సారథి న్యూస్, కర్నూలు: గతంలో ఎక్కడా కనిపించని బ్రాండ్లను తీసుకొచ్చి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని, దీనివల్ల తాగుడుకు అలవాటుపడిన పేదలు గంజాయి, నాటుసారా తాగుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పార్థసారధి ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విడత వారీగా మద్య నిషేధానికి తాము మద్దతిస్తామని, కానీ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సరైన, నాణ్యమైన మద్యం విక్రయించకపోతే ఎలా? అని ప్రశ్నించారు. ఇప్పుడు శానిటైజర్లు […]
సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్ సమీపంలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద కర్నూలు ఎమ్మెల్యే హఫిజ్ ఖాన్ ఆధ్వర్యంలో ఆదివారం వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు సంబరాలు జరుపుకున్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. న్యాయ రాజధాని ద్వారా విద్యాసంస్థలు, యూనివర్సిటీలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా కార్యదర్శి కటిక గౌతమ్, భాను ప్రకాశ్, ఖయూమ్, సాయికృష్ణారెడ్డి, కృష్ణకాంత్ రెడ్డి, అసిఫ్ […]
1,58,764కు చేరిన కేసుల సంఖ్య ఒకరోజులో 63 మంది మృతి అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల్లో 8,555 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు 52,834 శ్యాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 1,58,764 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. వారిలో ఇప్పటి వరకు 82,886 మంది డిశ్చార్జ్ కాగా, తాజాగా 63 మంది చనిపోయారు. దీంతో చనిపోయిన వారి సంఖ్య 1474కి చేరింది. […]
ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో బీహార్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి సుశాంత్ సోదరి, అతని మాజీ ప్రేయసి, వంటమనిషి తదితరులను విచారించిన పోలీసులు రియా చక్రవర్తి కోసం వెతుకుతున్నారు. ఆమె జాడ తెలియడం లేదన్నారు. ‘విచారణ మొదటి దశలో ఉంది. కోర్టు పరిధిలో ఉంది. రియా చక్రవర్తి ఎక్కడ ఉందో తెలియడం లేదు. ఆమె కోసం వెతుకుతున్నాం’ అని బీహార్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ […]
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. కాశ్మీర్‌లోని నేతలను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. పీడీపీ చీఫ్ మహబూబా ముఫ్తీని రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ‘గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాజకీయ నాయకులను చట్టవిరుద్ధంగా అదుపులోకి తీసుకున్నప్పుడు ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది. డిటెన్షన్‌లో ఉన్న మెహబూబా ముఫ్తీని వెంటనే రిలీజ్ చేయాలి’ అని రాహుల్ డిమాండ్ చేశారు. గతేడాది ఆగస్టు 5న కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు సందర్భంగా పలువురు రాజకీయ […]
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తిరిగి పార్టీ పగ్గాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంత మంది కార్యకర్తలు సోషల్ మీడియాలో డిమాండ్ లేవనెత్తారు. కాంగ్రెస్ లీడర్లతో ఫ్యామిలీకి సంబంధించి వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. కాగా, చాలామంది సీనియర్ లీడర్లు ఆ డిమాండ్‌కు మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ కూడా దీనిపై స్పందించారు. రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఇంకా యాక్టివ్‌గా ఉండాలని, ఆయన ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలని కోరారు. […]
సారథి న్యూస్, ఖమ్మం: బావిలో పడి ఇద్దరు మహిళలు మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో చోటుచేసుకుంది. ఆదివారం కొణిజర్లకు చెందిన ఐదుగురు వ్యవసాయ కూలీలు ఓ పొలంలో పనిచేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు వారు జారి బావిలో పడ్డారు. స్థానికులు గమనించి ముగ్గురిని కాపాడగా, మరో ఇద్దరు మహిళలు మృతిచెందారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రాఖీ పౌర్ణమిపై కరోనా ప్రభావం వ్యాపారులకు ఈ ఏడాది తీవ్రనష్టం సారథి న్యూస్, రామగుండం: కరోనా మహమ్మారి రాఖీల దందాపై కూడా తీవ్రప్రభావం చూపుతోంది. రాఖీ పర్వదినానికి వారం రోజుల ముందు నుంచే ఉమ్మడి కరీంనగర్ జిల్లా గోదావరిఖని మార్కెట్ లో సందడి ఉండేది. గతేడాది వరకు జోరుగా రాఖీల విక్రయాలు జరిగేవి. కానీ ఈసారి దుకాణాలన్నీ కళతప్పి వెలవెలబోతున్నాయి. కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో మార్కెట్లకు ఎవరూ రావడం లేదు. ఒకవేళ వచ్చినా రాఖీలను కొనేందుకు ధైర్యం […]