సారథి, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామ శివారులో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మియావాకి ప్లాంటేషన్ ను శుక్రవారం కలెక్టర్ ఎల్.శర్మన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తక్కువ స్థలంలోనే ఎక్కువ మొక్కలను పెంచేలా జపాన్ మియావాకీ పద్ధతిలో నాటడం ద్వారా పచ్చదనంతో వనం మాదిరిగా కనిపిస్తుందన్నారు. మున్సిపాలిటీల్లో తక్కువ స్థలంలోనే ఎక్కువ పచ్చదనానికి ఎంతో ఉపయుక్తమైన ఈ విధానంతో ప్రతి పట్టణ ప్రాంతంలో కనీసం ఒక ఎకరాలో నాటి చిట్టడవులను […]
సారథి, ములుగు: అడవులను కాపాడుకుందామని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణఆదిత్య పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రకృతి వనాల్లో మొక్కల సర్వేవాల్ రేటు పెంచేలా చూడాలని సూచించారు. హరితహారం మొక్కలను రెడీ చేయాలన్నారు. కోరిన విధంగా ఇంటింటికీ ఆరు మొక్కలు ఇవ్వాలన్నారు. నాటిన ప్రతిమొక్కకు జియో ట్యాగ్ తప్పనిసరి సూచించారు. రైతుల అభీష్టం మేరకు ఆయిల్ ఫామ్, మామిడి ఫామ్ మొక్కలను ఇచ్చేందుకు ప్లాన్ చేయాలని కోరారు. కంటైన్మెంట్ల జోన్లలో […]
సారథి న్యూస్, ములుగు: చెదిరిన గూడుకు ప్రాణంపోశారు ఓ ఆఫీసర్. ఓ వినూత్న ఆలోచనతో వాటికి నీడ కల్పించారు. ములుగు జిల్లా ప్రేమ్ నగర్ కు చెందిన అటవీశాఖ పీఆర్వో సాయికిరణ్ ఇంటి ఆవరణలో పిచ్చుకలు గూడు పెట్టుకున్నాయి. గూడు బోర్ మోటర్ బోర్డు నుంచి కింద పడిపోవడంతో సాయికిరణ్చలించిపోయారు. ఆ సమయంలో వినూత్నన ఆలోచన కలిగింది. వెంటనే పిచ్చుల కోసం ప్రత్యామ్నాయంగా ఏర్పాటుచేశారు. ఇంటి డాబా కింద అట్టలతో ఒక గూడును ఏర్పాటుచేశారు. ఆ గూడుకు […]
సారథి న్యూస్, ఆసిఫాబాద్: తెలంగాణలోకి మావోయిస్టుల వచ్చారని, తమ కార్యకలాపాలు సాగించారని కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ అడవుల్లో డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే తాజాగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కదంబా అడవుల్లో కాల్పుల మోత మోగింది. పోలీసులు, మావోయిస్టులు నేరుగా తలపడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు పోలీసులు తెలిపారు. ఆసిఫాబాద్ సమీపంలోని చీలేటిగూడకు రెండు రోజుల క్రితం మంచిర్యాల , కుమ్రంభీం జిల్లాల డివిజన్ కమిటీ కార్యదర్శి మైలారపు […]
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ఫ చిత్రం షూటింగ్ తెలంగాణ లోని పాలమూరు అడవుల్లో జరగనున్నట్టు సమాచారం. కరోనాతో ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. ప్రస్తుతం కేంద్రప్రభుత్వం కూడా షూటింగ్‌లకు అనుమతి ఇవ్వడంతో కొంతమంది సిబ్బందితో షూటింగ్‌ను ప్రారంభించనున్నారట. పుష్ప చిత్రం ‘ఎర్రచందనం స్మగ్లింగ్’ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టు టాక్. బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో నటించనున్నారట. అల్లు అర్జున్ గెటప్కూడా కొత్తగా ఉంది. ఈ సినిమా చాలా భాగం అడవుల్లో తెరకెక్కించాల్సి ఉంటుంది. ఇప్పటికే […]
రకుల్ ప్రీత్‌సింగ్ ఓ కొత్తతరహా పాత్రలో నటించనున్నట్టు సమాచారం. ఆమె ఇప్పటివరకు గ్లామరస్ పాత్రలనే చేశారు. ప్రస్తుతం ఓ చిత్రంలో పల్లెటూరు పడుచు పిల్లగా మెరిపించనున్నది. ఇప్పటికే ఈ తరహా పాత్రను రంగస్థలం చిత్రంలో సమంత పోషించిన విషయం తెలిసిందే. తాజాగా రకుల్ కూడా సమంతా బాటపట్టారు. సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా డైరెక్టర్ క్రిష్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో రకుల్ పేదంటి గ్రామీణ యువతిగా నటిస్తున్నది. పూర్తి ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా […]
సారథిన్యూస్, రామడుగు: రాష్ట్రంలో 24 శాతంగా ఉన్న అటవీ విస్తీరణాన్నీ 33 శాతానికి పెంచాలని కరీంనగర్ అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ పేర్కొన్నారు. ఆరో విడుత హరితహారంలో భాగంగా ఆయన కరీంనగర్ జిల్లా రామడుగు తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రకృతి వనాన్ని తలపించేలా కార్యాలయాన్ని తీర్చిదిద్దాలని కోరారు. కార్యక్రమంలో రామడుగు తహసీల్దార్ చింతల కోమల్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ కిరణ్ కుమార్ రెడ్డి, ఎంపీడీవో సతీశ్‌రావు, వివిధ […]
కోయంబత్తూరు: తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు సమీపంలోని ఓ గ్రామంలోకి 15 అడుగుల భారీ తాచుపాము వచ్చింది. దీంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గ్రామంలోని కొందరు యువకులు ఆ పామును చంపేందుకు యత్నించగా వారికి చిక్కలేదు. దీంతో అటవీఅధికారులను సమాచారమిచ్చారు. అధికారులు గ్రామానికి చేరుకొని ఆ పామును సజీవంగా బంధించారు. అనంతరం సమీపంలోని సిరువాని అటవీప్రాంతంలో వదిలిపెట్టారు. కాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.