్తున్న వర్క్​ప్రంహోం విధానాన్ని మరిన్ని రోజులు పొడగించింది. జూలై 2021 వరకు తమసంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు వర్క్​ప్రంహోంను పొడగిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఉద్యోగులకు కోసం వర్క్​ఫ్రం హోమ్​ను పొడిగించిన తొలి కంపెనీ గూగుల్​యే కావడం విశేషం. కాగా ఈ కంపెనీలో దాదాపుగా 2లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

Read More

భక్తులెవరూ అయోధ్యకు రావొద్దు

అయోధ్య: కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత సమయంలో భక్తులెవరూ అయోధ్యకు రావొద్దని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్​ సెక్రటరీ చంపత్​ రాయ్​ కోరారు. ఆగస్టు 5న అయోధ్యలో రామమందిర శంకుస్థాపన జరుగుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో చంపత్​ రాయ్​ ఈ ప్రకటన చేశారు. దేశంలోని భక్తులందరూ తమ ఇంట్లోనే ఆరోజు పూజలు చేసుకోవాలని సూచించారు. రామమందిర శంకుస్థాపన చరిత్రలో నిలిచిపోతుందని ఆయన చెప్పారు. కరోనా విపత్తువేళ కేవలం పరిమితమైన సంఖ్యలోనే అతిథులను ఆహ్వానించినట్టు ఆయన చెప్పారు.

Read More
తిరుమల శ్రీవారి హుండీకి గండి

తిరుమల శ్రీవారి హుండీకి గండి

సారథి న్యూస్​, తిరుమల: శ్రీవారు.. ప్రపంచంలో అతిపెద్ద కుబేరుడు. ఇది కరోనా కాలం కంటే ముందు. కానీ ఇప్పుడు కరోనా కాలంలో శ్రీవారి హుండీకి గండి పడింది. తిరుమల తిరుపతి దేవస్థాన శ్రీవారు కలియుగ ప్రత్యక్ష దైవం. భక్తుల కష్టాలు గట్టెక్కించడానికి తిరుమలలో వెలిశారు. స్వామివారిని ఏడాదికి రెండున్నర కోట్ల మందిపైగా భక్తులు దర్శించుకుంటారు. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజు రోజుకు ఎప్పటికప్పుడు రికార్డు బద్దలుకొట్టేసేది. కానీ ఇప్పుడు రికార్డులే లేవు. మొదట్లో వేల రూపాయలతో […]

Read More