Breaking News

ఫార్మసిస్టుల బతుకులను ఆగం చేయొద్దు

ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్.!!!

సామాజిక సారథి, మహబూబ్ నగర్: నిజాలను నిర్భయంగా రాసిన జర్నలిస్టులపై చిందులేసిన డ్రగ్స్ ఇన్​స్పెక్టర్​ను వెంటనే సస్పెండ్ చేయాలని ఫార్మసిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు వాకిట అశోక్ కుమార్ డిమాండ్. శుక్రవారం అసోసియేషన్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్లు దళారి పాత్ర వ్యవహరిస్తూ ఫార్మసిస్ట్ ల సర్టిఫికెట్లు అద్దెలకు తీసుకొని మందుల షాపు లైసెన్సులు ఇప్పిస్తున్నట్లు పత్రికల్లో వచ్చిన కథనాలు వాస్తవమన్నారు. మెడికల్ షాపుల లైసెన్సుల జారీలో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్​ పాత్ర ఏమిటో డ్రగ్స్ ఇన్​స్పెక్టర్ చెప్పాలన్నారు. ఫార్మసిస్టులను బతుకులను నిర్వీర్యం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి కొందరు అధికారులు కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులు కలసి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఉన్నత ఫార్మసీ విద్య చదివి డ్రగ్స్ ఇన్​స్పెక్టర్​గా ఉద్యోగం రాగానే ఫార్మసిస్ట్ అనేదే మర్చిపోయి డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారని, ఫార్మసిస్టులను రోడ్డున పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.