Breaking News

చైనా నుంచి మరో వైరస్‌ ముప్పు

మరో వైరస్​ ముప్పు

  • ఐసీఎంఆర్‌ హెచ్చరిక

న్యూఢిల్లీ: చైనాలో పుట్టిన కరోనా వైరస్‌తో ఇప్పటికే తల్లడిల్లుతున్న భారత్‌కు ఆ దేశం నుంచి మరో ప్రమాదకర వైరస్‌ వ్యాపించే ప్రమాదం ఉందని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ప్రకటించింది. పందుల్లో ఉండే ‘క్యాట్‌ క్యూ వైరస్‌’ (సీక్యూవీ) దోమల ద్వారా భారత్‌లోకి ప్రవేశించే ప్రమాదం ఉందని సోమవారం హెచ్చరించింది. ఈ వైరస్‌ క్యూలెక్స్‌ దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఐసీఎంఆర్‌, పుణేలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ కలిసి దేశవ్యాప్తంగా 883 సీరమ్‌ నమూనాలు సేకరించగా అందులో ఇద్దరిలో సీక్యూవీ వైరస్‌ను ఎదిరించే యాంటీబాడీలు ఉన్నట్టు గుర్తించారు. కర్ణాటకకు చెందిన ఈ ఇద్దరికి సీక్యూవీ సోకి తగ్గిపోయినట్టు నిర్ధారించారు. ఈ సర్వే ఆధారంగా సీక్యూవీ వైరస్‌ను గుర్తించే టెస్టును అభివృద్ధి చేశారు. చైనా, వియత్నాంలో ఈ వైరస్‌ వేగంగా వ్యాప్తిస్తున్నట్లు తెలుస్తోంది.