Breaking News

CPM

నింగికేగిన పోరుకెరటం

నింగికేగిన పోరుకెరటం

తెలంగాణ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత నిజాంసర్కారును వణికించిన ధీరవనిత బతుకమ్మ పాటలతో ప్రజల్లో చైతన్యం కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం రేపు నల్లగొండలో అంత్యక్రియలు సామాజికసారథి, హైదరాబాద్‌: సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం(91) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి 7.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుత సూర్యాపేట […]

Read More
సీపీఎం కొత్త కార్యదర్శిగా వి.శ్రీనివాసరావు

సీపీఎం కొత్త కార్యదర్శిగా వి.శ్రీనివాసరావు

మధు స్థానంలో కొత్త నేత ఎన్నిక విజయవాడ: ఆంధప్రదేశ్‌లో నిర్వహించిన సీపీఎం మహాసభల్లో ఏపీకి కొత్త కార్యదర్శిని ఎన్నుకున్నారు.. కొత్త కార్యదర్శిగా వి.శ్రీనివాసరావును ఎన్నుకున్నారు. సీపీఎం ఏపీ రాష్ట్ర మహాసభలు ముగిశాయి. కార్యదర్శి పదవి కోసం శ్రీనివాసరావు, ఎంఏ గఫూర్‌ పేర్లను పరిశీలించిన కార్యదర్శివర్గం.. చివరకు శ్రీనివాసరావుకు పగ్గాలు అప్పజెప్పింది. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా 13 మందిని ఎంపికచేశారు. రాష్ట్ర కార్యదర్శివర్గంలో ఇద్దరికి ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం కల్పించారు. 35 మందితో రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. ఇప్పటివరకు […]

Read More
మరో విద్యుత్ పోరాటానికి సిద్ధం

మరో విద్యుత్ పోరాటానికి సిద్ధం

సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు సామాజిక సారథి, నాగర్ కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను ఉపసంహరించుకోకపోతే మరో విద్యుత్ పోరాటానికి సిద్ధమవుతామని సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు హెచ్చరించారు. సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జరిగిన విద్యుత్ పోరాట ప్రభావంతో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపు సాహసించలేదని, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపు […]

Read More
ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వినతి

ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వినతి

సామాజిక సారథి‌, వైరా: ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ మంగళవారం తహసీల్దార్ నారపోగు అరుణకు మండలంలోని వల్లాపురం గ్రామానికి చెందిన పలువురు వినతిపత్రాన్ని అందజేశారు. గ్రామంలోని స్థలాలను తమకు స్వాధీనం చేసి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు, నాయకులు బాజోజు రమణ, వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు,  జి. దేవానందం, జి.కృష్ణారావు జి.కిషోర్ జి.రామారావు, జి.భాస్కర్ పాల్గొన్నారు.

Read More
సున్నం రాజయ్యతో విడదీయలేని అనుబంధం

సున్నం రాజయ్యతో విడదీయలేని అనుబంధం

సారథి, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో మంగళవారం సీపీఎం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మొదటి వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు దబ్బకట్ల లక్ష్మయ్య, రాజయ్య మాట్లాడుతూ.. రాజయ్యకు వాజేడు మండల ప్రజలతో విడదీయలేని అనుబంధం ఉందని గుర్తుచేశారు. మండల ప్రజలను రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరించే వారని అన్నారు. మండలంలోని గ్రామాల అభివృద్ధికి తను శాసనసభ నిధులను వెచ్చించి పనిచేసేవారని అన్నారు, వ్యవసాయ కార్మిక, రైతాంగ, పోరాటాల్లో […]

Read More
రాష్ట్రమంతటా దళితబంధు అమలుచేయాలి

రాష్ట్రమంతటా దళితబంధు

సారథి, బిజినేపల్లి: నిరంతరం పేదవర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్.శ్రీనివాస్ అన్నారు. సీఎం కేసీఆర్​ప్రకటించిన దళితబంధును రాష్ట్రమంతా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం బిజినేపల్లి మండల కేంద్రంలో గ్రామశాఖ మహాసభ జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. పాలకవర్గాలు ప్రజాసంక్షేమాన్ని మర్చిపోయి, పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కాలంలో సామాన్యుల జీవన ప్రమాణాలు తగ్గితే పెట్టుబడిదారుల ఆస్తులు పెరిగాయని అన్నారు. పాలకవర్గాలకు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే […]

Read More
సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం

సీపీఎం నేత సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం

న్యూఢిల్లీ : సీపీఎం జనరల్ సెక్రటరీ, సీనియర్​ నేత సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి (35) కరోనాతో కన్నుమూశాడు. గురువారం ఉదయం 5.30 గంటలకు ఆయన గురుగ్రావ్ లోని మేదాంత ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. రెండు వారాలుగా ఆశిష్ అక్కడే చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని సీతారాం ఏచూరి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘ఈరోజు ఉదయం నా పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరిని కోల్పోయానని తెలియజేయడం నాకు చాలా […]

Read More
హక్కుల కోసం కలిసిరావాలి

హక్కుల కోసం కలిసిరావాలి

పాలకొండ: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ద్రోహాన్ని వైఎస్సార్​సీపీ, టీడీపీ ప్రశ్నించాలని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కుల కోసం కలిసి పోరాటానికి సిద్ధంకావాలని సీపీఎం శ్రీకాకుళం జిల్లా పాలకొండ కమిటీ కార్యదర్శి దావాల రమణారావు పిలుపునిచ్చారు. రాజకీయ ప్రచార యాత్ర సందర్భంగా పాలకొండలో ఇంటింటా కరపత్రాల పంపిణీ చేశారు. కార్యక్రమంలో దూసి దుర్గారావు, రాము, పి.బాలు, గిరి, సీహెచ్ ఈశ్వరరావు, రాజా, ఏడుకొండలు పాల్గొన్నారు.

Read More