Breaking News

OFFICERS

రేషన్‌ అక్రమాలకు చెక్‌ !

రేషన్‌ అక్రమాలకు చెక్‌ !

వందశాతం ఆధార్‌తో అనుసంధానం సామాజిక సారథి, హైదరాబాద్‌: రేషన్‌ సరుకులు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లను రూపొందించింది. ఆధార్‌ అనుసంధానంతో పాటు సీసీ కెమెరాలను, బయోమెట్రిక్‌ విధానం అమలు చేస్తున్నారు. అయితే కొందరు అధికారులు, రేషన్‌ డీలర్లు పేదల బియ్యాన్ని బ్లాక్​మార్కెట్ కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ప్రభుత్వ సర్వేల్లో తేలింది. వాస్తవానికి ప్రతి రెవెన్యూ అధికారులు రేషన్‌ షాపులను తనిఖీ చేసి సరుకులను వచ్చే నెలకు కేటాయింపు చేయాల్సి ఉంటుంది. కానీ అధికారుల పర్యవేక్షణ […]

Read More
ఆపరేషన్ స్మైల్ విజయవంతం చేయాలి

ఆపరేషన్ స్మైల్ విజయవంతం చేయాలి

 నల్లగొండ అదనపు ఎస్పీ నర్మద సామాజిక సారథి, నల్లగొండ క్రైం: ఆపరేషన్ స్మైల్- 8ను విజయవంతం చేయడానికి, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని అదనపు ఎస్పీ నర్మద అన్నారు. నల్లగొండ జిల్లా పోలీసు కార్యాలయంలో కార్మికశాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, పోలీస్, బాలల సంక్షేమ సమితి, ఇతరశాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చేలా కృషి చేయాలని ఆదేశించారు. బాలలతో […]

Read More
ఎఫ్సీఐ తీరుతోనే ఇబ్బందులు

ఎఫ్​సీఐ తీరుతోనే ఇబ్బందులు

నిరంతరాయంగా ధాన్యం కొనుగోళ్లు కేంద్రం తీరుపై మంత్రి గంగుల మండిపాటు సామాజిక సారథి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఎఫ్‌సీఐ తీరుతోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. రైతుల పట్ల కేంద్రం, ఎఫ్‌సీఐ తీరు విచారకరమని వెల్లడించారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై సోమవారం మంత్రి సమిక్ష నిర్వహించారు.  ధాన్యం కొనుగోళ్లు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికారులతో చర్చించారు. కొనుగోలు కేంద్రాల్లో సదుపాయాలు, నగదు […]

Read More
ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్.!!!

ఫార్మసిస్టుల బతుకులను ఆగం చేయొద్దు

సామాజిక సారథి, మహబూబ్ నగర్: నిజాలను నిర్భయంగా రాసిన జర్నలిస్టులపై చిందులేసిన డ్రగ్స్ ఇన్​స్పెక్టర్​ను వెంటనే సస్పెండ్ చేయాలని ఫార్మసిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు వాకిట అశోక్ కుమార్ డిమాండ్. శుక్రవారం అసోసియేషన్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్లు దళారి పాత్ర వ్యవహరిస్తూ ఫార్మసిస్ట్ ల సర్టిఫికెట్లు అద్దెలకు తీసుకొని మందుల షాపు లైసెన్సులు ఇప్పిస్తున్నట్లు పత్రికల్లో వచ్చిన కథనాలు వాస్తవమన్నారు. మెడికల్ షాపుల లైసెన్సుల జారీలో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్​ పాత్ర ఏమిటో […]

Read More
వ్యాక్సిన్ తీసుకోవాలి

వ్యాక్సిన్ తీసుకోవాలి

సామాజిక సారథి, హన్మకొండ: ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సినేషన్ను తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజివ్గాంధీ హనుమంతు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ సమావేశంలో వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి, నగర కమిషనర్ ప్రావీణ్య లతో కలసి  మైనార్టీ లతో కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా  హనుమకొండ జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ కోవిడ్-19 వ్యాక్సినేషన్ సెకండ్ డోస్ తీసుకోకుండా మిగిలిన వారు గడువు పూర్తయిన ఆధారంగా తమంతట తాము ముందుకు వచ్చి […]

Read More
నాటుసారా స్థావరాలపై దాడులు

నాటుసారా స్థావరాలపై దాడులు

సామాజిక సారథి‌, ఏన్కూరు: మండలంలోని గార్లఒడ్డులో  గురువారం సాయంత్రం నాటుసారా స్థావరాలపై జిల్లా ఎక్సైజ్ ట్రాస్క్ ఫోర్స్ సీఐ పోశెట్టి ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సారా తయారీ కోసం నిల్వ ఉంచిన 600 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి ఇద్దరిపై కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో  సిబ్బంది రాజు, మధు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Read More
పగడ్బందీగా సాగు నమోదు

పగడ్బందీగా సాగు నమోదు

సామాజిక సారథి,  కౌడిపల్లి: యాసంగి లో పంటల సాగు పగడ్బందీగా సర్వే నంబరు ప్రకారం ప్రతి రైతు పంట సాగు వివరాలను నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి పరశురాం నాయక్ సూచించారు.  బుధవారం కౌడిపల్లి రైతు వేదికలో కౌడిపల్లి డివిజన్ లోని నాలుగు మండలాలకు సంబంధించిన వ్యవసాయ అధికారులు వ్యవసాయ విస్తీర్ణ అధికారులను సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ప్రస్తుతం వాన కాలంలో అధిక మొత్తంలో  వరి పండించడం […]

Read More

కలిసికట్టుగా పనిచేద్దాం

సారథి న్యూస్, రామగుండం: సింగరేణి ఉద్యోగులంతా కలిసి కట్టుగా పనిచేయాలని ఆ సంస్థ డైరెక్టర్​ (ఆపరేషన్స్​) ఎస్​ చంద్రశేఖర్​ సూచించారు. మంగళవారం ఆయన పెద్దపల్లి జిల్లా మేడిపల్లి ఓపెన్​కాస్ట్​ను సందర్శించి అక్కడ జరుగుతున్న ఓవర్​ బర్డెన్​ పనులను పరిశీలించారు. వానకాలంలో ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో అధికారులకు, కార్మికులకు పలు సూచనలు చేశారు. ఓవర్​ బర్డెన్​ తరలింపు పనులను వేగవంతంగా చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో అర్జీ-1 ఏరియా మేనేజర్ గోవిందారావు, సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి , […]

Read More