Breaking News

ENCOUNTER

అడవుల్లో కాల్పుల మోత

సారథి న్యూస్​, ఆసిఫాబాద్​: తెలంగాణలోకి మావోయిస్టుల వచ్చారని, తమ కార్యకలాపాలు సాగించారని కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్​ అడవుల్లో డీజీపీ మహేందర్​రెడ్డి పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే తాజాగా కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా కదంబా అడవుల్లో కాల్పుల మోత మోగింది. పోలీసులు, మావోయిస్టులు నేరుగా తలపడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు పోలీసులు తెలిపారు. ఆసిఫాబాద్​ సమీపంలోని చీలేటిగూడకు రెండు రోజుల క్రితం మంచిర్యాల , కుమ్రంభీం జిల్లాల డివిజన్​ కమిటీ కార్యదర్శి మైలారపు […]

Read More

‘దిశ’ ఫస్ట్ లుక్ విడుదల

సారథిన్యూస్​, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ హత్యోదంతంపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందుకు సంబంధించి శనివారం ఆయన ట్విట్టర్ ద్వారా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. గతేడాది నవంబరు 26న శంషాబాద్ సమీపంలో ఒక వెటర్నరీ డాక్టర్ పై నలుగురు దుండగులు లైంగిక దాడికి పాల్పడడమే కాకుండా ఆమెపై పెట్రోల్ పోసి అతి కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనానంతరం దేశవ్యాప్తంగా […]

Read More

శ్రీనగర్​లో ఎన్​కౌంటర్​.. ముగ్గురు హతం

శ్రీనగర్​: జమ్ముకశ్మీర్​లో ఉగ్రమూకలు రెచ్చిపోతున్నాయి. స్థానికుల అండదండలతో చెలరేగిపోతున్నాయి. తాజాగా శ్రీనగర్​లోని పంతాచౌక్​ వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న సీఆర్​పీఎఫ్​ దళాలపై ఉగ్రమూక ఒక్కసారిగా దాడులకు తెగబడింది. వెంటనే అలర్టయిన జవాన్లు ఎదురుదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. మరోవైపు సీఆర్​పీఎఫ్​కు చెందిన ఓ అసిస్టెంట్​ సబ్​ఇన్​స్పెక్టర్​ కూడా ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈ ఘటనతో శ్రీనగర్​ అట్టుడుకింది. ఇరు వర్గాలు దాదాపు గంటపాటు ఫైరింగ్​ చేసుకున్నట్టు సమాచారం.

Read More

బుల్లెట్​ గాయాలతోనే దూబే మృతి

లక్నో: మోస్ట్​వాంటెడ్​ క్రిమినల్​, గ్యాంగ్​స్టర్​ వికాస్​దూబే ఇటీవల పోలీసులు ఎన్​కౌంటర్​లో మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే అతడి పోస్ట్​మార్టం అనంతరం పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వికాస్​దూబే బుల్లెట్ల గాయాలతో అయిన రక్తస్రావంతోతో చనిపోయాడాని పోస్ట్​మార్టం నివేదికలో తేలింది. కాన్పూర్​లో జూలై 10న జరిగిన ఎన్​కౌంటర్​లో దూబే మృతిచెందాడు. దూబేను కాన్పూర్​కు తీసుకెళ్తుండగా కారు బోల్తాపడిందని.. ఈక్రమంలో అతడు పారిపోయేందుకు యత్నిస్తుండగా ఎన్​కౌంటర్​ చేశామని పోలీసులు చెప్పారు. అంతకుముందు తనను అరెస్ట్​ చేయడానికి వెళ్లిన ఎనిమిది […]

Read More

ఆరుగురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్​: జమ్మూకశ్మీర్​లో 24 గంటల్లో వేర్వేరు ఎన్​కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులు భద్రతాదళాల చేతుల్లో హతమయ్యారు. షోషియాన్​ జిల్లాలో శనివారం ముగ్గురు ఉగ్రవాదులు ఎదురుకాల్పుల్లో మరణించారు. శుక్రవారం కుల్​గాం జిల్లాలో ముగ్గరు ఉగ్రవాదలు హతమైన సంగతి తెలిసిందే. వీరిలో జైషేమహ్మద్​ ఉగ్రవాద సంస్థకు చెందిన కమాండర్​ కూడా ఉన్నాడు.

Read More

ముగ్గురు టెర్రరిస్టులు హతం

శ్రీనగర్‌‌: జమ్మూకాశ్మీర్‌‌లోని కుల్గామ్‌ జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు మట్టుబెట్టారు. ఆ ముగ్గురు జైషే మహ్మద్‌ టెర్రర్‌‌ గ్రూప్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వారిలో ఒక వ్యక్తి ఐఈడీ ఎక్స్‌పర్ట్‌ అని పోలీసులు అన్నారు. కుల్గాం జిల్లాలో టెర్రరిస్టులు ఉన్నారనే పక్కాసమాచారంతో కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించిన సెక్యూరిటీ ముగ్గుర్ని మట్టుబెట్టారు. పాకిస్తాన్‌ నుంచి వస్తున్న ఇన్స్ట్రక్షన్స్‌తో చాలా ఎటాక్స్‌కు ప్లాన్‌ చేస్తున్నారని చెప్పారు. ఎన్‌కౌంటర్‌‌లో హతమైన వలీద్‌ అనే టెర్రరిస్టు […]

Read More

ఒక ఎన్​కౌంటర్​ ఎన్నోప్రశ్నలు

కాన్పూర్​: కరడుగట్టిన గ్యాంగ్​స్టర్​ వికాస్​ దూబే ఎన్​కౌంటర్​పై ప్రస్తుతం సోషల్​మీడియాలో ప్రశ్నల వర్షం మొదలైంది. శుక్రవారం ఉదయం కాన్పూర్​ సమీపంలో పోలీసుల ఎన్​కౌంటర్​లో వికాస్​దూబే మరణించిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం పలు నాటకీయపరిణామాల మధ్య ఉజ్జయినిలో వికాస్​దూబే అరెస్టయ్యారు. అరెస్ట్​కు కొద్దిగంటల ముందే వికాస్​దూబేకు సన్నిహితులైన ఇద్దరు అనుచరులను పోలీసులు ఎన్​కౌంటర్​లో కాల్చిచంపారు పోలీసులు. కాగా వికాస్​దూబే ఎన్​కౌంటర్​పై చాలా మంది ప్రశంసిస్తూ సోషల్​మీడియాలో పోస్టులు పెడుతుండగా.. మరికొందరు మాత్రం ఎన్​కౌంటర్​పై పోలీసులు చెబుతున్న వివరణ […]

Read More
గ్యాంగ్‌స్టర్ వికాస్‌దూబే ఎన్‌కౌంటర్

గ్యాంగ్‌స్టర్ వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్

కాన్పూర్ (ఉత్తరప్రదేశ్): కరడుకట్టిన కాన్పూర్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేను స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం ఉదయం కాల్చి చంపారు. దూబే పారిపోతుండగా పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించాడని సమాచారం. కరడుకట్టిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేను ఉజ్జయిని నుంచి కాన్పూర్ నగరానికి తీసుకువస్తున్న కారు శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తూ బోల్తాపడింది. భారీ వర్షం కురుస్తుండటంతోపాటు రోడ్డు సరిగా లేకపోవడం వల్ల కారు ప్రమాదానికి గురై బోల్తా పడిందని యూపీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెప్పారు. కారు […]

Read More