Breaking News

EXCISE

12లక్షల మద్యం పారబోసింన్రు

12లక్షల మద్యం పారబోసింన్రు

సామాజిక సారథి, తిమ్మాజీపేట: మండల కేంద్రంలో ఉన్న మద్యం గోదాంలో ఉన్న కాలం చెల్లిన మద్యాన్ని సోమవారం అధికారులు పార బోయించారు. దాదాపుగా 243లిక్కర్ కేసులు కాలం చెల్లింది. వీటిని మద్యం ప్రియులు సేవించకుండా పోయింది. దీనితో మద్యం డిపో మేనేజర్ లచ్చయ్య నాగర్ కర్నూల్ ఎక్సైజ్ సీఐ ఏడుకొండలు ఎస్ఐ అనుదీప్ సమక్షంలో కాలం చెల్లిన మధ్యాన్ని హమాలీలతో పరబోయించారు. వీటి విలువ దాదాపుగా రూ.12లక్షల దాకా ఉంటుందని డిపో అధికారులు తెలిపారు.

Read More
నాటుసారా స్థావరాలపై దాడులు

నాటుసారా స్థావరాలపై దాడులు

సామాజిక సారథి‌, ఏన్కూరు: మండలంలోని గార్లఒడ్డులో  గురువారం సాయంత్రం నాటుసారా స్థావరాలపై జిల్లా ఎక్సైజ్ ట్రాస్క్ ఫోర్స్ సీఐ పోశెట్టి ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సారా తయారీ కోసం నిల్వ ఉంచిన 600 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి ఇద్దరిపై కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో  సిబ్బంది రాజు, మధు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Read More
ఇదేం దందా సార్లూ..

ఇదేం దందా సార్లూ..

మద్యం రవాణా కేసులో కానిస్టేబుల్‌ అరెస్టు టొయోటా కారు సీజ్‌.. 72 బాటిళ్లు స్వాధీనం గతంలో హోంగార్డు దొరికిన వైనం సారథి న్యూస్, కర్నూలు: పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం సరఫరా చేసే జాబితాలో సివిల్‌ పోలీసులు, హోంగార్డులు కూడా చేరుతున్నారు. జీతంతో సరి పెట్టుకోక.. అత్యాశ.. నన్నేవరూ ఏం చేయలేరన్న అహంభావంతో కొందరు పోలీసులు పక్క రాష్ట్రానుంచి మద్యం సరఫరా చేసే స్థాయికి దిగజారారు. సమాజంలో అవినీతి అక్రమాలు చోటుచేసుకోకుండా ఉండేందుకు అహర్నిశలు కష్టపడుతూ.. ప్రజకు […]

Read More

నాటుసారా పట్టివేత

సారథి న్యూస్, నర్సాపూర్: అమాయకుల ప్రాణాలు బలిగొన్న నాటుసారాను ఎన్​ఫోర్స్ మెంట్ అధికారులు సోమవారం పట్టుకున్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం హరిచంద్ పంచాయతీకి చెందిన కొందరు గిరిజనులు విక్రయిస్తున్నారని సమాచారం తెలుసుకున్న అసిస్టెంట్ సూపర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గాయత్రి ఆదేశాల మేరకు ఎక్సైజ్ సీఐ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో 10లీటర్ల నాటుసారా, 100 కేజీల నానబెట్టిన బెల్లం, బెల్లం ఊటను పారబోశారు. నాటుసారాను అమ్మినట్లు తమ దృష్టికి తీసుకొస్తే కఠినచర్యలు తీసుకుంటామని మాట్లాడుతూ చెప్పారు. ఆయన […]

Read More
ఎక్సైజ్​ అధికారులకు విందు

ఎక్సైజ్​ అధికారులకు విందు

సారథి న్యూస్​, అచ్చంపేట: కరోనా వ్యాప్తి.. లాక్​ డౌన్​ నేపథ్యంలో మద్యం విక్రయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించిన విషయం తెలిసిందే. కానీ ఎక్సైజ్​ అధికారులను మచ్చిక చేసుకుని తమ చీకటిదందా కొనసాగించాలని భావించిన కొందరు మద్యం వ్యాపారులు వారికి విందు భోజనాలు ఏర్పాటుచేశారు. అధికారులు కూడా తనిఖీల పేరుతో తమ పని కానిచ్చేశారు. నాగర్​ కర్నూల్​ జిల్లా అచ్చంపేటలో శుక్రవారం వెలుగుచూసిన ఈ ఘటన.. ఎక్సైజ్​ అధికారుల పనితీరును ప్రశ్నిస్తోంది. అచ్చంపేటలో మద్యం వ్యాపారులంతా ఎక్సైజ్‌ […]

Read More