సామాజిక సారథి, నడికూడ : రాష్ర్ట ప్రభుత్వం పంట నష్టం జరిగితే రైతులను ఆదుకోవాలని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. శుక్రవారం హన్మకొండ జిల్లా నడికూడలో వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను పరకాల మండలాల్లోని పలు గ్రామాలలో రైతులతో కలిసి దెబ్బతిన్న మిర్చి పంటలు మొక్కజొన్న పంటలను పరిశీలించారు. అనంతరం పరకాల మండలం మలక్కపేటలో రైతులను పరామర్శించి మాట్లాడారు. ప్రకృతి సృష్టించిన ఈ బీభత్సానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి రైతులను ఆదుకోవాలని, వెంటనే పంట […]
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు సామాజిక సారథి, హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పాల్వంచలో జరిగిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటన నిర్భయ కేసు కన్నా దారుణమని మాజీ ఎంపీ వీ హనుమంతరావు అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ మీ చుట్టాల్లో ఎవరైనా చనిపోతే పోతావు.. ఎంతోమంది రైతులు చనిపోతున్నారు.. కనీసం పాల్వంచ కైనా పోవాలి కదా అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యపై ఇంత వరకూ మాట్లాడక పోవడం విచారకరం […]
మండిపడ్డ బీజేపీ నేత విజయశాంతి సామాజికసారథి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగులు, నిరుద్యోగులు, యువతరం సహా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన సీఎం కేసీఆర్ నేడు రైతులను మోసగించాలని చూస్తున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. అయితే రైతన్నలు మోసపోయే స్థితిలో లేరని గ్రహించాలన్నారు. ఎన్ని ఎత్తులు, జిత్తులు చేసినా రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ను ప్రజలు గద్దె దించుతారని ఆమె జోస్యం చెప్పారు. రైతులు యాసంగి వరి సాగు చేయొద్దని చెప్పి, కాదని వేస్తే కొనుగోలు […]
బీజేపీ మేం పోటీపడలేమన్న అఖిలేష్ లక్నో: రాజకీయ పార్టీలకు వర్చువల్ ప్రచారానికి అనుతినిచ్చినట్లయితే.. అన్ని రాజకీయ పార్టీల పట్ల ఈసీ ఒకేలా అవకాశాలు కల్పించాలని సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ అన్నారు. ఒక వేళ డిజిటల్ ప్రచారానికి అవకాశం కల్పిస్తే బీజేపీ వద్ద ఉన్న మౌలిక సదుపాయాలు ఇతర పార్టీల వద్ద లేవన్నారు. రానున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్‌కు సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఓ విజ్ఞప్తి చేశారు. ‘రాజకీయ పార్టీలకు […]
టీఆర్ఎస్, బీజేపీలకు నిబంధనలు వర్తించవా కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాగూర్ ఫైర్ సామాజికసారథి, హైదరాబాద్: టీఆర్ఎస్, బీజేపీ నేతల దోస్తానం ఢిల్లీలోనే కాదు, గల్ళీలో కూడా నడుస్తోందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్కం ఠాగూర్ సీరియస్ అయ్యారు. ఆర్‌ఎస్‌ఎస్ శిక్షణ శిబిరాలకు పర్మిషన్ ఇచ్చిన కేసీఆర్ సర్కారు.. తమ పార్టీకి మాత్రం అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు. ‘ఈ నెల 9 నుంచి 11 వరకు హైదరాబాద్ లో 120 మందితో కాంగ్రెస్ పార్టీ ట్రైనింగ్ […]
సారథిన్యూస్, రామడుగు: పార్టీ కార్యక్రమాలకు నష్టం కలిగిస్తూ, నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ఓ టీఆర్ఎస్నేతపై వేటు పడింది. అతడిని పార్టీని నుంచి సస్పెండ్ చేయడంతోపాటు ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్ రావుపేటకు చెందిన టీఆర్ఎస్ నేత ఎడవెళ్లి మధుసూదన్‌రెడ్డి కొంత కాలంగా పార్టీకి ఇబ్బందులు తీసుకొస్తున్నారు. దీంతో అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతోపాటు గుర్తింపు రద్దు చేస్తున్నట్టు రామడుగు మండల అధ్యక్షుడు గంట్లా జితేందర్ రెడ్డి […]
సారథిన్యూస్, తల్లాడ: భిక్షాటన చేసైనా రైతులను ఆదుకుంటానని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, సత్తుపల్లి టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి పిడమర్తి రవి భరోసా వాఖ్యానించారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం లోని మిట్టపల్లి గ్రామంలో మంగళవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా వరదలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను పరామర్శించారు. అనంతరం రైతులకు వ్యక్తిగతంగా రూ. 20 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆయన వెంట టీఆర్ఎస్ జిల్లా నాయకులు జక్కంపూడి కృష్ణమూర్తి, దుడేటి వీరారెడ్డి, అనుమోలు బుద్ధి […]
సారథిన్యూస్, ఆసిఫాబాద్: మావోయిస్టలు తెలంగాణలోకి ప్రవేశించారని కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగుతున్నది. ఈ నేపథ్యంలో పోలీసులు సోమవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తర్యాని మండలపరిధిలోని అడువుల్లో తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. మావోయిస్టు పార్టీకి చెందిన ఓ అగ్రనేత, రాష్ట్రకమిటీ సభ్యుడు మైలవరకు అడెల్లు అలియాస్ భాస్కర్ త్రుటిలో తప్పించుకున్నట్టు సమాచారం. కాగా పోలీసులు, ప్రత్యేక బలగాలు ఈ అడవిని జల్లెడ పడుతున్నారు. పోలీసులకు విప్లవసాహిత్యం, మావోయిస్టుల యూనిఫాంలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, డిటోనేటర్లు, కార్దెక్స్ వైర్లు, పాలితిన్ […]