సారథి న్యూస్, సత్తుపల్లి : కరోనా విపత్తువేళ.. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గొప్పమనసు చాటుకున్నారు. తన నియోజకవర్గంలో కరోనాతో బాధపడుతున్న రోగులకు తనవంతుగా రూ.500 ఆర్థికసాయం, కూరగాయలు, నిత్యవసరాలు అందజేశారు. ( 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కేజీ మంచినూనె, ఉల్లిపాయలు, ఉప్మారవ్వ, కారం, పసుపు, ఉప్పు, పంచదార, సబ్బులు, కూరగాయలు, 30 కోడిగుడ్లు) కరోనా వ్యాధిసోకిన నిరుపేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే సాయం చేసినట్టు చెప్పారు. కరోనా పట్ల ఎవరూ ఆందోళన […]
సారథిన్యూస్, రామగుండం: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌భగీరథ పథకం.. ఆడబిడ్డలకు వరమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. మంగళవారం గోదావరిఖని పట్టణంలోని సీఎస్పీ కాలనీలో ఎమ్మెల్యే మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… మహిళల మంచి నీటికి కష్టాలు పడవద్దని ప్రతి ఇంటికి నల్లాద్వారా శుద్ధజలం అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, […]
సారథిన్యూస్, గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా రామేశ్వరమ్మ ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం రామేశ్వరమ్మకు రాష్ట్ర ప్రభుత్వం నియామక ఉత్తర్వులు అందజేసింది. ఈ సందర్భంగా ఆమెను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అభినందించారు. రామేశ్వరమ్మ నేతృత్వంలో మార్కెట్‌కమిటీ మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన ఆకాంక్షించారు. కాగా తనపై నమ్మకం ఉంచి పదవి కట్టబెట్టినందుకు రాష్ట్ర మంత్రులు కేటీఆర్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి రామేశ్వరమ్మ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సారథిన్యూస్, రామడుగు: మోతే రిజర్వాయర్ నిర్మాణంపై అవగాహన లేకే కాంగ్రెస్ నేతలు ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేస్తున్నారని సింగల్‌విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వర్రావు విమర్శించారు. సోమవారం ఆయన కరీంనగర్ జిల్లా రామడుగులో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ను విమర్శించే స్థాయి మేడిపల్లి సత్యానికి లేదని పేర్కొన్నారు. మోతే రిజర్వాయర్ తూముల గురించి సరైన అవగాహన లేకుండా సత్యం నోటికొచ్చిన ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడితే సహించేది లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో నాయకులు గంట్లా […]
సారథిన్యూస్, రామగుండం: సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన డబుల్‌బెడ్ రూం ఇండ్ల పథకం మహత్తరమైనదని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని మూడో డివిజన్లో నూతనంగా నిర్మిస్తున్న డబుల్బెడ్రూం ఇండ్లను పరిశీలించారు. రాష్ట్రంలోని పేదప్రజలు సొంతింట్లో ఉండాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారని చెప్పారు. కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, కార్పోరేటర్లు కుమ్మరి శ్రీనివాస్, కల్వచర్ల కృష్ణవేణి, భూమయ్య, నాయకులు పాతపెల్లి […]
సారథి న్యూస్, రామడుగు: కరోనా మహమ్మారి ఓ సర్పంచ్‌ను బలితీసుకుంది. తమతో కలిసి తిరిగిన వ్యక్తి.. తమ బాగోగులు పట్టించుకున్న నేత ఇక లేడన్న వార్త ఆ ఊర్లో విషాదం నింపింది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం పందికుంటపల్లి సర్పంచ్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కటకం రవీందర్ గురువారం కన్నుమూశారు. ఆయనకు ఇటీవల కరోనా సోకింది. దీంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయారు. రవీందర్ ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. గ్రామంలో ఎన్నో […]
సారథిన్యూస్, తిరుపతి: వెఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఇటీవల భూమన కరుణాకర్‌రెడ్డి కరోనాపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. కోవిడ్ సమన్వయ కమిటీ చైర్మన్‌గా ఉన్న భూమన.. కరోనా బారిన పడి మృతిచెందిన వారికి స్వయంగా అంత్యక్రియలు నిర్వహించారు. మరోవైపు భూమన త్వరగా కోలుకోవాలని వైసీపీ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.
సారథి న్యూస్, రామాయంపేట: తెలంగాణ రాష్ట్రంలో పేదల ప్రభుత్వం కొనసాగుతున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. మంగళవారం మెదక్ జిల్లా నిజాంపేట, రామాయంపేట మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే కల్యణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.