సారథిన్యూస్, వికారాబాద్: వికారాబాద్ పట్టణంలోని అందరూ చూస్తుండగానే ఓ యువతి కిడ్నాప్‌కు గురయ్యింది. సినీ ఫక్కీలో యువతిని కిడ్నాప్ చేయడం ప్రస్తుతం వికారాబాద్‌లో కలకలం రేపుతున్నది. వికారాబాద్‌కు చెందిన ఓ వ్యాపారికు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అయితే ఆదివారం రాత్రి వారు షాపింగ్ కోసం బయటకు వెళ్లారు. ఈ క్రమంలో ఆమె అక్కతోపాటు , చుట్టుపక్కల ప్రజలు చూస్తుండగానే.. ఆ యువతిని దుండగులు ఓ వాహనంలో ఎక్కించుకొని పారిపోయారు. అయితే కిడ్నాప్‌కు గురైన యువతికి రెండేళ్ల క్రితమే […]
అహ్మదాబాద్: జాబ్ ఇస్తానంటూ ఫ్యాక్టరీకి పిలిపించిన ఓ పారిశ్రామిక వేత వివాహితపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో వెలుగుచూసింది. అహ్మదాబాద్‌లోని అమ్రాయివాడికి చెందిన ఓ యువతికి మూడేళ్ల క్రితం వివాహమైంది. భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల కరోనా ఎఫెక్ట్‌తో అతడి ఉద్యోగం పోయింది. దీంతో ఆ కుటంబం తీవ్ర ఆర్థికసమస్యల్లో కూరుకుపోయింది. దీంతో సదరు యువతి.. తనకు ఏదన్నా ఉద్యోగం ఇప్పించాలని తన ఇంటి పక్కన ఉండే […]
సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హేమంత్ హత్యకేసులో పలు కీలక నిజాలు వెలుగుచూస్తున్నాయి. హేమంత్ హత్యకు నెలముందే స్కెచ్వేసినట్టు సమాచారం. ఈ హత్యకు కీలక సూత్రధారి అవంతిక మేనమామ యుగందర్‌రెడ్డి అని పోలీసులు తెలిపారు. అతని కేసులో ఏ1గా పెట్టారు. యుగంధర్‌రెడ్డి నెలక్రితమే హేమంత్ హత్యకు స్కెచ్ వేసినట్టు సమాచారం.. పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం.. చందానగర్‌కు చెందిన లక్ష్మారెడ్డి, అర్చన దంపతుల కుమార్తె అవంతికి జూన్ 10న ఇంట్లో నుంచి […]
సారథి న్యూస్, బిజినేపల్లి: ఇటీవల ఒంటరి మహిళలపై గుర్తుతెలియని దుండగులు బైక్‌లపై వచ్చి గొలుసులు దొంగలించుకుంటున్నారని, వారి పట్ల మహిళలు జాగ్రత్తగా ఉండాలని బిజినేపల్లి ఎస్సై వెంకటేశ్ సూచించారు. మహిళలు రోడ్లపైకి వచ్చినప్పుడు అనుమానాస్పదంగా బైక్‌లపై చుట్టూ తిరిగే వారిపై ఓ కన్నేసి ఉంచాలన్నారు. అంతేకాకుండా గ్రామాలు, కాలనీల్లో గుర్తుతెలియని వ్యక్తులు తిరుగుతుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. నేరాలను అదుపుచేసే క్రమంలో ప్రజలు పోలీసులకు సహకరించాని కోరారు.
సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్‌లో పరువు హత్య తీవ్ర సంచలనంగా మారింది. కూతురు వేరే కులం యువకుడిని పెళ్లి చేసుకుందని తండ్రి సదరు యువకుడిని దారుణంగా హత్యచేయించాడు. సుఫారి గ్యాంగ్ ఈ హత్యకు పాల్పడ్డట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలు.. సంగారెడ్డికి చెందిన లక్ష్మారెడ్డి కుటుంబం చందానగర్‌లో నివాసం ఉంటోంది. లక్ష్మారెడ్డి కూతురు అవంతి, అదే ప్రాంతానికి చెందిన హేమంత్ ప్రేమించుకున్నారు. ప్రేమపెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో గత జూన్10న ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లిచేసుకున్నారు. అనంతరం హేమంత్, […]
ఆమె ఓ అందమైన యువతి.. ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈజీ మనికి అలవాటు పడింది. డబ్బున్నవాళ్లను పరిచయం చేసుకోవడం.. వారిని ముగ్గులోకి దించడం ఆమె హాబీ. పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు లేదా సోషల్‌మీడియాలో ఆమె ధనవంతులను పరిచయం చేసుకుంటుంది. తర్వాత వారితో మత్తెక్కించేలా మాట్లాడుతుంది. అనంతరం వాళ్లను తన ఇంటికి తీసుకెళ్లి.. శారీరకంగా లొంగదీసుకుంటుంది. అనంతరం అక్కడ సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియోలు తీస్తుంది. ఆ తర్వాత ఆ వీడియోలు సోషల్‌మీడియాలో పెడతానంటూ బెదిరించి లక్షల్లో […]
సారథి న్యూస్, ఖమ్మం: తెలంగాణలో ఇటీవల మావోయిస్టుల కదలికలు కనిపిస్తుండటంతో పోలీస్‌శాఖ ఇప్పటికే అప్రమత్తమైంది. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ముగ్గురు యువతులు ఓకే రోజు అదృశ్యమయ్యారు. అయితే వీరికి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయా? వీరు అడవి బాటపట్టారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. అశ్వారావుపేట మండలం చెన్నాపురం కాలనీకి(గొత్తికోయ కాలనీ) చెందిన ముగ్గురు యువతులు ఈ నెల 16వ నుంచి కనిపించకుండా పోయారు. అందులో ఓ యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుమేరకు పోలీసులు […]
సారథి న్యూస్, ఆసిఫాబాద్: తెలంగాణలోకి మావోయిస్టుల వచ్చారని, తమ కార్యకలాపాలు సాగించారని కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ అడవుల్లో డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే తాజాగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కదంబా అడవుల్లో కాల్పుల మోత మోగింది. పోలీసులు, మావోయిస్టులు నేరుగా తలపడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు పోలీసులు తెలిపారు. ఆసిఫాబాద్ సమీపంలోని చీలేటిగూడకు రెండు రోజుల క్రితం మంచిర్యాల , కుమ్రంభీం జిల్లాల డివిజన్ కమిటీ కార్యదర్శి మైలారపు […]