Breaking News

ఒళ్లు మ‌రిచి ఓటేస్తే.. ఇల్లు కాలిపోత‌ది : సీఎం కేసీఆర్

ఒళ్లు మ‌రిచి ఓటేస్తే.. ఇల్లు కాలిపోత‌ది : సీఎం కేసీఆర్

సామాజిక సారథి, మునుగోడు: ఓటు అనేది మ‌న త‌ల రాత రాసుకునే గొప్ప ఆయుధం. అది అల‌వోక‌గా వేస్తే, ఒళ్లు మ‌రిచి ఓటేస్తే.. ఇల్లు కాలిపోత‌ది. చాలా జాగ్రత్తగా ఆలోచించి.. మంచి, చెడు ఆలోచించి వేయాలి. బ‌తుకులు, మునుగోడు బాగుప‌డుతాయి. తెలంగాణ‌, భార‌త‌దేశం కూడా బాగుప‌డ్తది. ఎవ‌రో చెప్పార‌ని, మ‌ర్యాద చేశార‌ని, డ్యాన్స్ చేస్తే మంచిగ అనిపించింద‌ని ఓటేస్తే ప్రమాదం వ‌స్తది’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చండూరు మండ‌లం బంగారిగడ్డలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే..

‘ఈ మునుగోడు ఉప ఎన్నిక అవ‌స‌రం లేకుండానే వ‌చ్చింది. ఈ ఉప ఎన్నిక ఫ‌లితం ఎప్పుడో తేల్చేశారు అది కూడా తెలుసు. నేను కొత్తగా చెప్ప‌డానికి ఏం లేదు. మీకు అన్ని విష‌యాలు తెలుసు. ఒక నాలుగు విష‌యాలు చెప్పాల‌ని చెప్పి ఇక్కడికి వ‌చ్చాను. ఎల‌క్షన్లు వ‌స్తాయి. ఎన్నిక‌లు రాగానే ఏందో ఏమో మాయ‌రోగం ప‌ట్టుకుంటుంది. గ‌త్తర గ‌త్తర లొల్లి లొల్లి ఉంట‌ది. కొంద‌రైతే గ‌జం ఎత్తున గాల్లోనే న‌డుస్తున్నారు. విచిత్ర వేషాధారులు, అనేక పార్టీలు వ‌స్తాయి. ప్ర‌జ‌ల‌కు మ‌న‌కెందుకు ఉండాలి.’ అని అన్నారు.

నేను చెప్పిన మాట‌లు జాగ్ర‌త్త‌గా వినండి. చేతులెత్తి దండం పెట్టి చెబుతున్నాను. ఈ మాట‌ల‌ను ఇక్క‌డ‌నే వ‌దిలేసి వెళ్లిపోవ‌ద్దు. మీ ఊరెళ్లిన త‌ర్వాత చ‌ర్చ చేసి నిజ‌నిజాలు తేల్చాలి. ఓటు అనేది మ‌న త‌ల రాత రాసుకునే గొప్ప ఆయుధం. అది అల‌వోక‌గా వేస్తే.. ఒళ్లు మ‌రిచి ఓటేస్తే.. ఇల్లు కాలిపోత‌ది. చాలా జాగ్ర‌త్త‌గా ఆలోచించి.. మంచి, చెడు ఆలోచించి వేయాలి. బ‌తుకులు, మునుగోడు బాగుప‌డుతాయి. తెలంగాణ‌, భార‌త‌దేశం కూడా బాగుప‌డ్త‌ది. ఎవ‌రో చెప్పార‌ని, మ‌ర్యాద చేశార‌ని, డ్యాన్స్ చేస్తే మంచిగ అనిపించింద‌ని ఓటేస్తే ప్ర‌మాదం వ‌స్త‌ది.

‘దేశంలో ఉన్న‌ది ప్ర‌జాస్వామ్యం. ఈ దేశంలో ఏం జ‌రుగుతుందో మ‌న‌సు విప్పి ఆలోచించాలి. ఓటు వేసేట‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌గా ఆలోచించాలి. క‌రిచే పాము అని చెప్పి మెడ‌లో వేసుకుంటామా? ఆలోచించాలి. దేశంలో చైత‌న్యం రానంత వ‌ర‌కు దుర్మార్గ రాజ‌కీయాలు కొన‌సాగుతాయి. దోపిడీదారులు మాయ‌మాట‌లు చెప్పి మోసం చేస్తారని’ కేసీఆర్ సూచించారు.