సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలో సోమవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి దబ్బకట్ల లక్ష్మయ్య తెలిపారు. కరోనా సమయంలో కూడా పండుగను ఐక్యంగా జరుపుకోవడం శుభపరిణామమని అన్నారు. మండలంలో వాజేడు, పేనుగోల్ కాలనీ, మండపాక, గణపురం, గుమ్మడిదొడ్డి, చీపురుపల్లి, చెరుకూరు, పేరూరు, కృష్ణాపురం, కొంగాల, ముత్తారం, శ్రీరామ్ నగర్ గ్రామాల్లో జెండాలు ఎగరవేశామని తెలిపారు. ఆదివాసి అమరవీరుల త్యాగాలు, పోరాట ఫలితంగా ప్రపంచంలోని […]
న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం సుఖాంతం అయ్యింది. సోమవారం మధ్యాహ్నం కాంగ్రెస్ కీలక నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీని సచిన్ పైలట్, ఆయన వర్గం ఎమ్మెల్యేలు కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిమధ్య సానుకూల చర్చలు జరిగాయని.. తిరిగి కాంగ్రెస్ గూటికి రావడానికి సచిన్, ఆయనవర్గ ఎమ్మెల్యేలు ఒప్పుకున్నారని కాంగ్రెస్‌పార్టీ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. రాజస్థాన్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ఓ కమిటీని వేయనున్నట్టు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. రెబల్ ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు […]
సారథి న్యూస్, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ కు చెందిన చెరుకుపల్లి రామలింగయ్య కరోనాతో మృతిచెందారు. దహన నమస్కారాలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులు ఎవరూ ముందుకురాలేదు. నేనున్నానని.. మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ పీపీఈ కిట్ ధరించి సోమవారం అతని అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా వైరస్ తో మరణిస్తే అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం హేయమైనా చర్యగా అభివర్ణించారు. కరోనా ప్రబలిన నాటి నుంచి మృతుల అంత్యక్రియలు నిర్వహిస్తున్న తీరు మానవీయ విలువలను మంటగలిపేలా ఉందని ఆందోళన […]
సారథి న్యూస్, చిన్నశంకరంపేట: వరంగల్ లో జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు మురళి మాదిగ డిమాండ్ చేశారు. మురికివాడల్లో నివసించే పేద వారి కోసం పాఠశాలలు ఏర్పాటు చేసి, ఉచితంగా విద్యను అందించిన ఆదర్శప్రాయుడు జ్యోతిరావు పూలే అన్నారు. అటువంటి మహనీయుడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు.
తూర్పుగోదావరి: ఎన్ని కఠినచట్టాలు వచ్చినా మృగాళ్ల ఆలోచనలో ఏ మార్పు రావడం లేదు. తాజాగా ఓ దుర్మార్గుడు ఓ బాలికకు టీలో మత్తుమందు ఇచ్చి ఆమెపై లైంగికదాడికి ఒడిగట్టాడు. ఈ దారుణఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా మామాడికుదురు మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. ఓ గ్రామానికి చెందిన బాలిక కుటుంబంతో అదే గ్రామానికి చెందిన గుబ్బల రాజేంద్ర కుమార్ (21) సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం రాజేంద్ర బాలిక ఇంటికి వెళ్లాడు. అనంతరం బాలికకు, […]
సారథి న్యూస్, రామాయంపేట: తెలంగాణ రాష్ట్రంలో సీఎం రిలీఫ్‌ఫండ్ పేదలపాలిట వరంలా మారిందని నిజాంపేట ఎంపీపీ సిద్ధరాములు పేర్కొన్నారు. సోమవారం నిజాంపేట మండలం నార్లాపూర్‌కు చెందిన రాజశేఖర్‌కు ఆయన రూ.14 వేల సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కును అందజేశారు. ఆయన వెంట నార్లాపూర్ సర్పంచ్ అమర్సేన్రెడ్డి, తిరుపతి తదితరులు ఉన్నారు.
సారథి న్యూస్, ఖమ్మం: కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునేవారికి సిమ్యులేటర్ ఎంతో ఉపయోగకరమని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని రవాణాశాఖ కార్యాలయంలో సోమవారం ఆయన డ్రైవింగ్ సిమ్యులేటర్‌ను ప్రారంభించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కరోనా విపత్తువేళ రవాణాశాఖలో విప్లవాత్మక మార్పులు చేశామని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నామని అన్నారు. కార్యక్రమంలో రవాణాశాఖ అధికారులు, టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, రామగుండం: కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో శానిటైజేషన్ విధిగా చేయాలని.. కరోనా పేషెంట్లు క్వారంటైన్లో ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో ఆయన కలెక్టర్, అధికారులతో సమావేశమయ్యారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, జడ్పీచైర్మన్ పుట్ట మధుకర్, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు, ఇంచార్జి కలెక్టర్ భారతి […]