Breaking News

అభివృద్ధికి పట్టం కట్టాలి: ఎమ్మెల్సీ

అభివృద్ధికి పట్టం కట్టాలి: ఎమ్మెల్సీ

సామాజిక సారథి, రంగారెడ్డి బ్యూరో: అభివృద్దికి పట్టం కట్టాలని ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలం రేవల్లి గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించి బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఆసరా పెన్షన్, ఉచిత కరెంట్, రైతుబంధు, ఇంటింటి నల్ల, రైతు భీమా, సీఎం రిలీఫ్ ఫండ్ వంటి పథకాలు ఇచ్చి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నది టీఆర్ఎస్ పార్టీ అన్నారు. ప్రతిపక్షాలు పెట్టే ప్రలోభాలకు లొంగకుండా అభివృద్ధికి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.