సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజల కలలను సీఎం కె.చంద్రశేఖర్‌రావు నెరవేర్చుతున్నారని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. బుధవారం ఆమె అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. పాలకుడి సంకల్పం గట్టిగా ఉంటే ఆ దేవుడు కూడా కరుణిస్తాడని, రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాలు నిరూపించాయని అన్నారు. ప్రాజెక్టులు, చెరువులు జలకళను సంతరించుకుని రైతుల కళ్లల్లో సంతోషం చిగురించేలా చేశాయన్నారు. నల్లగొండకు గోదావరి, కృష్ణాజలాలను తరలించి సీఎం కేసీఆర్ రైతుల పాలిట దేవుడయ్యారని కొనియాడారు. […]
కోల్‌కతా: బంగ్లాదేశ్‌కు అక్రమంగా తరలిస్తుండగా రూ.35.3 కోట్ల విలువైన 25 పురాతన విగ్రహాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేస్తున్నారు. 2020 ఆగస్టు 23 రాత్రి కస్టమ్స్ అధికారులు పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ దినజ్‌పూర్ జిల్లాలో 25 పురాతన విగ్రహాలు, వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కాళిగంజ్ సరిహద్దు ద్వారా బంగ్లాదేశ్‌కు అక్రమంగా తరలిస్తున్న వీటిని గుర్తించి అధికారులు పట్టుకున్నారు. భారతదేశ సంస్కృతి, వారసత్వం ప్రతిబింబించే 25 కళాఖండాలను స్వాధీనం చేసుకున్నారు. ఇవన్ని క్రీ.శ.9 నుంచి 16వ శతాబ్దం వరకు […]
సారథి న్యూస్, రామడుగు: వర్షంతో నష్టపోయిన రైతన్నలు వెంటనే ఆదుకోవాలని సీపీఐ జిల్లా సహాయకార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఆయన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం పర్యటించి పంటలను పరిశీలించారు. వర్షాలతో రైతులు ఎంతో నష్టపోయారని పేర్కొన్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ నేతలు గంటే రాజేశం, మచ్చ రమేశ్, బాల్ రెడ్డి, నాగి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
సారథిన్యూస్, రామడుగు: బీఎస్ఎం ఆర్ -736 రకం కంది సాగుచేసుకుంటే రైతులు అధిక దిగుబడి సాధించవచ్చని వ్యవసాయ సహాయక సంచాలకులు జే రామారావు పేర్కొన్నారు. బుధవారం మండలంలోని వెలిచాలలో గాదె నర్సయ్య కు చెందిన కంది పంటను పరిశీలించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి యాస్మిన్, విస్తరణ అధికారి గోవర్ధన్ రైతులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, హైదరాబాద్: ఈ ఏడాది డిసెంబర్ నాటికి హైదరాబాద్ మహానగరంలో సుమారు 85వేలకు పైగా డబుల్ బెడ్రూమ్ఇండ్లను పేదలకు అందించనున్నట్లు మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారకరామారావు వివరించారు. సుమారు రూ.9,700 కోట్ల వ్యయంతో దేశంలో ఏ మెట్రో నగరంలో లేనంత పెద్దఎత్తున జీహెచ్ఎంసీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని చేపడుతుందన్నారు. సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్లతో పాటు జీహెచ్ఎంసి హౌసింగ్ విభాగం అధికారులు, మున్సిపల్‌శాఖ ఉన్నతాధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా […]
సారథి న్యూస్, చొప్పదండి: మథర్ థెరిస్సా సేవలు మరువలేనివని ప్రముఖ సామాజిక వేత్త, కవి, రచయిత పసూల రవి కుమార్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం దేశాయిపేట్ గ్రామంలో బుధవారం మథర్ థెరిస్సా జయంతి పురస్కరించుకుని గ్రామ యువకులు ‘మీకోసం.. మేము’ అనే స్వచ్ఛంద సేవాసమితిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత ఈ ఫౌండేషన్ స్థాపించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గుంట రవి, ఉప సర్పంచ్ వెంకట్రామిరెడ్డి, వార్డుసభ్యులు మోర వెంకటరమణ, కొలిపాక […]
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కీసర తహసీల్దార్బాలరాజు నాగరాజు లంచం కేసు అవినీతిలో గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కేలా ఉంది. ఓ భూమికి పట్టా ఇచ్చే విషయంలో రూ.రెండు కోట్లకు డీల్ కుదుర్చుకుని, ఏకంగా రూ.1.1 కోట్లు లంచం తీసుకుని పట్టుబడిన విషయం తెలిసిందే. ఓ ప్రభుత్వ ఉద్యోగి, దాదాపు 20 మిలియన్ డాలర్ల లంచం స్వీకరిస్తూ పట్టుబడడం ఇదే తొలిసారి అని, ఆయన పేరును రికార్డుల్లోకి ఎక్కించాలని కోరుతూ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రెండు స్వచ్ఛంద […]
ఈ ఫొటోలు చూస్తుంటే.. ముత్యాల జల్లు కురిసే.. పాట గుర్తుకొస్తోంది కదూ.. అదే మరి వర్షం కురిసినప్పుడు చినుకులు అలాగే కొద్దిసేపు ఉండిపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. ఇలాంటి దృశ్యమే మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలో ప్రకృతి ప్రేమికులను అలరించింది. చినుకులు అచ్చం ముత్యల్లా మెరిసిపోతూ చూపరులను ఆకట్టుకున్నాయి. :: ఫొటోలుఎండీ మక్తధీర్, దేవరకద్ర