Breaking News

నిరసన

అంగన్వాడీ టీచర్లను తొలగించద్దు

అంగన్వాడీ టీచర్లను తొలగించద్దు

సామాజిక సారథి, నాగర్ కర్నూల్: అంగన్వాడి టీచర్ల సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సంఘం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీ వ్యవస్థను తొలగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని, ఆ ఆలోచనను విరమించుకుని నెలకు రూ.26 వేల వేతనం అమలు చేయాలని, పెన్షన్ […]

Read More
బెల్లి లలితను కించపరిచే సన్నివేశాలు’

‘బెల్లి లలితను కించపరిచే సన్నివేశాలు’

సామాజిక సారథి, హైదరాబాద్‌: గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ జీవిత చరిత్ర ఆధారంగా విడుదలైన నయీమ్‌ డైరీస్‌ సినిమాను తెలంగాణ ఉద్యమకారులు అడ్డుకున్నారు. సినిమాలో తెలంగాణ ఉద్యమకారిని బెల్లి లలితను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని ఆరోపించారు. హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లో సంధ్య థియేటర్‌ వద్ద తెలంగాణ ఉద్యమకారులు ఆందోళనకు దిగారు. నయీమ్‌ డైరీస్‌ సినిమా పోస్టర్‌ ఫ్లెక్సీలను చించివేసి దహనం చేశారు. సినిమాను సంధ్య 35 ఎం.ఎం థియేటర్‌లో విడుదల కాకుండా అడ్డుకున్నారు. ఈ సినిమాను బ్యాన్‌ […]

Read More
పార్లమెంట్ సమావేశాల బహిష్కరణ

పార్లమెంట్ సమావేశాల బహిష్కరణ

కేంద్రం తీరుకు నిరసనగానే బాయ్‌కాట్‌ చేస్తున్నాం పార్లమెంట్‌ ఆవరణలో టీఆర్‌ఎస్‌ ఎంపీల నిరసన న్యూఢిల్లీ: ధాన్యం సేకరణ, విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్​ఎంపీలు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలను బహిష్కరించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా మంగళవారం ఉభయసభల టీఆర్‌ఎస్‌ సభ్యులు నల్లటి దుస్తులు ధరించి సభకు హాజరయ్యారు. అయితే విపక్షాల ఆందోళనలతో రాజ్యసభ ఐదు నిమిషాలకే వాయిదా పడింది. లోక్‌సభ మాత్రం విపక్షాల నినాదాల మధ్యే కొనసాగుతుండగా టీఆర్‌ఎస్‌ సభ్యులు […]

Read More
అయిదవ రోజు అదే రభస

ఐదోరోజూ అదే రభస

ధాన్యం కొనుగోళ్లపై పట్టువీడని టీఆర్‌ఎస్‌ తెలంగాణలో ధాన్యం దిగుబడి పెరిగిందన్న నామా ప్రొక్యూర్‌మెంట్‌ పాలసీ ప్రకటించాలని డిమాండ్‌ రాజ్యసభ నుంచి వాకౌట్‌ చేసిన విపక్షాలు న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోళ్లపై ఐదోరోజూ గురువారం పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీల ఆందోళన కొనసాగింది. టీఆర్ఎస్​ ఎంపీలు కేంద్రప్రభుత్వాన్ని  నిలదీశారు. ప్రొక్యూర్మెంట్‌ పాలసీని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టారు. ప్లకార్డులు పట్టుకుని కేంద్రానికి వ్యతిరేకంగా నినదించారు. ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు.. వెల్‌లోకి దూసుకువెళ్లి రైతులను కాపాడాలని నినాదాలు చేశారు. […]

Read More
ఎడ్లబండ్లతో నిరసన

ఎడ్లబండ్లతో నిరసన

సామజిక సారథి, రాజోలి : డీజిల్‌, పెట్రోల్‌ ధరలపై వ్యాట్‌ను వెంటనే తగ్గించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల కేంద్రంలోని గాంధీ చౌక్ నుంచి ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించి నెలరోజులు గడుస్తున్నా… తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు వ్యాట్ ను తగ్గించలేదని ఆయన అన్నారు. ప్రభుత్వం […]

Read More

సింగరేణిని కాపాడుకుందాం

సారథిన్యూస్​, గోదావరిఖని: సింగరేణి సంస్థను ప్రైవేట్​పరం కాకుండా కాపాడుకుందామని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం పెద్దపల్లి జిల్లాలోని ఆర్​జీవన్​ ఏరియాలో సీఐటీయూ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు ప్లకార్డ్స్​ ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. కార్మికహక్కులను కాపాడుకొనేందుకు ప్రతి కార్మికుడు ఉద్యమించాలని కోరారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ.. దేశంలోని బొగ్గుపరిశ్రమలను ప్రైవేట్​పరం చేసేందుకు కేంద్రప్రభుత్వం కుట్రపన్నుతోందని ఆరోపించారు. కార్యక్రమంలో కార్మికసంఘం నాయకులు మెండె శ్రీనివాస్, నంది నారాయణ, బీ రవి, మెండయ్య, ఓదెలు, […]

Read More
నిరసన వ్యక్తం చేస్తున్న మున్సిపల్​ కార్మికులు

పారిశుద్ధ్య కార్మికుల నిరసన బాట

సారథి న్యూస్, రామాయంపేట: పారిశుద్ధ్య కార్మికులకు సీఎం కేసీఆర్​ ప్రకటించిన రూ.5000 వేల ఇన్సెంటివ్​, పెరిగిన రూ. 8500 జీతం వెంటనే ఇవ్వాలని పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. కరీంనగర్​ జిల్లా ఉమ్మడి రామాయంపేట మండలంలోని పలుగ్రామాల పారిశుద్ధ్య కార్మికులు ఆయా గ్రామపంచాయతీ కార్యాలయాల దగ్గర ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ నిరసన తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకుడు నింగోళ్ల సత్యం తదితరులు పాల్గొన్నారు. కార్మికులందరికీ బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్​ చేశారు.

Read More
జలదీక్షలో పాల్గొన్న కాంగ్రెస్​ నేతలను అరెస్ట్​ చేస్తున్న పోలీసులు

కమీషన్ల కోసమే ప్రాజెక్టులు

సారథి న్యూస్​, హుస్నాబాద్ : టీఆర్​ఎస్​ ప్రభుత్వం కమీషన్ల కోసమే సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నదని ఏఐసీసీ కార్యదర్శి సంపత్​కుమార్​ పేర్కొన్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన జలదీక్షలో భాగంగా సిద్దిపేట్ జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల వద్ద కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంపత్​కుమార్​ మాట్లాడుతూ.. మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల భూమిపూజ […]

Read More