Breaking News

Day: December 29, 2021

తెలంగాణ నుంచి మరో టీకా

తెలంగాణ నుంచి మరో టీకా

బయోలాజికల్‌ సంస్థకు మంత్రి కేటీఆర్ ​అభినందనలు సామాజికసారథి, హైదరాబాద్‌: తెలంగాణ నుంచి మరో కోవిడ్‌ టీకా మార్కెట్‌లోకి రావడంపై మంత్రి కె.తారక రామారావు హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. భారత్‌ బయోటెక్‌ కోవాగ్జిన్‌ టీకాను విడుదల చేయగా, తాజాగా తెంగాణకు చెందిన ‘బయలాజికల్‌ ఈ’ కంపెనీ’ కార్బివాక్స్‌’ అనే కోవిడ్‌ టీకాను త్వరలోనే విడుదల చేయనుంది. ఈ సందర్భంగా ‘బయలాజికల్‌ ఈ’ కంపెనీ సీఈవో మహిమ దాట్ల, ఆమె బృందానికి మంత్రి అభినందనలు తెలిపారు. ఈ […]

Read More
డీజేగీజే జాన్తానై!

డీజే గీజే జాన్తానై!

న్యూఇయర్‌ వేడుకలపై పోలీస్‌ ఆంక్షలు స్థానికులకు ఇబ్బంది కలిగించినా చర్యలు తాగి రోడ్లపై హంగామా చేస్తే కటకటాలే హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ హెచ్చరిక సామాజికసారథి, హైదరాబాద్‌: డిసెంబర్‌ 31 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైన్‌ షాపులు, పబ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇస్తే.. మరోవైపు హైదరాబాద్‌ పోలీసులు మాత్రం న్యూ ఇయర్‌ వేడుకలపై ఆంక్షలు విధించారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌ పోలీస్‌ కొత్త బాస్‌ సీవీ ఆనంద్‌ ఒక ప్రకటన […]

Read More
మహిళా కండక్టర్లకు వెసులుబాటు

మహిళా కండక్టర్లకు వెసులుబాటు

రాత్రి 8గంటల కల్లా డ్యూటీ విరిమించేలా సజ్జనార్​ఆదేశాలు సామాజిక సారథి, హైదరాబాద్‌: మహిళా కండక్టర్లు రాత్రి 8 గంటలకల్లా తమ డిపోలకు చేరేలా డ్యూటీలు వేయాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని పేర్కొన్నారు. ఆర్టీసీలో సుదీర్ఘ సమ్మె ముగిసిన తర్వాత 2019 డిసెంబర్​1వ తేదీన అన్నిస్థాయిల ఉద్యోగులతో సీఎం కేసీఆర్‌ నిర్వహించిన సమావేశంలో డ్యూటీ సమయాలు ఇబ్బందికరంగా ఉన్నాయని పలువురు మహిళా కండక్టర్లు ఫిర్యాదు చేశారు. రాత్రి […]

Read More
పెట్రోల్‌పై రూ.25 తగ్గింపు

పెట్రోల్‌ పై రూ.25 తగ్గింపు

ఖార్ఖండ్​ ప్రభుత్వం కీలక నిర్ణయం హర్షం వ్యక్తం చేస్తున్న వాహనదారులు రాంచి: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరిగినవేళ జార్ఖండ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వంద దాటిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిరోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. పెట్రోల్‌ పై రూ.ఐదు, డీజిల్‌ పై రూ.10 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. కేంద్రం తగ్గించిన ధరలకు అనుగుణంగా అనేక రాష్ట్రాలు కూడా పెట్రోల్‌ […]

