సామాజిక సారథి, హాలియా: భారతీయ యువ శాస్త్రవేత్త బానోతు వెంకటేశ్వర్లు కార్తీకమాసం సందర్భంగా సోమవారం తెల్లవారుజామున అనుముల మండలంలోని పేరూర్ గ్రామంలో వెలసిన స్వయంభూ సోమేశ్వరస్వామిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేదపండితులు మంగళ వాయిధ్యాలతో ఘనస్వాగతం పలికారు. యువ శాస్త్రవేత్త దేవాలయానికి విచ్చేసిన సందర్భంగా పేరూరు గ్రామ వాస్తవ్యులు అయినా సూర్యాపేట పట్టణ సీఐ అర్కపల్లి ఆంజనేయులు, ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో షేక్ షరీఫ్, పెద్దవూర ఎంపీపీ సలహాదారులు […]
న్యూఢిల్లీ: దేశచరిత్రలోనే ఇండియా మొదటిసారి ఆర్థిక మాంద్యంలోని అడుగుపెట్టబోతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. ప్రధాని నరేంద్రమోడీ అవలంభిస్తున్న విధానాల కారణంగానే బలంగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం బలహీనంగా మారిందని విరుచుకుపడ్డారు. ఈ మేరకు గురువారం ట్విట్టర్ వేదికగా కేంద్ర ప్రభుత్వం తీరుపై ఆయన మండిపడ్డారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఎలా కొట్టుమిట్టాడుతుందో న్యూస్ పేపర్లలో వచ్చిన రిపోర్టులను జతచేశారు. కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్ నాయకుడు […]
కరోనా మహమ్మారి భయానికి దేశమంతట తలుపులకు గొళ్లాలుపడ్డాయి. వైరస్కోరలకు తామెక్కడ చిక్కుకోవాల్సి వస్తుందోనని ఇరుగుపొరుగుతో బంధాలు తెంచుకున్నాయి. కానీ, ఆరోగ్య కార్యకర్తలు మాత్రం మహమ్మారి సైరన్దేశంలో మోగడంతోనే గడపదాటారు. ఇంట్లోని పిల్లాజల్లా వద్దని వాదించినా దేశమంతా లాక్డౌన్లో ఉంటే వీళ్లు మాత్రం ప్రాణాలకు తెగించి రోడ్డెక్కారు. ముఖ్యంగా మహిళలు పేగులు మెలిపెట్టే నెలసరి నొప్పులు, దీర్ఘకాలికంగా ఉన్న ఆరోగ్య సమస్యలను లెక్కచేయకుండా కరోనా కట్టడికి అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ ఏ మాత్రం అలుపెరగకుండా కరోనాతో కంటికి కనిపించని […]
పాకిస్థాన్‌లో మైనార్టీలకు రక్షణ కరువైంది. హిందువులు, హిందూ దేవాలయాలపై దాడులు జరగడం అక్కడ పరిపాటిగా మారింది. తాజాగా సింధ్ ప్రావిన్స్‌లోని బదిన్ సింద్ పాకిస్థాన్ ప్రాంతంలో ‘శ్రీ రామ్ మందిర్’ను గుర్తు తెలియని వ్యక్తులు విధ్వంసం చేశారు. ఈ మధ్య కాలంలో హిందూ దేవాలయాలను విధ్వంసం చేయడం పాకిస్థాన్‌లో పరిపాటిగా మారింది. బదిన్ ప్రావిన్స్‌లోని కరియో ఘన్వర్ ప్రాంతంలో ఈ మందిరం వుండేది. అక్టోబర్ 10వ తేదీ రాత్రి కొందరు దుండగులు ఈ మందిరాన్ని కూల్చి వేశారు. […]
ఐసీఎంఆర్ హెచ్చరిక న్యూఢిల్లీ: చైనాలో పుట్టిన కరోనా వైరస్‌తో ఇప్పటికే తల్లడిల్లుతున్న భారత్‌కు ఆ దేశం నుంచి మరో ప్రమాదకర వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ప్రకటించింది. పందుల్లో ఉండే ‘క్యాట్ క్యూ వైరస్’ (సీక్యూవీ) దోమల ద్వారా భారత్‌లోకి ప్రవేశించే ప్రమాదం ఉందని సోమవారం హెచ్చరించింది. ఈ వైరస్ క్యూలెక్స్ దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఐసీఎంఆర్, పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కలిసి దేశవ్యాప్తంగా […]
భారత్ లో కరోనా విలయతాండవం.. న్యూఢిల్లీ: భారత్ లో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉన్నది. గత 24 గంటల్లో నమోదైన కేసులతో కలుపుకుని.. దేశంలో దీని బారినపడిన వారి సంఖ్య 60 లక్షలకు చేరువైంది. కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 88,600 మంది ఈ వైరస్ బారినపడ్డారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 59,92,533కు చేరింది. వీరిలో 49 లక్షల మందికిపైగా కోలుకోగా.. 9 లక్షలకు పైగా […]
మాకు నిర్ణయాధికారం ఇవ్వరా? ఐరాస వీడియోకాన్ఫరెన్స్‌లో ప్రధాని మోడీ న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్‌కు ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో నిర్ణయాధికారం నుంచి ఇంకెంతకాలం దూరంగా ఉంచుతారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రశ్నించారు. ఐరాస సర్వప్రతినిధి సభ 75వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వర్చువల్ సమావేశంలో పాల్గొన్న మోడీ ఈ సందర్భంగా ఐరాస అనుసరిస్తున్న వైఖరిపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఐరాసలో సంస్కరణలు చేయాలని భారత్ ఎంతోకాలంగా ఎదురుచూస్తోందని అన్నారు. అయితే అవి ఎప్పటికీ కార్యరూపం దాల్చుతాయోననీ, […]
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టేందుకు మరో పవర్ఫుల్ వ్యాక్సిన్ రాబోతున్నది. ప్రస్తుతం చివరి అంటే మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తిచేసుకున్న ఈ వ్యాక్సిన్ ఈ ఏడాది చివరినాటికే అందుబాటులోకి రానున్నట్టు సమాచారం. ఈ వ్యాక్సిన్‌ను ప్రముఖ సంస్థ జాన్సన్ & జాన్సన్ తయారు చేస్తున్నది. అయితే ఈ వ్యాక్సిన్ కేవలం ఒక్కడోసు వేసుకుంటే సరిపోతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటికే అభివృద్ధి చేస్తున్న చాలా వ్యాక్సిన్లు రెండు డోసుల వేసుకోవాల్సి ఉన్నది. అయితే జాన్సన్ […]