Breaking News

DEATH

కర్దనూర్ ఎంఎస్ఎన్ పరిశ్రమలో ఉద్యోగి మృతి

సామాజిక సారథి, పటాన్‌చెరు: పటాన్‌చెరు మండలం కర్దనూర్ ఎంఎస్ఎన్ పరిశ్రమలో ఉద్యోగి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం… సోమవారం రాత్రి విధినిర్వహణలో ఉన్న ప్రొడక్షన్ మేనేజర్ జగదీష్ (35) ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడన్నారు. వెంటనే పరిశ్రమ యజమాన్యం నగరంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. ఈ మేరకు స్థానిక కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రొడక్షన్ […]

Read More
రావత్‌ కుటుంబం అంతా ఆర్మీలోనే

రావత్‌ కుటుంబం అంతా ఆర్మీలోనే

తండ్రి కూడా లెఫ్టినెంట్‌గా పనిచేసిన అనుభవం త్రివిధ దళాల అధికారిగా భారత్‌ సైన్య ఆధునీకరణకు కృషి ఆధునిక యుద్ధ తంత్రాల్లో ఆరితేరిన దిట్ట న్యూఢిల్లీ: హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందిన సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ కుటుంబం అంతా దేశం కోసం ఆర్మీలో పనిచేశారు. ఉత్తరాఖండ్‌కు చెందిన రావత్‌ దేశం సైనికంగా బలపడేందుకు అహర్నిశలు పనిచేసేవారు. ఆధునిక యుద్ధవ్యూహాల్లో ఆయన దిట్ట. భారత ఆర్మీని అధునాతన యుద్ధరీతులకు తర్ఫీదు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో అత్యంత శక్తిమంతమైన సైనికాధికారి ఆయనే. […]

Read More

లారీ ఢీకొని యువకుడు మృతి

సారథి న్యూస్, హుస్నాబాద్: వేగంగా వస్తున్న లారీ ఢీకొని ఓ యువకుడు మృతిచెందిన ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో చోటుచేసుకున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కొండసముద్రంకు చెందిన తాటిపర్తి చంద్రమౌళి(37) శనివారం హస్నాబాద్​కు వచ్చాడు. కాగా పట్టణంలోని నాగారం వద్ద రోడ్డు దాటుతుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రమౌళి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు లారీ డ్రైవర్​ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

Read More

కోవిడ్‌తో కేంద్ర‌మంత్రి మృతి

న్యూఢిల్లీ : కేంద్ర రైల్వే శాఖ స‌హాయ మంత్రి సురేశ్ అంగ‌డి క‌రోనా సోకి మ‌ర‌ణించారు. ల‌క్ష‌ణాలేమీ లేకున్నా (అసింప్ట‌మేటిక్‌) క‌రోనాతో రెండువారాల క్రితం ఢిల్లీలోని ఏయిమ్స్‌లో చేరిన ఆయ‌న.. బుధ‌వారం తుదిశ్వాస విడిచారు. చికిత్స తీసుకుంటున్న స‌మ‌యంలోనే ఆయ‌నకు శ్వాస‌కోస ఇబ్బందులు త‌లెత్త‌డంతో ఆరోగ్యం క్షీణించింది. కోవిడ్ వ‌ల్ల మ‌ర‌ణించిన తొలి కేంద్ర మంత్రి ఆయ‌నే. క‌ర్నాట‌కకు చెందిన సురేశ్ అంగ‌డి.. బెల్గావి పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. 2004 నుంచి వ‌రుస‌గా నాలుగుసార్లు […]

Read More

అపార్ట్​మెంట్ కూలి​.. 8 మంది మృతి

మూడంతస్థుల ఆపార్ట్​మెంట్​ కుప్పకూలి అందులో ఉన్న 8 మంది మృతిచెందగా.. పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని భివాండిలో అదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భివాండిలో 1984లో ఓ భవనాన్ని నిర్మించారు. ఇక్కడ దాదాపు 21 కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే ఈ భవనం శిథిలావస్థకు చేరుకుందని, వెంటనే అక్కడ నివాసం ఉన్నవారంతా భవంతిని ఖాళీచేయాలని మున్సిపల్​ సిబ్బంది ఇప్పటికే నోటీసులు కూడా జారీచేశారు. అయినప్పటికే ఈ భవంతిని ఎవరూ ఖాళీ […]

Read More

రియా అరెస్ట్​​.. ఎన్​​సీబీకి కీలక ఆధారాలు

సుశాంత్​ సింగ్ రాజ్​పుత్ కేసు చివరికి రియా చక్రవర్తి మెడకు చుట్టుకుంటున్నది. ఈ కేసులో తాజాగా డ్రగ్స్​ కోణం వెలుగుచూసిన విషయం తెలిసిందే. రియా డ్రగ్స్​ కొనుగోలు చేసి.. సుశాంత్​కు అందించినట్టు సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. రియా డ్రగ్స్​ కొనుగోలు చేసినట్టు సీబీఐకి కీలక ఆధారాలు దొరికాయి. ప్రస్తుతం ఈ వ్యవహారంపై నార్కొటిక్స్​ కంట్రోల్​ బ్యూరో (ఎన్సీబీ) దర్యాప్తు చేస్తున్నది. ఇప్పటికే సుశాంత్​ మేనేజర్​ శామ్యూల్​, రియా సోదరుడు షోవిక్​ను ఎన్​సీబీ అరెస్ట్​ చేసింది. ఆదివారం రియాను […]

Read More

వాళ్ల మృతి బాధించింది

జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ పుట్టిన రోజు సందర్భంగా బ్యానర్​ కట్టబోయి ముగ్గురు చనిపోయిన విషయం తెలిసిందే. వారి మృతికి పవన్​కల్యాణ్​ సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా కుప్పం.. శాంతిపురం మండ‌లం ఏడ‌వ‌మైలు గ్రామంలో పవన్​కల్యాణ్​ భారీ కటౌట్​ కడుతుండగా సోమ‌శేఖ‌ర్‌, అరుణాచ‌ల‌నం, రాజేంద్ర అనే ముగ్గురు అభిమానులు విద్యుత్​షాక్​తో మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పవన్​కల్యాణ్​ తీవ్ర విచారం […]

Read More

కటుకం రవీందర్​కు నివాళి

సారథి న్యూస్, రామడుగు: ఇటీవల కరోనాతో మృతిచెందిన కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం పందికుంటపల్లి సర్పంచ్​ కటుకం రవీందర్​కు ఎంపీటీసీల ఫోరం ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. ఆయన చిత్రపటం వద్ద పూలమాలలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ఆయన మృతి టీఆర్​ఎస్​ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు నరేందర్​రెడ్డి, టీఆర్​ఎస్​ నాయకులు పూడూరి మల్లేశం, నేరెల్ల అంజయ్య, ఎడవెల్లి పాపిరెడ్డి, పైండ్ల శ్రీనివాస్, రజబ్ అలీ, […]

Read More