సారథిన్యూస్, సత్తుపల్లి: ప్రజలంతా మట్టిగణపతినే పూజించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. శుక్రవారం ఆయన మాధురి మెడికల్స్ ఆధ్వర్యంలో ప్రజలకు మట్టిగణపతి ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రకృతిని కాపాడుకోవడం మానవ ధర్మం, పర్యావరణ పరిరక్షణకు గాను ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలను పూజించాలన్నారు.
సారథిన్యూస్, ఖమ్మం/ఏన్కూర్: వర్షాలతో సర్వస్వం కోల్పోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం భగవాన్ నాయక్ తండాలో పర్యటించారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు, కార్యదర్శివర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు, ఎస్ఎఫ్ఐ […]
సారథిన్యూస్, తల్లాడ: భిక్షాటన చేసైనా రైతులను ఆదుకుంటానని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, సత్తుపల్లి టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి పిడమర్తి రవి భరోసా వాఖ్యానించారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం లోని మిట్టపల్లి గ్రామంలో మంగళవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా వరదలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను పరామర్శించారు. అనంతరం రైతులకు వ్యక్తిగతంగా రూ. 20 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆయన వెంట టీఆర్ఎస్ జిల్లా నాయకులు జక్కంపూడి కృష్ణమూర్తి, దుడేటి వీరారెడ్డి, అనుమోలు బుద్ధి […]
సారథిన్యూస్, ఖమ్మం: ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేశ్ మండపాల ఏర్పాటుకు అనుమతి లేదని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ పేర్కొన్నారు. కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత సమయంలో ప్రజలంతా ఇంట్లోనే ఉండి గణేశ్ పండుగను జరుపుకోవాలని సూచించారు. మొహర్రం పండుగను సైతం ముస్లిం సోదరులు ఇండ్లల్లోనే నిర్వహించుకోవాలని కోరారు. ఎవరైనా పోలీసుల నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
సారథి న్యూస్, ఖమ్మం: నిర్వాసితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ హామీ ఇచ్చారు. మున్నేరు కాల్వ ఉధృతంగా ప్రవహించడంతో నిర్వాసితులైన ప్రజలకు ఖమ్మం నయాబజార్ పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో క్యాంపు ఏర్పాటుచేశారు. ఆదివారం మంత్రి పువ్వాడ అజయ్ నిర్వాసితులను కలిసుకొని వారితో మాట్లాడారు. నిర్వాసితులతో ధైర్యం చెప్పారు. అనంతరం మంత్రి మున్నేరు ఉధృతిని పరిశీలించారు. మున్నేరు ప్రవహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసేలా నోట్ తయారు చేయాలని మున్సిపల్ కమిషన్ అనురాగ్ […]
సారథి న్యూస్, ఖమ్మం: కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునేవారికి సిమ్యులేటర్ ఎంతో ఉపయోగకరమని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని రవాణాశాఖ కార్యాలయంలో సోమవారం ఆయన డ్రైవింగ్ సిమ్యులేటర్‌ను ప్రారంభించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కరోనా విపత్తువేళ రవాణాశాఖలో విప్లవాత్మక మార్పులు చేశామని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నామని అన్నారు. కార్యక్రమంలో రవాణాశాఖ అధికారులు, టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
సారథిన్యూస్, హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ యువజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఖమ్మం జిల్లా.. ఖమ్మం రూరల్ మండలం… మంగళగూడెం గ్రామానికి చెందిన గోపీకృష్ణ (26)కు 2018లో భద్రాచలం సమీపంలోని చోడవరం గ్రామానికి చెందిన నందిని(26)తో వివాహమైంది. వీరిద్దరూ కొడైకెనాల్లోని ఓ ఐటీకంపెనీలో పనిచేస్తున్నారు. సంవత్సరం నుంచి అన్నయ్ థెరిస్సా యూనివర్సిటీ దగ్గర్లోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి దంపతులు తమ ఇంట్లో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీళ్లకు కిరాణా సరుకులు తెచ్చిచ్చే […]
సారథి న్యూస్, ఖమ్మం: బావిలో పడి ఇద్దరు మహిళలు మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో చోటుచేసుకుంది. ఆదివారం కొణిజర్లకు చెందిన ఐదుగురు వ్యవసాయ కూలీలు ఓ పొలంలో పనిచేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు వారు జారి బావిలో పడ్డారు. స్థానికులు గమనించి ముగ్గురిని కాపాడగా, మరో ఇద్దరు మహిళలు మృతిచెందారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.