సారథి న్యూస్, రామడుగు/ రామాయంపేట /చిన్నశంకరంపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ పేద ప్రజలకు గుదిబండ అని బీజేపీ రాష్ట్ర కార్య వర్గ సభ్యుడు మురళి విమర్శించారు. ఎల్ఆర్ఎస్ను నిరసిస్తూ మంగళవారం కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎల్ ఆర్ ఎస్ పేరుతో తీసుకొచ్చిన జీవో 131 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని డిమాండ్ […]
ప్రధాని నరేంద్రమోడీ సంతాపం న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు జస్వంత్ సింగ్(82) కన్నుమూశారు. 2014 లో తలకు దెబ్బతగిలి గత ఆరేళ్లుగా కోమాలో ఉన్న ఆయన.. ఆదివారం ఉదయం ఢిల్లీలో ఉన్న తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. రాజస్థాన్ లోని జోధ్‌పూర్ కు చెందిన జశ్వంత్ సింగ్.. బీజేపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. రాజకీయాల్లోకి రాకముందు పదేళ్ల పాటు ఆయన ఆర్మీలో సేవలందించారు. వాజ్ పేయి ప్రభుత్వంలో పలు కీలక హోదాల్లో మంత్రిగా […]
బీజేపీలో డీకే అరుణ, పురందేశ్వరికి కీలక పదవులు పదవులు దక్కని రాంమాధవ్, మురళీధర్ రావు బిహార్ ఎన్నికల వేళ బీజేపీ కొత్త కార్యవర్గం న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ కార్యవర్గంలో ఆ పార్టీ మహిళా నేతలు, మాజీమంత్రులు డీకే అరుణ, పురందరేశ్వరికి కీలక పదవులు దక్కాయి. బిహార్ ఎన్నికల వేళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొత్త టీమ్‌ను ప్రకటించారు. కీలక పదవుల నుంచి కొందరిని తప్పించారు. కొత్తవారికి, యువతకు కీలక పదవులు కట్టబెట్టారు. పార్టీ జాతీయ […]
న్యూఢిల్లీ : కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్ అంగడి కరోనా సోకి మరణించారు. లక్షణాలేమీ లేకున్నా (అసింప్టమేటిక్) కరోనాతో రెండువారాల క్రితం ఢిల్లీలోని ఏయిమ్స్‌లో చేరిన ఆయన.. బుధవారం తుదిశ్వాస విడిచారు. చికిత్స తీసుకుంటున్న సమయంలోనే ఆయనకు శ్వాసకోస ఇబ్బందులు తలెత్తడంతో ఆరోగ్యం క్షీణించింది. కోవిడ్ వల్ల మరణించిన తొలి కేంద్ర మంత్రి ఆయనే. కర్నాటకకు చెందిన సురేశ్ అంగడి.. బెల్గావి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2004 నుంచి వరుసగా నాలుగుసార్లు […]
సారథి న్యూస్, రామడుగు: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లు శనివారం పార్లమెంట్ లో ఆమోదం పొందటం పట్ల రామడుగు బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం కరీంనగర్ జిల్లా రామడుగులో బీజేపీ నాయకులు నరేంద్రమోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కట్ట రవీందర్, అంజిబాబు, రాజేంద్రచారి, రాజు, సత్యనారాయణ, భరత్, శ్రీకాంత్, వెంకటేశ్, గాలిపల్లి రాజు, శ్రీనివాస చారి, పోచమల్లు, మల్లేశం పాల్గొన్నారు.
సారథి న్యూస్, శ్రీకాకుళం: బీజేపీ చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా మంగళవారం శ్రీకాకుళం జిల్లా పాలకొండ సచివాలయ ఆవరణలో సీపీఎం నేతలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకుడు దావాల రమణారావు, ఎన్ఏ రాజపురం శాఖ కార్యదర్శి అర్తమూడి లక్ష్మణరావు మాట్లాడుతూ.. ప్రధాని మోడీ చేసిన పెద్దనోట్ల రద్దు, జీఎస్ టీ అమలు దేశప్రజల ఆర్థిక పరిస్థితిని తీరోగమనంలోకి నెట్టేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధాంతరంగా లాక్డౌన్విధించి వలస కార్మికుల […]
సారథి న్యూస్, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) మండలాధ్యక్షుడిగా కొయ్యడ కార్తీక్ ఎన్నికయ్యారు. తనపై నమ్మకంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి పదవి బాధ్యతలను అప్పగించినందుకు కృతజ్క్షతలు తెలిపారు. కార్తీక్ ఎన్నిక పట్ల హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జ్ చాడ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి విజయ్ పాల్ రెడ్డి, అక్కన్నపేట మండలాధ్యక్షుడు గొల్లపల్లి వీరాచారి, బీజేపీ సీనియర్ […]
ఢిల్లీ: తీవ్ర గందరగోళ పరిస్థితుల నడుమ నిన్న రాజ్యసభలో వ్యవసాయ బిల్లులు ఆమోదించిన సంగతి చెలరేగింది. బిల్లు చర్చ సందర్భంగా పలువురు ఎంపీలు రాజ్యసభలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఓ దశలో చైర్మన్ పోడియం దగ్గరకు వెళ్లి పెద్దపెట్టు నినాదాలు చేశారు. కాగా సభలో అనుచితంగా ప్రవర్తించిన ఎనిమిది మంది ఎంపీలపై సోమవారం రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సస్పెండ్ వేటు వేశారు. వారంపాటు వీరిని సభనుంచి బహిష్కరించారు. సోమవారం సభ ప్రారంభంకాగానే మంత్రి ప్రహ్లద్జోషి సస్పెన్షన్ […]