Read More
బహుజన రాజ్యాధికార సాధన

బహుజన రాజ్యాధికార సాధన

  • December 29, 2021
  • Comments Off on బహుజన రాజ్యాధికార సాధన

ఓయూ నుంచే మొదలవ్వాలి బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ​కోఆర్డినేటర్​ డాక్టర్​ ఆర్ఎస్​ ప్రవీణ్ కుమార్​​ ఉద్యోగ, విద్యార్థి సంఘాల ఆత్మీయ సమ్మేళనం  సామాజికసారథి, హైదరాబాద్: బహుజన రాజ్యాధికార సాధన ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీ నుంచే మొదలుకావాలని బీఎస్పీ రాష్ట్ర చీఫ్​ కోఆర్డినేటర్ ​డాక్టర్ ​ఆర్ఎస్ ​ప్రవీణ్ కుమార్ ​​ఆకాంక్షించారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల నేతలు ప్రాతినిథ్యం వహిస్తేనే పేదల బతుకులు మారుతాయని అన్నారు. మనువాదుల కుట్రలు విప్పాలంటే బహుజన […]

Read More
సిద్దిపేట లెక్కనే నల్లగొండ కావాలె

సిద్దిపేట లెక్కనే నల్లగొండ కావాలె

హంగులు, మౌలిక వసతులతో తీర్చిదిద్దాలి దశాబ్దాలుగా పట్టిన దరిద్రం పోవాలె లాండ్ పూలింగ్ చేపట్టి కాలనీలు నిర్మించాలి అద్భుతంగా టౌన్​హాల్, మినీ ట్యాంక్​బండ్​ నిబద్ధతతో పనిచేసే కమిషనర్ ను నియమించండి ప్రాజెక్టు కాలనీవాసులకు ఇళ్లపట్టాలు నల్లగొండ అభివృద్ధిపై సీఎం కేసీఆర్​సమీక్ష ఎమ్మెల్యే గాదరి కిశోర్​కుటుంబానికి ముఖ్యమంత్రి, మంత్రుల పరామర్శ సామాజికసారథి, నల్లగొండ ప్రతినిధి: రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల మాదిరిగానే చారిత్రక నల్లగొండ మున్సిపాలిటీ కూడా మరింతగా పురోభివృద్ధి చెందాలని, నల్లగొండకు దశాబ్దాలుగా పట్టిన దరిద్రం పోవాలని, […]

Read More
రేవంత్ రెడ్డి పర్యటనలో మార్పు

రేవంత్ రెడ్డి పర్యటనలో మార్పు

  • December 29, 2021
  • Comments Off on రేవంత్ రెడ్డి పర్యటనలో మార్పు

సామాజిక సారథి, శాయంపేట: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రచ్చబండ కార్యక్రమంలో భాగంగా పీసీసీ చీప్ రేవంత్ రెడ్డి ఈనెల30వ తేదీన జయశంకర్ భూపాలపల్లి జిల్లా శాయంపేట మండలానికి రానున్న సంగతి తెలిసిందే. అయితే అనివార్య కారణాలతో ఈ నెల 31కి కార్యాక్రమాన్ని మార్చినట్లు భూపాలపల్లి ఇన్ చార్జి గండ్ర సత్యనారాయణ తెలిపారు. నాయకులు మారిన తేదీని దృష్టిలో ఉంచుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Read More
రౌడీషీట్లు ఎత్తివేయాలి హోంమంత్రిని కలిసిన ఎమ్మెల్యే

రౌడీషీట్లు ఎత్తివేయాలి హోంమంత్రిని కలిసిన ఎమ్మెల్యే

సామాజిక సారథి, హలియా: ఉద్యమకారులపై రౌడీషీట్లను ఎత్తివేయాలని ఎమ్మెల్యే నోముల భగత్ హోంమంత్రి మహమూద్ అలీకి వినతిపత్రం సమర్పించారు. హైదరాబాద్ మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి  ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై పోలీసులు పెట్టిన రౌడీషీట్లను ఎత్తివేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి కలిసి వినతిపత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందిస్తూ రౌడీషీట్లు ఎత్తివేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని భగత్ తెలిపారు. హోంమంత్రికి వినతి పత్రం సమర్పించేందుకు పలువురు ఉద్యమకారులు అభినందనలు తెలియజేశారు.

Read More