Breaking News

LABOUR

సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా

సారథి న్యూస్. రామగుండం: సింగరేణి వార్షిక లాభాల్లో కార్మికులకు వాటా ఇప్పించడానికి కృషి చేస్తున్నామని టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావు పేర్కొన్నారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్​, మంత్రి కొప్పుల ఈశ్వర్​తో మాట్లాడతామని చెప్పారు. మంగళవారం లాంగ్వాల్ ప్రాజెక్టులో నిర్వహించిన సమావేశంలో వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలువురు కార్మికులు టీబీజీకేఎస్​లో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2400 మంది బదిలీ వర్కర్ లను జనరల్ మజ్దూర్ గా ప్రమోషన్ సాధించి ఇప్పించిన ఘనత టీబీజీకేఎస్ దే […]

Read More

బొగ్గు ఉత్పత్తి పెంచండి

సారథి న్యూస్​, రామగుండం: అర్జీ 1 ఏరియాలో 100 శాతం బొగ్గు ఉత్పత్తికి కృషిచేయాలని, ప్రతి ఒక్కరూ లక్షణ సూత్రాలు పాటించాలని ఆర్ జీ వన్ జీఎం కే నారాయణ కోరారు. శనివారం సాయంత్రం ఆయన జీఎం కార్యాలయంలో గని అధికారులతో సమీక్షించారు. ఉత్పత్తి ఉత్పాదకత పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలను చర్చించారు. సమావేశంలో అధికారులు త్యాగరాజు, బెంజిమెన్, కేవీ రావు, సత్యనారాయణ, అప్పారావు, వెంకటేశ్వరరావు, నవీన్ కుమార్, ఆంజనేయులు, మురళీధర్, హరినాథ్, గని మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు.

Read More

చెత్తను డంపింగ్ ​యార్డుకు తీసుకెళ్లండి

సారథి న్యూస్, రామాయంపేట: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో కొందరు సిబ్బంది నీరుగారుస్తున్నారు. మెదక్​ జిల్లా నిజాంపేట మండలం నస్కల్​ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం డంపింగ్ యార్డును ఏర్పాటు చేసింది. అయితే పంచాయతీ సిబ్బంది మాత్రం చెత్తను డంపింగ్​యార్డుకు తరలించకుండా హైస్కూల్ పక్కన ఉన్న ఒక పాడుబడ్డ బావిలో పడేస్తున్నారు. ఈ చెత్తతో ప్రస్తుతం సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎన్నిసార్లు సర్పంచ్ కి మొరపెట్టుకున్నా ట్రాక్టర్ […]

Read More

కలిసికట్టుగా పనిచేద్దాం

సారథి న్యూస్, రామగుండం: సింగరేణి ఉద్యోగులంతా కలిసి కట్టుగా పనిచేయాలని ఆ సంస్థ డైరెక్టర్​ (ఆపరేషన్స్​) ఎస్​ చంద్రశేఖర్​ సూచించారు. మంగళవారం ఆయన పెద్దపల్లి జిల్లా మేడిపల్లి ఓపెన్​కాస్ట్​ను సందర్శించి అక్కడ జరుగుతున్న ఓవర్​ బర్డెన్​ పనులను పరిశీలించారు. వానకాలంలో ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో అధికారులకు, కార్మికులకు పలు సూచనలు చేశారు. ఓవర్​ బర్డెన్​ తరలింపు పనులను వేగవంతంగా చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో అర్జీ-1 ఏరియా మేనేజర్ గోవిందారావు, సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి , […]

Read More

కూలీలకు మస్తు డిమాండ్

సారథి న్యూస్, రామడుగు: కరోనా విపత్తు వేళ గ్రామాల్లో వ్యవసాయ కూలీలకు డిమాండ్​ ఏర్పడింది. కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రస్తుతం రైతులు వరినాట్లు వేస్తున్నారు. కరోనా భయంతో కూలీలెవరూ వ్యవసాయ పనులకు రావడం లేదు. రూ. 450 ఇస్తామన్నా కూలీలు దొరకడం లేదు. దీంతో రైతులు ఇతర గ్రామాల నుంచి కూలీలను ఆటోలు, ట్రాక్టర్లను ఎక్కువ కూలీ ఇచ్చి తీసుకొస్తున్నారు. వరినాట్లు వేసేందుకు ఎకరానికి రూ.4వేల నుంచి రూ.5వేల గుత్తకు […]

Read More
బావిలో పడి ఇద్దరు దుర్మరణం

బావిలోపడి ఇద్దరు దుర్మరణం

సారథి న్యూస్​, ఖమ్మం: బావిలో పడి ఇద్దరు మహిళలు మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో చోటుచేసుకుంది. ఆదివారం కొణిజర్లకు చెందిన ఐదుగురు వ్యవసాయ కూలీలు ఓ పొలంలో పనిచేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు వారు జారి బావిలో పడ్డారు. స్థానికులు గమనించి ముగ్గురిని కాపాడగా, మరో ఇద్దరు మహిళలు మృతిచెందారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More
సింగరేణి జీఎంపై చర్యలు

రామగుండం జీఎంపై చర్యలు తీసుకోవాలి

సారథి న్యూస్​, రామగుండం: ఏఐటీయూసీ నాయకుడు గట్టయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సింగరేణి రామగుండం జీఎంపై చర్యలు తీసుకోవాలని కార్మికసంఘాల నాయకులు మిట్టపల్లి వెంకటస్వామి తదితరులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు వారు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కొందరు అధికారుల తీరుతో కార్మికులతో యాజమాన్యానికి సత్సంబంధాలు లేకుండా పోతాయని.. అంతిమంగా సింగరేణి యాజమాన్యానికి ఎంతో నష్టం చేకూరుతుందని చెప్పారు. కార్మికులతో స్నేహపూర్వకమైన వాతావరణంలో చర్చలు జరపాలని వారు పేర్కొన్నారు.

Read More
సింగరేణిలో విధుల బహిష్కరణ

కరోనాతో సింగరేణి కార్మికుడి మృతి

సారథి న్యూస్​, గోదావరిఖని: సింగరేణిలో పనిచేస్తున్న ఓ కార్మికుడు కరోనా లక్షణాలతో మృతిచెందాడు. దీంతో గురువారం సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న కార్మికులు విధులను బహిష్కరించారు. సింగరేణిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యాజమాన్యం వెంటనే లాక్​డౌన్​ ప్రకటించాలని సింగరేణి ఎంప్లాయీస్​ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సారయ్య, గని కార్యదర్శి కే రంగారావు కోరారు. సింగరేణి ఆర్జీవన్​ డివిజన్​లోని జీడీకే రెండవ గనిలో పనిచేస్తున్న టామర్​ కార్మికుడు బుధవారం కరోనా లక్షణాలతో మృతిచెందాడు. దీంతో కార్మికవర్గం ఒక్కటైంది.

Read More